Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి దోపిడీ, లూఠీతో ఏపీపై రూ.7.76లక్షలకోట్ల అప్పుల భారం

– సంక్షేమం పేరుతో తుగ్లక్ రెడ్డి ఏపీని సంక్షోభంలోకి తీసుకెళ్తున్నాడని రిజర్వ్ బ్యాంక్ సహా, ఆర్థికవేత్తలు, ప్రముఖులు తీవ్రంగా ఆందోళనచెందుతున్నారు
– శ్రీలంకప్రజల మాదిరే, రాష్ట్రవాసులుకూడా గుక్కెడునీరు, తిండికోసం రోడ్లపైకి వచ్చేరోజు దగ్గర్లోనే ఉందని వాపోతున్నారు నగదుబదిలీపేరుతో బటన్లునొక్కుతున్న ముఖ్యమంత్రి, ప్రజలకు పావలాఇస్తూ, వారినుంచి పదిరూపాయలు కొట్టేస్తున్నాడు
• సంక్షేమంపేరుతో చేస్తున్న అప్పులతో ఏపీ దివాళా అంచులకు చేరిందని ప్రింట్ పత్రిక పేర్కొంది
• ఏపీపై ఉన్న మొత్తం అప్పు 7.76లక్షలకోట్లు. అంతసొమ్ము దేనికి ఖర్చుపెట్టారంటే పాలకులవద్ద సమాధానంలేదు
• శ్రీలంకలోఉన్న పరిస్థితులు మక్కీకి మక్కీ ఏపీలో ఉన్నాయి
• బటన్లు నొక్కుతూకూర్చుంటున్న సీఎం, ఎంత సొమ్ముప్రజలకోసం ఖర్చుపెట్టాడంటే నీళ్లునములుతున్నాడు
-టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి

నేరచరిత్ర కలిగిన ఆర్థిక ఉగ్రవాది రాష్ట్ర పాలకుడు కావడంతో ప్రజలంతారోడ్లపాలయ్యే స్థితికి వస్తే, ఏకంగా రాష్ట్రం మరోశ్రీలంకలా మారనుందని, ఆంగ్ల దినపత్రిక దిప్రింట్ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘ఆర్థికసంక్షోభంలో ఆంధ్రప్రదేశ్-అప్పులఊబిలోఏపీప్రజలు’ అంటూ తీవ్రఆందోళన వ్యక్తంచేసిందని, జగన్ రెడ్డి తన మూడేళ్ల పాలనలో ఏపీపై రూ.7.76లక్షలకోట్ల అప్పులభారం మిగిల్చి, అంతిమంగా సంక్షేమంపేరుతో లూఠీచేస్తూ అంతిమంగా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాడని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాది రాష్ట్ర పాలకుడు అవ్వడంతో ఈ శుభకృతు నామసంవత్సరంలో ఏపీ ప్రజలకు అన్నీఅశుభాలు.. అపశకునాలే. రాజపూజ్యం స్థానంలో అవమానాలు, అప్పులే మిగిలాయి. తుగ్లక్ రెడ్డి చర్యలతో రాష్ట్రం ఆర్థికసంక్షోభంలోకి కూరుకుపోయింది. రాజకీయాలు, ఆర్థికాంశాలు ముడిపెడితే మిగిలేది సంక్షోభమేనని తెలుసుకో జగన్ రెడ్డి. సంక్షేమంపేరుతో చేస్తున్న అప్పులతో ఏపీ ఆర్థికంగాదివాళా అంచులకు చేరిందని ది ప్రింట్ పత్రిక తన వెబ్ సైట్లో పేర్కొంది. ది ప్రింట్ పత్రిక కథనంపై, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ లేవనెత్తుతున్న ఆర్థిక అభ్యంతరాలపై ముఖ్యమంత్రి ఎందుకు నోరెత్తడు?

జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నానాటికీ అప్పులఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికి ఏపీపై ఉన్న మొత్తం అప్పు 7.76లక్షలకోట్లు. అంతసొమ్ము దేనికిఖర్చుపెట్టారంటే పాలకులవద్ద సమాధానంలేదు. ప్రభుత్వంపైకి చెప్పేది రూ.3.86లక్షలకోట్లని..కానీ కార్పొరేషన్లు, ఇతరప్రభుత్వరంగసంస్థలను తాకట్టుపెట్టి, మద్యంఅమ్మకాలు, ఇతరత్రా ఆదాయవనరుల్ని తనఖాపెట్టి తీసుకొచ్చిన అప్పులన్నీ లెక్కగడితే మొత్తంగా రాష్ట్రంఅప్పు రూ.7.76లక్షల కోట్లుగా తేలింది. మూడేళ్లలోనే జగన్ రెడ్డి , రాష్ట్రప్రజలపై మోయలేని రుణభారంమోపాడు. టీడీపీప్రభుత్వంలో ఈ ప్రభుత్వంకంటే మిన్నగా ప్రజలకు వివిధరకాల సంక్షేమపథకాలు అమలయ్యాయి.

ఎప్పుడూ, ఎలాంటి పన్నులు, ఛార్జీలభారం చంద్రబాబునాయుడి ప్రభుత్వం ప్రజలపై వేయలేదు. టీడీపీఅధికారంలోఉన్న ఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వంపై ఉన్న అప్పు కేవలం రూ.2.56లక్షలకోట్లుమాత్రమే. ఆ అప్పులతాలూకా చెల్లింపులను ఏటా క్రమంతప్పకుండా ప్రజలపైఎలాంటిభారంలేకుండానే గతప్రభుత్వం చెల్లించింది. జగన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు,పెన్షనర్లకు, ఇతరత్రా వస్తువుల సరఫరాదారులకు చెల్లించాల్సిన సొమ్మే దాదాపు రూ.లక్షా50వేలకోట్లవరకు ఉంది. 7.76లక్షలకోట్లు అప్పులుతెచ్చిన జగన్ రెడ్డి, ఆ సొమ్మంతా ఏంచేశాడో ఎవరికీతెలియదు.

చివరకు అంగన్ వాడీలకు పాలు, కోడిగుడ్లుసరఫరాచేసే కాంట్రాక్టర్లకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితికి మాత్రం రాష్ట్రాన్ని తీసుకొచ్చేశాడు. చిన్నారుల కడుపునింపకుండా, వారిని అర్థాకలితో ఏడిపిస్తున్న జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని మాత్రం ఎక్కడికో తీసుకెళతానంటూ చివరకు శ్రీలంకసరసన చేర్చేలా ఉన్నాడు. శ్రీలంకలోఉన్న పరిస్థితులు మక్కీకి మక్కీ ఏపీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరోశ్రీలంక కాకూడదని కోరుకుంటున్నాం.

శ్రీలంకపాలకులు కూడా ఆదేశంలో ఉన్న వనరులను సద్వినియోగంచేసుకోకుండా, ప్రజలపై భారాలుమోపుతూ, ఇష్టానుసారం అప్పులుతెచ్చి, ఏకంగా దేశాన్నే అమ్మేసే స్థితికివచ్చారు. ఆఖరికి శ్రీలంకలో మంచినీరు, పెట్రోల్ లాంటివి కూడా రూ.500లకు చేరాయి. ఎంతఖర్చుపెట్టినా అసలు అవిదొరికే పరిస్థితిలేదు. దానికి తోడు తీవ్రమైన ఆహారసంక్షోభంకూడా ఏర్పడింది. లంకపాలకుల అనాలోచితచర్యలతో ఆ దేశం కూడా తీవ్రంగా విద్యుత్ కోతలు ఎదుర్కొంటోంది. చివరకు ఆదేశం 51బిలియన్ డాలర్ల అప్పులు తీర్చలేక మారటోరియం ప్రకటించేసింది.

అదేవిధంగా జగన్ రెడ్డికూడా సంక్షేమం పేరుతో , ప్రజలకు ఏదోచేస్తున్నానంటూ వారిని మోసగిస్తూ ఇష్టానుసారం అప్పులు తెస్తూ, దిగమింగుతున్నాడు. జీఎస్ డీపీలో 70శాతం ఆదాయాన్ని అప్పులకే చెల్లించేదుస్థితికి ఏపీ వచ్చింది. సంక్షేమం పేరుతో రాష్ట్రాలు చేస్తున్న అప్పులతో ఆయారాష్ట్రాలు దివాళాతీయడానికి సిద్ధంగాఉన్నాయని ప్రింట్ పత్రిక పేర్కొంటే, రిజర్వ్ బ్యాంక్ వారుకూడా ఏపీ అప్పులపై తీవ్రమైన ఆందోళనవెలిబుచ్చారు.

తాడేపల్లి ప్యాలెస్ లో బటన్లు నొక్కుతూ కూర్చుంటున్న సీఎం, ఎంత సొమ్ముప్రజలకు ఇచ్చాడంటే నీళ్లునములుతున్నాడు. ప్రజలకు పావలాఇస్తూ, వారినుంచి ముక్కుపిండి వివిధరూపాలలో పదిరూపాయలదాకా వసూలుచేస్తున్నాడు. ఆర్థికసంక్షోభంతోపాటు, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తడానికి జగన్ రెడ్డి అనాలోచిన చర్యలే కారణం. తనస్వార్థంతో, అత్యాశతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనంచేసిన సీఎం, చివరకు పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించాడు.

ప్రజలకు విద్యుత్ కోతలు మిగిల్చాడు. పీపీఏలు సరిగా అమలుచేయకపోవడం, బొగ్గునిల్వలపై జాగ్రత్తపడకపోవడంతో ఏప అంధకారప్రదేశ్ గా మారిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. రాష్ట్రంలో దేశంలోఎక్కడాలేని విధంగా లీటర్ పెట్రోల్ రూ.122కి చేరింది. డీజిల్ ధర రూ.107లు అయితే, కందిపప్పు ధర రూ.140కి, వంటనూనె కేజీ రూ.240కి చేరింది. శ్రీలంకలోకూడా ఇలానే అన్నిరకాల నిత్యావసరాల ధరలు విపరీతంగాపెరిగిపోయి, ప్రజలు తినడానికి తిండికూడా లేక నానా అవస్థలు పడుతున్నారు. జగన్ రెడ్డి జమానాలో అన్నివర్గాలవారు బతకడమే కష్టంగా మారింది. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. చేతివృత్తులు, కులవృత్తులవారికి పూటగడవడమే కష్టంగా మారింది. మహిళలకు కన్నీళ్లు, కడగండ్లే మిగిలాయి.

రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ ఎప్పుడో తరలిపోయాయి. ఉపాధి లేక రాష్ట్ర వ్యాప్తంగా వలసలు పెరిగాయి. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, వాడకంతో నేరాలు ఎక్కువైపోయాయి. మహిళలు, చిన్నారుల జీవితాలకు భద్రతలేకుండా పోయింది. దేశంలో ఎక్కడ మాదకద్రవ్యాలు పట్టుబడినా, ఏదోఒకసందర్భంలోఏపీ పేరే వినిపిస్తోంది. స్వయంగా అధికారపార్టీనేతలే దగ్గరుండి గంజాయిసాగు, అమ్మకాలు ప్రోత్సహిస్తూ, అక్రమార్జనకుపాల్పడుతున్నారు. యువత మత్తులోజోగుతే, తనఆటలు యథేఛ్చగా సాగుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టున్నాడు.

రాజమహేంద్రవరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలోఎన్నడూలేనివిధంగా గంజాయి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యమంత్రి ఏరికోరి వాలంటీర్లను నియమించింది…రాష్ట్రాన్ని రేప్ ల (అత్యాచారాల) రాజ్యంచేయడానికా? మొన్నటికి మొన్న సీతానగరం మండలంలో వాలంటీర్ ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అలాంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యం ఏదోఒకమూలన జరుగుతూనేఉన్నాయి. తాను నియమించిన వాలంటీర్లు కాబట్టి….వారేంచేసినా ముఖ్యమంత్రికి కనిపించదు.

అధికార పార్టీ నేతలకు తెలియకుండా, రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం సాగుతుందంటే ఎవరూనమ్మరు. ఎక్కడో కేజీనో, అరకేజీనో పట్టుకుంటారు.. తరలిపోయే సరుకు మాత్రం టన్నులకొద్దీ ఉంటున్నది. దిశాచట్టంతో మహిళలకు రక్షణ వచ్చిందని చెప్పడం పచ్చిబూటకం. జే ట్యాక్స్ 20శాతంచెల్లిస్తేనే రాష్ట్రంలోకి మంచిమద్యంబ్రాండ్లకు అనుమతిస్తామంటున్నారు. మద్యం అమ్మకాలతో ఏటా రూ.6వేలకోట్లవరకు తాడేపల్లి ప్యాలెస్ కుచేరుతోంది.

కేంద్రప్రాయోజిత పథకాలకు, విదేశీనిధులతో చేసే పనులకు టెండర్లు వేయడానికి ఏపీలో ఎవరూ ముందుకురాని పరిస్థితి. ఏపీప్రభుత్వం నిధులు దారిమళ్లిస్తోందని గ్రహించిన కేంద్రం, తామే తమపథకాలకు నేరుగా నిధులుచెల్లిస్తామనిచెప్పేసింది. ఈప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గున్నా, కేంద్రం అలాఎందుకు చెప్పిందో, నిధులు ఇవ్వమని ఎందుకు అన్నదో ఆలోచనచేయాలి. సీఎఫ్ఎంఎస్ పేరుతో నిధులుదారిమళ్లిస్తున్నందునే కేంద్రప్రభుత్వం కాంట్రాక్టర్లకు తామేనేరుగా నిధులుచెల్లిస్తామని తేల్చేసింది.

ఆహారభద్రతా చట్టానికి తూట్లు పొడుస్తున్నాడు
ఆహారభద్రతాచట్టానికి తూట్లు పొడిచేలా జగన్ రెడ్డి నగదుచెల్లింపులు చేస్తూ, తనమద్యం వ్యాపారం పెంచుకుంటున్నాడు. పేదలకడుపు నింపడానికి ఆహారభద్రతాచట్టాన్ని తీసుకొస్తే, ఈముఖ్యమంత్రి నగదుబదిలీపథకంతో పేదలబియ్యాన్ని తననాసిరకం మద్యం తయారీకి వినియోగిస్తున్నాడు. సన్నబియ్యం ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి, చివరకు దొడ్డబియ్యాన్నిపాలిష్ చేసి సరఫరాచేస్తున్నాడు.
బియ్యంవద్దు…డబ్బులు తీసుకోండి అంటూ ప్రభుత్వంసరఫరాచేస్తున్న బియ్యాన్నే తిరిగి ప్రజలనుంచి సేకరించి, విదేశాలకు తరలిస్తూ, మద్యంతయారీకి వినియోగిస్తున్నారు. రేషన్ బియ్యం స్థానంలో ప్రభుత్వమిచ్చే డబ్బు, తిరిగి ముఖ్యమంత్రి నడుపుతున్న మద్యం దుకాణాలకో, పెంచిన విద్యుత్ ఛార్జీలకో చెల్లించాల్సిన దుస్థితి. నగదుబదిలీపథకంతో ప్రజలు అడుక్కుతింటుంటే, ముఖ్యమంత్రి ఆదాయం పెరిగింది.

ముఖ్యమంత్రి నొక్కే బటన్లు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయో ప్రభుత్వం సమాధానంచెప్పగలదా? రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేని విధంగా కుంగదీసి, హాయిగా వెళ్లి జైల్లోకూర్చోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. ఆయన జైలుకు వెళ్తాడు సరే..కానీ అంతిమంగా నష్టపోయేది ప్రజలే. జగన్ రెడ్డి తీసుకొచ్చిన రైతుభరోసాకేంద్రాలతో రైతులకు ఏం ఒరగుతుందో ప్రభుత్వం సమాధానంచెప్పగలదా? ఎందరు రైతులకు రైతుభరోసా కేంద్రాలు ఎంతమేలుచేశాయో చెప్పాలి. ఏరంగం చూసినా అంతా అవినీతి మయమే. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది.

దేశంలో ఎక్కడాలేని విధంగా కోర్టులోని సాక్ష్యాలు మాయమైతే, నెల్లూరుజిల్లా ఎస్పీచిలుకపలుకులు పలుకుతున్నాడు. మంత్రిగారి ప్రమేయంలేకుండానేన్యాయస్థానంలోని గదిలోఉన్న సాక్ష్యాలు మాయం అయ్యాయా? అనుకోకుండా వచ్చిన దొంగలుచేతికి దొరికిన మంత్రిగారి కేసుతాలూకా సాక్ష్యాలే తీసుకెళ్లారా? ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎంతకాలం ప్రజల చెవుల్లో పూలుపెడతారు? నెల్లూరుకోర్టులో సాక్ష్యాలచోరీవ్యవహారంపై రాష్ట్రహైకోర్ట్ తక్షణమేజోక్యం చేసుకోవాలి. చోరీఘటనను సుమోటోగా స్వీకరించి వెంటనే విచారణజరిపి, అసలైన దోషుల్ని శిక్షించకపోతే, మున్ముందు మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది.

ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళాతీయిస్తుంటే, గవర్నర్ ఉత్సవవిగ్రహంలా ఉండటమేంటి?
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థికదుబారా, అప్పులపై కేంద్రం జోక్యంచేసుకోవాలి. ఆర్థిక దిగ్బంధంనుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రప్రభుత్వం తనవంతు చేయూతను అందించాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఏంచేస్తున్నాకూడా, తనకేమీసంబంధం లేదన్నట్లు గవర్నర్ వ్యవహరించడం బాధాకరం. గవర్నర్ ఉత్సవవిగ్రహం పాత్రకు పరిమితంకావడం బాధాకరం. రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ బడ్జెట్ తో సంబంధంలేకుండా రూ.48వేలకోట్ల దుర్వినియోగమైతే ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించరా?
కాగ్ నివేదిక గవర్నర్ కి కూడా వెళుతుందికదా.. ఆయనదానిపై స్పందించకపోతే ఈప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తుంటే చూస్తూఊరుకుంటారా? ముఖ్యమంత్రి చేసిన అప్పులతో భవిష్యత్ లో ప్రజలంతా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారనేది నగ్నసత్యం. సంక్షేమంపేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్లిన జగన్ రెడ్డి చర్యలు ఏపీప్రజలకు శాపాలుగా మారనున్నాయి.

LEAVE A RESPONSE