అందరిని జైలుకు పంపాలనే మనస్థత్వంలో ఉన్న జగన్ రెడ్డి
రిమాండ్ రిపోర్టులో కట్టు కథలు అల్లారు
లండన్ నుంచి వచ్చేసరికి సీఎం కళ్లలో ఆనందం చూడాలని ఆత్రుత
స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఏం చేశాడు?
నేతలను బెయిల్ మీద ఉన్న వారిగా చేయాలని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు
పోలీసల దమనకాండ బ్రిటీష్ వారి కాలంలోనూ లేదు
పవన్ కల్యాణ్ ను అన్యాయంగా దూషిస్తున్నారు
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
చంద్రబాబు ని జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల కల. స్కిల్ డెవలప్ మెంట్ అనేది ప్రధాని మోదీకి ఎంతో ఇష్టమైంది. అందుకే గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం ఉన్నవారంతా స్కిల్ డెవలప్ మెంట్ ను పలు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు.
స్కిల్ డెవలప్ మెంట్ కింద 2 లక్షలమందికి పైగా శిక్షణ ఇచ్చి లక్షమందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుదే. ఈ స్కీమ్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారని జగన్ ప్రభుత్వం ప్రసంశించింది కూడా. సిమెన్స్ కేసులో పలువురికి హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. తాను జైలుకు వెళ్లాడు కాబట్టి చంద్రబాబు సహా అనేకమంది నేతలను బెయిల్ మీద ఉన్న వారిగా చేయాలని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకు సీఐడీని ఎన్నుకున్నాడు. ఈ సీఐడీ వైసీపీ జేబు సంస్థగా పనిచేస్తోంది.
రఘురామ కృష్ణను అరెస్ట్ చేయించి వీడియో కాల్ లో అది చూసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి జగన్ రెడ్డి. రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసుకుని తానొక్కడే సంపాదించుకుంటూ పోలీసులను పహారా పెట్టుకున్నాడు. రిమాండ్ రిపోర్టులో కట్టు కథలు అల్లారు. లండన్ నుంచి వచ్చేసరికి సీఎం కళ్లలో ఆనందం చూడాలని ఆత్రుత తప్పా ఆ రిమాండ్ రిపోర్టులో ఏం లేదు.
పీవీ రమేష్ వ్యాఖ్యలను కూడా వక్రీకరించారు. రోజువారీ కార్యక్రమాల్లో ఎండీలదే పాత్ర అన్నారు. న్యాయవ్యవస్థ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. గురివింద తీరుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. కొండంత అవినీతిని చేసి తాను అవినీతికి తావు ఇవ్వనని జగన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. యువత భవిష్యత్ కు బాట వేసిన వ్యక్తి చంద్రబాబు ఆయన చేసి ఐటీ అభివృద్ధి వల్లే దేశవిదేశాల్లో యువత పనిచేసుకుంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఏం చేశాడు?
ఇంతటి విధ్వంసపాలన, రాక్షస క్రీడ ఎక్కడా లేదు. పోలీసల దమనకాండ బ్రిటీష్ వారి కాలంలోనూ లేదు. సత్తెనపల్లిలో శాంతియుతంగా బంద్ చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లిన తీరు దుర్మార్గం. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం.సీఐడిని ఉపయోగించకుని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి సైకో ఆనంతం పొందుతున్నారు. జగన్ లండన్ వెళ్లడం, ఆయన వచ్చేసరికి చంద్రబాబు జైల్లో అండాలని ఆదేశాలివ్వడం, సీఐడీ అందుకు తగ్గట్టు పనిచేయడం చూశాం. జగన్ రెడ్డి లాంటి రాక్షసులను తరిమికొడదాం. పవన్ కల్యాణ్ ను అన్యాయంగా దూషిస్తున్నారు. ఈ పీడిత పాలనకు ప్రజలు చరమగీతం పలకాలి.