Suryaa.co.in

Andhra Pradesh

ఏపీకి రండి..’ఓపెన్ ఏఐ’ సీఈఓకి చంద్రబాబు ఆహ్వానం

ఏఐ వినియోగంలో భారత్ ప్రపంచాన్ని అధిగమిస్తుందని ‘ ఓపెన్ ఏఐ ‘ సీఈవో సామ్ ఆల్ట్మాన్ చేసిన ట్వీట్ కు, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ ఏఐ ని అందిపుచ్చుకోవడంలో భారతదేశం తన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఏఐ -ఆధారిత పురోగతికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇండియాకు వచ్చినప్పుడు అమరావతిని సందర్శించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీతో మా విజన్ను పంచుకుంటాం’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు.

LEAVE A RESPONSE