– బాబు అధికారంలోకొచ్చాకే కులగజ్జి రాజకీయాలొచ్చాయి
– డ్రామోజీ దరిద్రపు రాతలకు, కుట్రలకు కాలం చెల్లింది
– మార్గదర్శి భయం మొదలైంది కనుకే మామీద తప్పుడు రాతలు
– నా పేరుతో నేరుగా వార్తలు రాసే దమ్ముందా రామోజీ..?
– ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయసన్యాసానికి నేను సిద్ధం
– సవాల్ విసిరిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
డ్రామోజీ దరిద్రపు రాతలు
ఈనాడులో బ్యానర్ వార్తగా నామీద రాతలు రాయించే రామోజీరావును ఏమని పిలవాలో అర్ధంకావడంలేదు. ఆయన రామోజీరావా..? డ్రామోజీరావునా..? దరిద్రం ఏంటంటే.. గుడ్డముక్క కాల్చి మా మొఖాన విసిరితే దాన్ని తుడుచుకుని కడుక్కునేదిగా పరిస్థితి తయారైంది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే.. రామోజీరావులాంటి వారు తప్పుడు విధానాలు అనుసరించడం, తప్పుడు కూతలు, తప్పుడు రాతలు రాయడం.. వాటన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఉన్నందున మేం ఖండించడమనేదే జరుగుతుంది. ఇలాంటి నీతిమాలిన, సిగ్గుమాలిన రాతలు రాయించే డ్రామోజీ దరిద్రం మేం భరించాల్నా..? అని అడుగుతున్నాను.
ముసలోడు పోతాడన్నందుకే నామీద రాతలు
మొన్నొక ప్రెస్‌మీట్‌లో నేను ఈనాడు పత్రిక, దాని యజమాని రామోజీరావు గురించి స్పష్టంగా చెప్పాను. ‘రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలవకూడదు. ఈ రాష్ట్రం నుంచి ఆయన పోవాలి. చంద్రబాబుకు ఉన్న అండలో ఉన్న పెద్దవ్యక్తి ఎవరంటే, రామోజీరావు. ఆయనకు ఇప్పటికే వయసు మీరిపోయింది. టాబ్లెట్లు మింగుతున్నాడు. చావుకు కాళ్లుచాచి ఉన్నాడు. ఆయన పోయాక చంద్రబాబుకు వెన్నెముకగా ఉన్న రామోజీరావు ఈలోకంలో లేనట్లు ఉంటుంది’ అని అప్పట్లో నేను చెప్పడం జరిగింది. దానికి తట్టుకోలేక ఆ ముసలోడు రామోజీరావు ఉక్రోశంతో నామీద తప్పుడు రాతలు రాయించడం జరుగుతుంది.
రామోజీలో భయం మొదలైంది కనుకే పిచ్చిరాతలు
అవును, నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నాను. చంద్రబాబు 2024లో ఓడిపోవడం ఖాయం. ఇప్పటికే బాబు పతనానికి సంబంధించి మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆపరేషన్ ప్రారంభించారు. బాబు పేకమేడలన్నీ కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిన్న మార్గదర్శి విచారణకు సంబంధించి సీఐడీ విచారణకూ ఈ రామోజీ హాజరుకాలేదు. అంటే, ఆ ముసలో డు భయపడుతున్నాడు. భయపడే మా మీద పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నాడు.
రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు రామోజీ, చంద్రబాబు
రామోజీలాంటి దుష్టుడు, దుర్మార్గుడు చంద్రబాబు వెనుక ఉన్నారు కనుకనే ఆనాడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవగలిగాడు. ఆయన మరణానికి వీరిద్దరూ కారణమయ్యారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులెవరంటే, రామోజీరావు..చంద్రబాబు అని చిన్నపిల్లోడుతో సహా చెబుతాడు. ఇలాంటి చీడపురుగు చంద్రబాబు కులగజ్జితో కుట్రలు చేస్తూ.. కోర్టులను, న్యాయమూర్తులను సైతం ప్రభావితం చేశారు. కనుకనే, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో ఏ జీవోను తెచ్చినా వాటిని అమలు కాకుండా అడ్డుకున్నారు.
దొంగరాతలెందుకు.. నేరుగా రాసే దమ్ముందా..?
కాకినాడలో రేపు టీడీపీ బస్సు యాత్ర పెట్టారంట. రామోజీరావు ఈనాడులో రాతలు రాయడం దానిపై కుక్కల్లా టీడీపీ నేతలు మొరగడం షరామామూలే. ఎమ్మెల్యేగా నేనంటే ఏంటనేది ఈ కాకినాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టే, నేను ఏ విషయాన్నైనా ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ సందర్భంగా రామోజీరావుకు ఒక సవాల్‌ను విసురుతున్నాను. ఏదో భయం భయంగా ఊర్లు పేర్లు లేకుండా దొంగ రాతలు రాయడం కాదు. ఈ ముసలోడు రామోజీకి దమ్ముంటే నా పేరుతో వార్తలు రాయమనండి.. ఆయన సంగతి నేను చూసుకుంటాను.
రామోజీ బతుకుంతా దొంగరాతలేనా..?
రామోజీరావు బతుకంతా తన సామాజికవర్గానికి కొమ్ముకాయడం, బాబు వ్యతిరేకులపై ఊర్లు, పేర్లు లేకుండా అడ్డమైన తప్పుడు రాతలు రాయడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా నామీద రాసినట్లుగానే రాశాడు. 2019 ఎన్నికలకు ముందు ఈనాడులో ఇదేవిధంగా మా నాయకుడు జగన్ గారిపై కూడా అడ్డగోలు రాతలు రాశాడు. రాయలసీమలో జగన్ రోజురోజుకు బలపడుతున్నారని తెలిసి.. రాయలసీమంటేనే ఫ్యాక్షన్ ప్రాంతమని.. ఆ ప్రాంత నాయకులు..అంటూ రామోజీ అవాస్తవాల్ని అల్లి రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు.
రామోజీ కుట్రలకు కాలంచెల్లింది
రామోజీ.. నీ వయసు అయిపోయింది. నీ కుట్రలకు కాలం చెల్లింది. గతం మారింది. ఇప్పుడు నీ కుయుక్తులు చెల్లవు. మీ అందరి పక్కలో బల్లెంలా మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తయారయ్యారు. నువ్వు చంద్రబాబుతో కలిసి కుట్రలు చేయడంలో ఒక అడుగు ముందుకేస్తే.. మా నాయకుడు జగన్ రెండు అడుగులు ముందుకేసి వాటిని చేధిస్తారు.
బాబు అధికారంతోనే కులకుట్రలొచ్చాయి
రామోజీ.. నీ మార్గదర్శి ఇప్పుడు ఏమైంది..? ఆ కేసు విచారణకు నువ్వెందుకు రావడంలేదు.? ఎందుకు భయపడి దొంగరాతలు రాస్తున్నావు..? కులకుట్రలెందుకు చేస్తున్నావు..? ఎప్పుడూ నీ కులపోడే అధికారంలో ఉండాల్నా..? వేరే కులపోడు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే నువ్వు చూడలేవా రామోజీ..? నీకు చంద్రబాబుకు ఎందుకంత కులగజ్జి..? 1995కి ముందు రాజకీయాల్లో కులాలున్నాయా..? అప్పట్లో అన్ని కులాలవాళ్లు కేబినెట్‌లో ఉండేవారు. అందరూ సమానంగా పదవులు అనుభవించిన సందర్భాలున్నాయి.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి బాబు అధికారంలోకి వచ్చాకనే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కులకుట్రలొచ్చాయి. ఈ సంగతి ఇప్పటి యువతరానికి తెలియకపోవచ్చు. రామోజీరావు అనే వ్యక్తి ఈ భూమ్మీదకు రాకుంటే.. చంద్రబాబు అనే దుర్మార్గుడు రాజకీయాల్లో లేకుండా ఉంటే కులాలనేవి ఈ రాష్ట్రంలో ఉండేవే కావు. మరలా పాతరోజుల్ని మనం చూస్తామని నేను ఖచ్చితంగా చెబుతున్నాను.
ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయసన్యాసం తీసుకుంటా
అబద్ధాల్ని నిజమని నమ్మించేవారిలో ముందుండే వ్యక్తి రామోజీరావు. ఆ తర్వాతనే చంద్రబాబుకు స్థానమివ్వొచ్చు. పేరు ప్రస్తావించకుండా నామీద తప్పుడు ఆరోపణలతో దొంగరాతలు రాసినప్పటికీ, నేను వాటిని ఖండిస్తున్నాను. రామోజీ నేరుగా వస్తాడో.. ఆయన ఈనాడు బృందాన్ని పంపించుకుంటాడో అంతా కాకినాడ పట్టణంలో క్షేత్రస్థాయిలో తిరిగి నామీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను దుమ్ములపేట భూముల్ని ఫిల్లింగ్ చేయించింది కబ్జా కోసం కాదు.
అలా ఫిల్లింగ్ చేయించింది పేదలకోసమని చెబుతున్నాను. అదేవిధంగా పోర్టుల్యాండ్‌ను కూడా ఫిల్లింగ్ చేయించింది కూడా పేదలకు ఇళ్ల స్థలాలివ్వడం కోసమే.. వాటిపై టీడీపీ నేతలు కోర్టుల్లో పిటీషన్‌లు కూడా వేసి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అలాంటిది, ఈ భూముల్ని నేను కబ్జా కోసం ఫిల్లింగ్ చేయించానని ఈనాడు రాసింది. అదేవిధంగా అత్తకట్ల చెరువు కాకినాడ మొత్తానికి సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుగా ఉంటే.. దాన్ని విస్తరించడానికి పూడిక తీయిస్తుంటే.. చెరువు మట్టి అమ్ముకోవడానికేనంటూ తప్పుడు రాతలు రాస్తారు..?
మట్టి ఇంకా పూడికతీయాలి. రైస్ కంపెనీలు కాకినాడలో 23 ఉంటే, అందులో అతిపెద్ద కంపెనీ నీ చౌదరి సామాజికవర్గానిదేనని తెలుసుకో. నీకు కులగజ్జి కదా..? అందుకే, ఆ కంపెనీ యజమానిని దొంగ వ్యాపారం గురించి అడుగు..? కోవిడ్‌లో ఒక్కో ప్రయివేటు ఆస్పత్రికి అధిక పెనాల్టీలను వేశాం. అలాంటిది, కోవిడ్ పేరుతో కమీషన్లంటూ నీచమైన రాతలు రాస్తావా..? కోవిడ్ సమయంలో జర్నలిస్టులకూ నేనెంత సాయం చేశానో అందరికీ తెలుసు.
నీ ఈనాడు టీమ్‌ను గానీ నీ కులటీమ్‌ను గానీ పంపి విచారణ జరిపి నామీద ఆరోపణల్ని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసురుతున్నాను. అయినా.. రేపోమాపో చచ్చే ముసలినక్కకు నేను సవాల్ విసరడమేంటో.. అది నా దురదృష్టమేమో.. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని తప్పుడు రాతలు రాయకుండా చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని రామోజీకి హితవు పలుకుతున్నాను.