Suryaa.co.in

Editorial

‘కొండ’పై కుట్ర?

  • తిరుమల వేదికగా కుట్ర రాజకీయాలు?

  • హిందూ ధర్మంపై దాడికి వ్యూహం?

  • వైసీపీ ప్రచార దళాలు సిద్ధం?

  • రోజుకో ప్రచారం వచ్చేలా ప్రణాళిక?

  • తటస్తుల ముసుగులో తెలంగాణ జర్నలిస్టులతో ట్వీట్లు, వార్తలు?

  • వైసీపీ మీడియా సారథ్యంలో వ్యూహం ఖరారు?

  • సర్కారుకు నిఘా దళాల నివేదిక?

( మార్తి సుబ్రహ్మణ్యం)

కలియుగ దైవం వెంకన్నపై కుట్ర జరుగుతోందా? ఆధ్మాతిక రాజధాని తిరుమల కేంద్రంగా.. హిందూ ధర్మంపై దాడికి వ్యూహం ఊపిరిపోసుకుందా? తిరుమల కేంద్రంగా రోజుకో ప్రచారం విస్తరించే ప్రణాళికకు పురుడు పోసుకుందా? దీనికి వైసీపీ మీడియా సారథ్యం వహిస్తోందా? ఇకపై తటస్తుల ముసుగులో కొందరు టీటీడీకి వ్యతిరేకంగా ట్వీట్లు, సోషల్‌మీడియాలో వార్తలు వెల్లువెత్తనున్నాయా?.. నిఘా దళాలు వీటికి అవుననే సమాధానం ఇస్తున్నాయట. ఆ మేరకు సర్కారుకు ఓ నివేదిక కూడా అందించినట్లు తెలుస్తోంది.

అత్యంత విశ్వసనీయ సమచారం ప్రకారం.. తిరుమలను వివాద కేంద్రంగా మార్చడం ద్వారా హిందూ ధర్మాన్ని దెబ్బతీయడంతోపాటు, ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చే వ్యూహాలు సిద్ధమవువుతున్న నిఘా వర్గాలు సర్కారుకు నివేదిక ఇచ్చాయట. కొండపై ప్రభుత్వం హిందూ మత విశ్వాసాలను కాపాడలేకపోతోందన్న ప్రచారాన్ని జనక్షేత్రానికి చేర్చడమే ఈ ప్రచారదళాల ప్రధాన లక్ష్యమంటున్నారు.

ఆ ప్రకారంగా.. తిరుమల కొండ పవిత్రతను దెబ్బతీయడం ద్వారా, హిందువుల విశ్వాసాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫమలయిందనే ప్రచారాన్ని జనక్షేత్రంలోని పంపేందుకు, వైసీపీ వ్యూహ బృందం 10 బృందాలను నియమించుకుందన్నది నిఘా నివేదికలో ఒక భాగమట. సోషల్‌మీడియా దళాలను ఏర్పాటుచేసి, వాటి ద్వారా టీటీడీపై దుష్ప్రచారం చేయడమే వీటి లక్ష్యమట.

తటస్తుల ముసుగు వేసేందుకు తెలంగాణకు చెందిన చానెళ్ల ప్రతినిధులతో ముచ్చట్లు, వారితో ఇంటర్య్వూలు, ఆకర్షణీయమైన వేతనాలు ఏర్పాటుచేస్తున్నట్లు తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ ప్రకారంగా సోషల్‌మీడియా దళాలు, టీటీడీపై వ్యతిరేక భావన వచ్చేలా ట్వీట్లు, లేదా రోజుకో ఒక వార్త వచ్చేలా చూడటమే వీరి లక్ష్యమట. ముఖ్యంగా టీటీడీలో చోటు చేసుకునే చిన్న చిన్న సంఘటనలకు జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు తగిన బృందాలను కూడా ఏర్పాటుచేసుకున్నట్లు నిఘా నివేదిక వెల్లడించినట్లు సమాచారం.

టిటిడి అధికారులను భయపెట్టి కొండపైన సమాచారం తెప్పించుకుని, దాని ద్వారా కొండపై బురద చల్లి హిందువుల విశ్వాసం దెబ్బతీయడం, మళ్లీ దానిపై వైసీపీ మీడియా-నేతలు మీడియా సమావేశాలు నిర్వహించి, రచ్చచేయటమే ఈ ప్రచార వ్యూహం అసలు లక్ష్యమని నిఘా నివేదిక వెల్లడించినట్లు సమాచారం.

దీన్ని బట్టి ఇకపై టీటీడీ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి, సమిష్టి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికే ఈఓ-ఏఈఓ-చైర్మన్ మధ్య సమన్వయం లేదన్న ప్రచారం నేపథ్యంలో, వాటికి తెరదించి కొండపై పాలనపై దృష్టి సారించాల్సి ఉంది.

ప్రధానంగా టీటీడీ అధికారులు-పాలకమండలి తీసుకునే నిర్ణయాలు, వైసీపీకి ఆయుధంగా మారకూడదంటున్నారు. టీటీడీపై వైసీపీ వ్యూహబృందం ప్రచారం ప్రారంభించకముందే.. గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీటీడీ వేసిన పరువు నష్టం దావాపై, దృష్టి సారించడం ద్వారా ఎదురుదాడి చేయాలని కూటమి వర్గాలు సూచిస్తున్నాయి.

LEAVE A RESPONSE