Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మళ్లీ ముసుగు తొలగించారు

-ఇద్దరూ తెలంగాణలో సమావేశమై ఏపీపై కుట్ర చేస్తున్నారు
-వారు ముందు నుంచి కలిసే ఉన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు
-వారిద్దరి భేటీ సాధారణమే. అందులో సంచలనం ఏమీ లేదు
-సంక్రాంతి ప్యాకేజీ కోసమే పవన్, చంద్రబాబు ఇంటికి వెళ్లారు
-పవన్‌ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టుపెట్డాడు
-కాపులనూ మూకుమ్మడిగా తాకట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు
-పవన్‌ను నమ్ముకున్న జనసేన కార్యకర్తలకు దిక్కు తోచడం లేదు
-ఎవరెన్ని కుట్రలు చేసినా, మళ్లీ మా విజయాన్ని ఎవరూ ఆపలేరు
-టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ భేటీపై పలువురు మంత్రుల స్పందన:

కారుమూరి నాగేశ్వరరావు. పౌర సరఫరాల శాఖ మంత్రి:
–చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ కలయిక కొత్త ఏమీ కాదు. ఇద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉన్నారు..
–రాష్ట్రం గురించి, ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు పట్టదు. వారిద్దరికీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.
– ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి అనేదే పవన్, చంద్రబాబు ప్లాన్‌
– పవన్‌కళ్యాణ్‌కు పేద ప్రజల ప్రాణాలు కంటే చంద్రబాబుబే ముఖ్యం.
– నాడు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్‌ కనీసం మాట్లాడలేదు.
– మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సభల్లో కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు 11 మంది బలైనా పవన్‌ నోరెత్తలేదు.
– కానీ ఇప్పుడు ఇద్దరూ తెలంగాణలో కలిశారు. ఏపీపై కుట్ర చేస్తున్నారు
– పవన్‌ కళ్యాణ్‌కు తనను నమ్ముకున్న కార్యకర్తల కంటే కూడా చంద్రబాబే ముఖ్యం అని నిరూపించాడు.
– ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు

గుడివాడ అమర్‌నాథ్‌. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి:
– ప్యాకేజ్‌ స్టార్‌ పవన్‌ పండగ మామూలు కోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. ఇద్దరి భేటీ కొత్త కాదు.
– మంత్రులపై జన సైనికులు దాడి చేస్తే చంద్రబాబు పరామర్శిస్తారు.
– చంద్రబాబు సభలో జనం చనిపోతే పవన్‌ కళ్యాణ్‌ పరామర్శకు వెళ్లరు.
– వీరిద్దరూ జనాన్ని మోసగించడం పనిగా పెట్టుకున్నారు.
– అమాయకపు జనసేన కార్యకర్తలను పవన్‌ అమ్మకానికి పెట్టారు.
– పవన్‌ సీఎం అవుతారని జనసేన కార్యకర్తలు అంటారు. కానీ అది ఎలా సాధ్యం?
– చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకులన్ని సీట్లతో పవన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ ఎలా చేరుకుంటారు?

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి:
– చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ది అనైతిక పొత్తు.
– ఎవరైనా ఒక ప్రత్యేకమైన ఎజెండాతో రాజకీయాలు చేయాలి. కానీ వీళ్లది మిక్స్‌డ్‌ ఎజెండా. ప్రజలకు జరిగే మంచిని అడ్డుకోవడమే వారి ఎజెండా.
– చంద్రబాబు డైరెక్టర్‌ అయితే పవన్‌కళ్యాణ్‌ యాక్టర్‌ అని జగన్‌గారు ఎప్పుడో చెప్పారు.
– ఈరోజు వారిద్దరి కలయిక ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుమానాలన్నీ తొలిగిపోయాయి.
– బలం లేని వాడు పక్కనోడి బలాన్ని తీసుకుని తాను బలవంతుడిని అని చెప్పుకోవాలనే ప్రయత్నం బాబుది.
– ప్రజలో మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. వారిక మోసపోరు.

అంబటి రాంబాబు. జల వనరుల శాఖ మంత్రి:
– ‘మేం పరస్పర పరామర్శలు చేసుకుంటున్నాం’.. అని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ చెబుతున్నారు. అలా వారు ప్రజలను మోసం చేస్తున్నారు.
– సీఎం వైయస్‌ జగన్‌ తొలి నుంచి ఏం చెబుతున్నారో.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇవాళ అదే చేస్తున్నారు.
– చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి పవన్‌కళ్యాణ్‌ సిద్ధంగా ఉన్నారు. ఇద్దరూ సీట్లు çసర్దుబాటు చేసుకోబోతున్నారు.
– పదో పరకో తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చేసేందుకు పవన్‌కళ్యాణ్‌ సిద్ధంగా ఉన్నాడు.
– పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి పావలాకో పదికో పరకకో లాలూచీ పడి ఈ రాష్ట్రంలో తనను నమ్ముకుని ఉన్న కాపు సామాజికవర్గ ఓటర్లందర్నీ గంపగుత్తగా చంద్రబాబుకు ఊడిగం చేయడానికి తీసుకెళ్తాడు తప్ప జరిగేది.. ఒరిగేదేమీ లేదు.
– అయితే ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరయ్యా? అంటే, ‘మా పవన్‌కళ్యాణ్‌ సీఎం అవుతాడు’.. అని గొంతు చించుకుని అరిచే వాళ్లంతా ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించాలి.
– ‘అయ్యా.. మీరిద్దరూ కలిసి 2024లో కలిసి పోటీ చేస్తున్నారా? లేదా?. గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి? అని..
– అయితే, అది జరిగేది.. చచ్చేది లేదనుకోండి.
– ఏదో మీడియాలో పెద్ద కవరేజీ కోసం వారిద్దరి ఆరాటమే తప్ప, వారిద్దరి కలయికలో పెద్ద పస ఏమీ లేదు.
– వారిది చాలా సాధారణమైన భేటీ. తొలి నుంచి వారిద్దరూ కలిసే సంసారం చేస్తున్నారు.
– ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వాళ్లు పవన్‌కళ్యాణ్‌ మాతోనే ఉన్నాడని ఇప్పటిదాకా చెప్పారు. మరోవైపు పవన్‌కళ్యాణ్‌ కూడా బీజేపీతో మిత్రపక్షమని చెప్పాడు.
– మరి, బీజేపీతో ఉండాల్సిన పవన్‌కళ్యాణ్‌ మరోవైపు చంద్రబాబుతో ఎందుకు ఉంటున్నాడు? ఇది నైతికమేనా?
– ఈ దేశంలో, రాష్ట్రంలోనూ అన్‌రిలయబుల్‌ పొలిటీషీయన్, నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది పవన్‌కళ్యాణ్‌ మాత్రమే.
– బీజేపీతో విడాకులు కాకుండా చంద్రబాబుతో సంబంధానికి అర్థం ఏమిటి పవన్‌?. మీకసలు నైతిక విలువలు ఉన్నాయా?.
– జనసేన అనేది ఒక అఫ్లియేటెట్‌ సంస్థ. అది కూడా చంద్రబాబుకి.
– చిరంజీవి అప్పుడు ఏకంగా తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు. అలాగే, పవన్‌కళ్యాణ్‌ను కూడా తన పార్టీని తెలుగుదేశం పార్టీలో కలిపేసెయ్యండి. ఎవరొద్దన్నారు?
– ఇంకా ముసుగులో గుద్దులాటలెందుకు? డ్రామాలెందుకు? పరస్పర పరామర్శలెందుకు?. ఇంకా ఎవరిని మోసం చేయాలని?.
– మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా, చేయాలనుకున్నా 2024లో మళ్లీ వైయస్సార్‌సీపీ విజయాన్ని మీరెవ్వరూ అడ్డుకోలేరు.

జోగి రమేష్‌. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి:
– సంక్రాంతి ప్యాకేజీ కోసమే పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబు ఇంటికి వెళ్లాడు.
– నిజంగా బుద్ధున్నవాడైతే కందుకూరు, గుంటూరులో కలిసి 11 మంది చనిపోయారని.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తారు.
– కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు ఇంటికి పరామర్శకు వెళ్లడం ఏమిటి?. వవన్‌కళ్యాణ్‌ అనే నాయకుడికి బుద్ధుందా..?
– చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కు సిగ్గూశరం ఏనాడో పోయాయి. వాళ్లిద్దరూ నైతిక విలువలను ఏనాడో వదిలేశారు.
– ‘నాకు ఎన్ని సీట్లు ఇస్తావు?. నాకు ఎంత ప్యాకేజీ ఇస్తావు? నేను ఏయే స్థానాల్లో అమ్ముడుపోవాలి?’. అని దత్తతండ్రిని అడగడానికి దత్తపుత్రుడు వెళ్లిన భేటీనే తప్ప, మరొకటి కాదు.
– ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా సంతోషంగా ఉంటే.. వవన్, చంద్రబాబు ఇద్దరూ చీకటి ఒప్పందాలతో ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలని కుయుక్తులు పన్నుతున్నారు.
– వీళిద్దరికి తోడు పచ్చమీడియా ఛానెళ్లు, పచ్చ పత్రికలు కలిసి కుట్ర చేస్తున్నాయి. వారెన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ మా పార్టీ విజయాన్ని ఆపలేరు.
– మొత్తం 175కు 175 సీట్లు గెల్చుకుంటాం.

LEAVE A RESPONSE