– భవానిపురంలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ళ దీక్షిత కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ బృందం
14 ఏళ్ల బాలికను వేధించిన వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ రోజు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత , మాజీ ఎమ్మెల్సీ తెలుగు దేశం పార్టి ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ ఆ బాలిక తల్లిదండ్రులుతో మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది.
బాబు ఫోన్లో దీక్షిత కుటుంబాన్ని పరిమర్శించడమే కాకుండా బాబు ప్రత్యేకంగా పార్టీ తరపున ఒక లాయర్ ను కేటాయించి, ఆ నిందుతుడికి ఉరి శిక్ష పడేదాక అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాళ్లు ఎం.కళ్యాణి , అన్నాబత్తుల జయలక్ష్మి ,ఆశా , రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు ,డివిజన్ అధ్యక్షుడు రేగాల లక్ష్మణరావు , విజయవాడ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉషా రాణి, వన్ టౌన్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సరిత , రమణమ్మ ,ప్రసన్న పాల్గొన్నారు.