– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామ్ చందర్ రావు
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు ఎర్రగడ్డ డివిజన్లోని కల్పతరువు రెసిడెన్సీ క్లబ్ హౌస్, మల్టీపర్పస్ హాల్ లో సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… ఎర్రగడ్డలో రెసిడెన్షియల్ కాలనీ మధ్యలో ప్రైవేట్ శ్మశానం ఏర్పాటు చేయడం పూర్తిగా అవివేకపూరితమైన, అమానుష చర్య. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం ప్రజల భావోద్వేగాలను దుర్వినియోగం చేయడమే. మిలిటరీ భూముల మీద కూడా దృష్టి పెట్టకుండా అనుమతులు ఇవ్వడం తీవ్రమైన తప్పు.
హైదరాబాద్ అభివృద్ధికి పునాదులు వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో వేశారు. గచ్చిబౌలి స్టేడియం, సైబర్ సిటీ వంటి ప్రాజెక్టులు అప్పటి విజన్ ఫలితం. తరువాత ప్రభుత్వాలు దాన్ని కొనసాగించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వాలు ఆ క్రెడిట్ మొత్తం తమదేనని చెప్పడం తప్పుడు భావన. ఎర్రగడ్డ సహా అనేక కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, మాన్హోల్స్, స్ట్రీట్ లైట్స్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండా దారుణ స్థితిలో ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడితే ఫ్లడింగ్, మాన్హోల్ మూతలు లేకపోవడం, దుర్వాసన వంటి సమస్యలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారాయి. మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరం.
రాత్రి 9:30 తర్వాత లౌడ్ మ్యూజిక్, డీజే వంటి కార్యక్రమాలు నిషేధం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఆ నియమాలు అమలు కావడం లేదు. పోలీసు శాఖ, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అంశంపై జాగ్రత్తగా వ్యవహరించాలి.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ పాలనలో అవకాశాలు పొందినా, ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇప్పుడు ప్రజలు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి. గత 12 సంవత్సరాలుగా మోదీ నేతృత్వంలో అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం కొనసాగుతోంది. యూపీఏ ప్రభుత్వ కాలంలో 2జీ, 3జీ, హెలికాప్టర్ స్కాంలు వంటి భారీ అవినీతి జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి దీపక్ రెడ్డి సామాజిక, రాజకీయ, ప్రజా జీవితంలో విశాల అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన ప్రజలతో నేరుగా మమేకమై ఉండే నాయకుడు. ఎప్పుడైనా ప్రజలు పిలిస్తే వెంటనే స్పందించే స్వభావం కలిగిన అభ్యర్థి.
మంచి విద్యావంతులు, సంస్కారవంతులు రాజకీయాల్లోకి రావాలి. బాధ్యతతో పాలన చేసే వారు ముందుకు రావాలి. మీ ఓటు బుల్లెట్ కంటే శక్తివంతమైనది — అందరూ ఓటు హక్కును వినియోగించాలి. “ముందు ఓటు అనే భావంతో ఓటు వేయండి. ఓటింగ్ శాతం పెంచి ప్రజాస్వామ్యాన్ని బలపరచండి. రెండు పార్టీల పాలనను ప్రజలు చూశారు. ఇప్పుడు మార్పు కోసం సమయం వచ్చింది. జూబ్లీహిల్స్ నుంచి ఆ మార్పు ప్రారంభమవ్వాలి