Suryaa.co.in

Telangana

డ్రగ్స్ పై ఉక్కుపాదం

– గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై సమీక్షలో నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
– సమీక్షలో డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి. ఈ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలి. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించండి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టండి. గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్ ను బ్రేక్ చేయండి. వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలి.

డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా… ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయండి. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్ గా పని చేసేవారిని ప్రోత్సహించండి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా.. మీకు ప్రభుత్వం సమకూరుస్తుంది. డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా చర్యలుండాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి.

LEAVE A RESPONSE