– కర్ర తుమ్మ చెట్లు కొట్టడానికి గుంటూరు వాళ్ళు పనికిరారా?
– పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బడా కంపెనీకి 80 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు ఇచ్చారు
– ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ కావాలి
– 11 ఏళ్లలో ప్రధాని ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు
– ఒక బీసీ మహిళ పైన విచారణ సమంజసం కాదు
– కాంగ్రెస్ పై సానుభూతి మొదలైంది
– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
గుంటూరు: ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయలు డబ్బు దొరికింది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఒక జడ్జి ఇంటికి పోవాలంటే, మంచినీళ్ల బాటిల్ ను కూడా చెక్ చేస్తారు. 500 కోట్ల రూపాయలు, జడ్జి ఇంటికి చేరిందంటే, ఇది ఒక రోజులో జరిగిన పని కాదు.
ఆ డబ్బు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు చెందినదని, న్యాయవాదులు, సుప్రీంకోర్టు న్యాయమార్థులు ఢిల్లీలో చెప్పుకుంటున్నారు. పోలీసులకు తెలియకుండా, కేంద్ర హోంమంత్రికి తెలియకుండా, ప్రధానికి తెలియకుండా అంత డబ్బు వెళ్లదు. దీనిపై విచారణ జరపాలి.
పోలవరం డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. పోలవరం ఏటీఎం లాగా మారిందని ప్రధాని గతంలో అన్నాడు. దీనిపై విచారణ ఎందుకు వేయలేకపోతున్నారు? చిలకలూరిపేటకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే పై కోటి రూపాయలు తిన్నదని, ఆమెపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. వేల కోట్ల రూపాయలు పోలవరం పై తిన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటే, సీబీఐ విచారణ కాదు కదా, కనీసం ఏసీబీ విచారణ కూడా జరిపించకపోవడంలో అంతర్యమేమిటి?
పోలవరంపై ఒక రకమైన ఆలోచన? చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే పై మరో రకమైన ఆలోచన ఎందుకు? తిమింగలాలను పట్టుకోకుండా, చిన్న చిన్న కుందేళ్ళను పట్టుకుంటున్నారు. ఒక బీసీ మహిళ పైన విచారణ సమంజసం కాదు. ఈరోజున్న రాజకీయ నాయకుల్లో ఎవరు తినడం లేదు? వావిలాల గోపాలకృష్ణ తినలేదు. కాకాని వెంకటరత్నం తినలేదు. ఎన్జీరంగా తినలేదు. అటువంటి నాయకులు ఇప్పుడు లేరు.
అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు కలిగినటువంటి దేశం భారతదేశం. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశం భారతదేశం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండింది. రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య రాజకీయ హత్య. మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని ఖండిస్తున్నాను. రాజమండ్రిలో పరిస్థితులు క్షుణ్ణంగా గమనిస్తూ వచ్చాను. ఎవరైనా కొంచెం రెచ్చగొట్టి ఉంటే, రాజమండ్రి రాజమండ్రిలా ఉండేది కాదు. రాష్ట్రం రావణ కాష్టం గా అయివుండేది.
అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు మాల మాదిగ కులాల మధ్య చిచ్చు. స్టాలిన్ హిందీ పై మాట్లాడి భాషల మధ్య చిచ్చు. ఆయన అందుకున్న ఇంకో నినాదం డీలిమిటేషన్ చర్చ, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఇది భారతదేశంలో ఉన్న పరిస్థితులు.
సీఎం చంద్రబాబు P4 గురించి మాట్లాడారు. విజయవాడ సిటీ లో, BRTS రోడ్డులో వేలమంది పడుకుని ఉన్నారు. నిన్న నేను వెళ్లి వాళ్లతో మాట్లాడాను. మాకు ఆశ్రయం లేదని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో వున్న పేదరికాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తోంది. బీటెక్ పాసైన వాళ్లు కూలి పనులకు వెళ్తున్నారు. ఎంబీఏ పాసైన వాళ్లు డ్రైవర్లుగా వెళ్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయి?
హెయిర్ కటింగ్ పైన పన్ను. గుడ్డలు ఉతికే దానిపైన పన్ను. పన్నులు పెరగడం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు కొనలేని పరిస్థితి, తినలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ కావాలి. కర్ణాటకలో మాదిరిగా, ఎస్సీ, ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వాలి.
కర్ర తుమ్మ చెట్లు కొట్టడానికి గుంటూరు వాళ్ళు పనికిరారా? పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బడా కంపెనీకి 80 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు ఇచ్చారు. ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేస్తే, లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఎవరు తీసుకుంటున్నారు? గుజరాతీలు, మార్వాడీలే తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఒక్క శాతం. ఓబీసీలకు రెండు శాతంలోపు రుణాలు బ్యాంకులు ఇస్తున్నాయి.
ప్రధాని బ్యాంకుల్లో వర్గీకరణ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ చేయాలి. శర్మ, వర్మ, శాస్త్రిలే సుప్రీంకోర్టు , రాష్ట్రాల హైకోర్టు జడ్జీలుగా ఉన్నారు. ఇక్కడ వర్గీకరణ తేవాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవుల్లో వర్గీకరణ జరగాలి.
ప్రధాని వారానికి ఒకసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో చెప్పరు. క్రితం లో ఎందరో ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వాజపేయి విదేశాలకు వెళ్లే వాళ్ళు. మీడియాకు వివరాలు వెల్లడించే వాళ్ళు. జర్నలిస్టులు కూడా ప్రధానుల విదేశీ టూరులో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ అనవాయితీ లేదు. 11 ఏళ్లలో ప్రధాని ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు.
నిన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు లో ఫ్రస్టేషన్, ఆవేదన కనిపించింది. చంద్రబాబుకు ఉన్న బలం అంతా ఇంతా కాదు. బాబు, నితీష్ కుమార్ పై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే, 50 వేల కోట్ల రూపాయలు కావాలంటే, చెక్ ఎత్తుకుని, ప్రధాని రావాలి. కానీ కేంద్ర ఆర్థిక మంత్రిని ఎన్ని సార్లు కలిసినా, నిధులు రావడం లేదని, ముఖ్యమంత్రి మధన పడుతున్నాడు. జగన్ ను ప్రజలు మర్చిపోయారు. అప్పుడప్పుడూ ఇస్తార్ విందులలో ఆయన కనిపిస్తున్నాడు.
కాంగ్రెస్ పై సానుభూతి మొదలైంది. ఎస్సీలు, ఎస్టీలు, ఓబిసీలు, మైనార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులలో కూడా సానుభూతి వుంది. కానీ కాంగ్రెస్ కు సంస్థాగతంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఎందరు వెళ్లినా ఇబ్బంది లేదు. వెళ్లే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి. శాలువా కప్పుతాం. కావాలంటే బొక్కే కూడా ఇస్తాం.
కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే, నా స్టడీ టూర్లు. కర్నూలు నుంచి, శ్రీకాకుళం వరకు పెద్ద పెద్ద లీడర్లతో మాట్లాడుతున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు, వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వస్తారు.