పైన హిమం.. లోన జ్వాల

భయపెట్టిస్తున్నవాడికి- బాధతో తల్లడిల్లుతున్న వాడికి మధ్యన ఒకడుంటాడు. దైవం మనుష్య రూపేనా అతనే ! ఒక్కడి ఉన్నతిని. ఒక్కడి ధైర్యాన్ని.. ఒక్కడి దమ్ముని.. ఒక్కడి రోషాన్నీ.. ఒకడి వెనకున్న సైన్యాన్ని చూసి మీరు తట్టుకోలేక పోతే, ఇక మీరు జనానికి ఏం చేస్తారన్న సందేహం నన్ను వెంటాడుతుంది.

అతను విజ్ఞత గల వ్యక్తి . అతను నిర్భీతి తీరు చూసి అచ్చెరువొంది.. వెంట మేము ఉంటామని వందలాది మంది అనుసరిస్తుంటే.. ఎంతో ఆనందంతో, తనకేదో మంచి రోజులు వస్తున్నాయని…ప్రజల అండ దండలు తనకున్నాయనీ…. తనకెవరో మంచిచేస్తారని…. ఎంతో నమ్మకంతో ఓర్పుతో… ఎదురుచూస్తున్న వ్యక్తి …ఎవరితను? గుర్తు చేయాలంటారా? ఆయనే నర్సాపురం సిట్టింగ్ ఎంపి రఘురామకృష్ణంరాజు!

రాజు గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక, సీటు రానికుండా చేస్తేనే అతన్ని గెలిచాం అని విర్రవీగే మీ అనైతికతకు మేము సిగ్గుపడుతున్నాం. ఈ రాజకీయ క్షేత్రంలో కోరుకొని ఎన్నుకుంటే నాయకులు అవుతారు. కానీ ప్రత్యర్థి ఉనికినే లేకుండా చేసి రాజుగా ఏలుదామంటే కుదరదు.

ఈ హిమజ్వాల రాజకీయాల్లో మా అందరికీ అతనొక హిమంగా కనపడుతుంటే, మరి మీకెందుకు జ్వాలలా కనపడుతున్నారు? సహజంగా మనకు ఒక మనిషితో పొసగటం లేదంటే, దానికి రెండే కారణాలు ఉంటాయి. ఒకటి ఆర్థిక లావాదేవులు. .లేదా అతని పట్ల ఈర్ష అసూయ ద్వేషాలు.

ఇక్కడ ఏపీ జనానికె వ్వరికీ ఆయనతో ఆర్థిక లావాదేవీలు లేవు. ఈ అసూయా జ్వాలలతో రగిలిపోతున్నది, కూటమిలోని కొందరు నాయకులు. నాకు తెలిసి దీనికి వైద్యం.. మందూ..లేవు.

ఎక్కడైనా ఉమ్మడి శతృవును గద్దెదింపాలి. కానీ..దాన్ని పక్కన పెట్టి, రాజుగారి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేద్దాం అనుకోవడం ఏమి రాజకీయం బాబుగారు? దయచేసి జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గ్రహించండి. గడిచిన నాలుగు సంవత్సరాల బట్టి అతని వైఖరిని మాటలని, ఆవేదనని అందరం వింటూ…చూస్తూ…. ఆకళింపు చేసుకుంటున్నాం.

ఆ రోజు ఎవ్వరూ కూడా అది తప్పు అనలేదు. ఎందుకు చెప్పలేదంటే అవన్నీ వాస్తవాలు… నూటికి నూరుపాళ్ళు నిజాలు …జరుగుతున్న సంఘటనలు కాబట్టి. అంటే పరోక్షంగా అందరూ అతని మాటలకు అండగా నిలిచి యథార్థమన్నారు.

ఆరోజు ఒప్పుకున్న మీకు, ఈరోజు అతను గతంలో చేసింది తప్పు అని విమర్శించే హక్కు గాని అర్హత గాని ఉన్నాయా అని ప్రశ్నించుకోండి! నాయకులుగా మీరు మిమ్మల్ని సర్దుకోవచ్చేమో కానీ, అభిమానులుగా మీ ఇద్దరి నడతను… నడకను… మాటను చేతలను గమనిస్తూనే ఉన్నాము.

సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకు, మీరు జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అతను చెప్పినవన్నీ నిజాలు. మీకు తెలిసినవన్నీ వాస్తవాలు. నిజానికి వాస్తవానికి తేడా మీకు తెలియబట్టి మీరు రాజకీయ నాయకులయ్యారు .

కానీ అభిమానులుగా జరుగుతున్న నిజం ఏంటో తెలుసు.! వాస్తవాన్ని జీర్ణించుకోలేక అర్థం చేసుకోలేక అతలాకుతలం అవుతున్నాం!! మీడియా ఏవేవో రాస్తున్నాయి…. సరెండర్ అయ్యాడని … ఇక బై బై అంటున్నాడని మెత్తబడ్డాడని…. జారిపోతున్నాడని… పనైపోయింది అని.

అసలు వెనకడుగు వేసే నైజం ఉంటే ఈ పోరాటానికే సంసిద్ధమే కాడుగా! ఏం జరుగుతుందో .. జరగబోతుందో…. జరిగేది తన ఉనికికే భంగం కలిగించేది అని తెలిసే రంగంలోకి దూకాడు. ఇక మీడియా బొంకే గాలి కబుర్లు అతన్నేమీ చేయలేవు!

కాకపోతే రాజకీయాల్లో అన్నీ తెలిసినా తెలియనట్టు……. తెలియకపోయినా తెలిసినట్టు నటించడమే! దురదృష్టం ఏంటంటే ఇతనికి నటన రాదు. ఏం చేస్తాం? కానీ వీళ్లందరి కన్నా భగవంతుడే నిజమని నమ్మిన భక్తుడు అతను.

త్రిబుల్ ఆర్ గారు బలిపశువు అయ్యాడని అంతరంగలో ఆనందపడే వారికి అంతిమంగా ఎవరు బలవుతారు? పశువులు ఎవరవుతారు అన్నది.. జూన్ 4వ తారీఖున తెలుస్తోంది. కొంచెం ఓపిక పెట్టండి.

– డాక్టర్ శృతి

Leave a Reply