గ్రూప్‌-1, 2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి: గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉగ్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దాదాపు వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

బుధవారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు.

గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు.

Leave a Reply