ఒంటిమిట్ట, ఏప్రిల్ 15 : ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామస్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని.. శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అంతకు మునుపు ఆలయం వద్దకు చేరుకున్న గౌ. ముఖ్యమంత్రికి.. టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం అనంతరం.. ముఖ్యమంత్రి కు శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం సుబ్బారెడ్డి సిఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటం అందజేశారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా, రాజంపేట ఎంపీలు అవినానాష్ రెడ్డి, పివి మిధున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శీనివాసులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాద రెడ్డి, కడప జెడ్పి చైర్మన్ అమర్నాద రెడ్డి, ఓటిమిట్టా ఎంపిపి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.