Suryaa.co.in

Telangana

సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

తన తండ్రి నల్ల పరంధాములు నెలకొల్పిన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు నల్ల పరందాములు..

సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుమారుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదించారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నల్ల విజయ్ అగ్గిపెట్టెల్లో, దబ్బనంలో పట్టే చీరలను నేసి.. సిరిసిల్ల ఖ్యాతిని మరింత పెంచారు. కుట్టు లేని కుర్తా, పైజామాను, అరటి నారతో విభిన్నమైన వస్త్రాలను నేసి చేనేత కళారత్న అవార్డును సైతం అందుకున్నారు.

రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ భద్రాచల రామయ్యకు వినూత్నముగా నేసిన చీరను బహుకరించేందుకు సిద్దమయ్యాడు. నల్ల విజయ్ చేనేత మగ్గం పై భద్రాచల రామయ్యకు రంగులు మార్చే బంగారు చీరను నేసి పలువురితో అభినందనలు అందుకున్నారు.

LEAVE A RESPONSE