జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అవినీతి విలయతాండవం

– ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వాలంటీర్లు ప్రజలపైపడి పీక్కుతింటున్నారు
• చంద్రబాబునాయుడి హాయాంలో రూ.6లక్షలకోట్ల అవినీతిజరిగిందని విషప్రచారంచేసి, పుస్తకాలుముద్రించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రూపాయిఅవినీతిని కూడా నిరూపించలేక చతికిలపడ్డాడు
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
అంతర్జాతీయ అవినీతిరహిత దినోత్సవం సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో నెలకొన్న విచ్చలవిడి అవినీతిపై చర్చజరగాల్సిన సమయంవచ్చిందని, ముఖ్యమంత్రిని అవినీతి సామ్రాట్ అని పిలుచుకోవాల్సిన తరుణంకూడా వచ్చిందని, ప్రపంచంలో ఎవరిపై లేనన్ని అవినీతికేసులుఉండి, జైలుకువెళ్లొచ్చినవ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటమనే అసాధారణ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు కూడావచ్చిందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు.ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలుఆయన మాటల్లోనే …!
విశేషము…విచిత్రమూ ఏంటంటే అవినీతిపరుడిగా ముద్రపడి, జైలుకువెళ్లొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం ఒకవిచిత్రమైతే, ముఖ్యమంత్రి అయ్యాక అదేవ్యక్తి ఎలాంటి అవినీతి లేకుండా పాలనచేస్తానని చెప్పడం నిజంగా వింతల్లోనేవింతగా, ఆశ్చర్యాలకే ఆశ్చర్యంగా నిలిచింది. జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడుకాడని, సోనియాగాంధీగారే కావాలని ఆయనపై కేసులుపెట్టించిందని ఇప్పటికీ కొందరుమూర్ఖులునమ్ముతున్నారు. అవినీతిరహిత ప్రభుత్వాన్ని అమలుచేస్తాననిచెప్పిన వ్యక్తే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్నిరంగాల్లో అవినీతిని పెంచిపోషిస్తున్నాడు.
గతంలో రాష్ట్రంలోని ప్రభుత్వాధికారులు కొద్దోగొప్పో అవినీతికి పాల్పడితే, దాన్ని ఈ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అంటగట్టి, రూ.6లక్షలకోట్ల అవినీతిజరిగిందని విషప్రచారంచేశాడు. దానిపై చిత్తుకాగితాలతో సమాన మైన పుస్తకాలనూకూడా ముద్రించి, ప్రజల్లో విషబీజాలు నాటాడు.
ఎవరో కొద్దిమందికి, ఎక్కడోకొన్నికార్యాలయాలు, కొన్నిసంస్థలకు, కొందరువ్యక్తులకే పరిమితమైన అవినీతిని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా విశృంఖలంగా వికేంద్రీకరించాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నూతన ఇసుకపాలసీ రాష్ట్రవ్యాప్తంగా అవినీతివ్యాప్తికి ఇబ్బడిముబ్బడిగా సహకరించింది. దాంతో వైసీపీనేతలు విచ్చలవిడిగా ఇసుకవ్యాపారంలో మునిగిపోయి, పెద్దఎత్తున ఇప్పటికీ అవినీతికి పాల్పడుతున్నారు. ఇసుకదోపిడీ దానిలో జరిగే అవినీతిని ఒకే గొడుగు కిందకు తీసుకు రావడమే జగన్మోహన్ రెడ్డిసాధించిన ఘనత.
అదలాఉంటే, రాష్ట్రంలో సంపూర్ణమద్యపాననిషేధం అనిచెప్పి, మహిళలఓట్లు కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మద్యంఅమ్మకాలతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. మహిళల కళ్లల్లో ఆనందాన్ని నింపుతానని, వారిజీవితాల్లో వెలుగులు నింపుతానని చెప్పిన పెద్దమనిషి, చివరకు తనపార్టీ వారు తయారుచేసే నాసిరకం మద్యం అమ్మకాలను విరివిగా ప్రోత్సహస్తూ పెద్దఎత్తున మరోరకమైన అవినీతికి తెరలేపాడు. అవిచాలదన్నట్లు ఇప్పుడు సినిమాటిక్కెట్ల అమ్మకంపేరుతో కొత్తదోపిడీకి శ్రీకారంచుట్టాడు. దానికితోడు అదివరకు సెంటు పట్టాభూములపేరుతో రూ.7వేలకోట్ల అవినీతికి ఈప్రభుత్వం పాల్పడింది.
స్వయంగా అధికారపార్టీఎమ్మెల్యేలు, మంత్రులే సెంటుపట్టాపథకంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డా రు. దాన్నుంచి ప్రజలు తేరుకోకముందే, ఇప్పుడు మరలా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్) పథకం పేరుతోఅధికారపార్టీనేతలు, వాలంటీర్లు వసూళ్లరాజాలుగా మారి, అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఓటీఎస్ పథకం సామాన్య,పేద, మధ్యతరగతి వర్గాలపాలిట శాపంగా మారింది. పేదలు తాముఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్లు అవసరం లేదని, ప్రభుత్వం అడుగు తున్న రూ.10వేలను తాముకట్టలేమని వాపోతున్నా వినకుండా, కావాలంటే మేమే మీకుకావాల్సిన అప్పులు ఇప్పిస్తాము….కట్టాల్సిందేనంటూ పేదలమెడలపై పాలకులు కత్తులు పెట్టే పరిస్థితిని కళ్లారా చూస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి పోలవరంలో అవినీతిజరిగిందని కూడా గగ్గోలు పెట్టాడు. కానీ కేంద్ర్రప్రభుత్వం చాలా స్పష్టంగా టీడీపీహయాంలో పోలవరంలోరూపాయి కూడా అవినీతి జరగలేదని, అలానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక పోలవరం పనులు ఒక్క అంగు ళంకూడా ముందుకు పోలేదని తేల్చిచెప్పింది. రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.800కోట్లు ఆదా చేశానని డబ్బాలుకొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ నిర్మాణవ్యయం అంచనాలను రూ.1300కోట్లవరకు పెంచాడు. పోలవరం సహా, రాష్ట్రంలోని అనేకసాగునీటి ప్రాజెక్టుల పనుల ను ఈ ముఖ్యమంత్రి పూర్తిగా పక్కనపెట్టేశాడు.
అవన్నీ ఒకెత్తయితే నాడు-నేడు పేరుతో పాఠశాలలను బాగుచేస్తామంటూ సరికొత్తదోపిడీకీ ముఖ్యమంత్రి శ్రీకారంచుట్టారు. రంగులపేరుతో రూ.3వేలకోట్లవరకు అవినీతికిపాల్పడ్డారు. ఒక్కమాటలోచెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జమానాలో రాష్ట్రం అవినీతి కూపంగా మారింది.
ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతితోపాటు, అధికారుల అవినీతితో ప్రపంచంలోనే అవినీతిలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి, ఆయనకు కట్టాల్సిన కప్పం కట్టలేక అనేకకార్యాలయాలు, కంపెనీలు ఇప్పటికే రాష్ట్రం విడిచిపారిపోయాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్లు5శాతం భూమి ఇవ్వాలంటూ ఈ ప్రభుత్వం కొత్తదోపిడికీ సిద్ధమైంది. దాంతో రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులుకూడా పొరుగురాష్ట్రాలకు పారిపోయే పరిస్థి తి ఏర్పడింది.
సాధారణంగా ప్రభుత్వంలోఉండేవారు, ఇలాంటి అవినీతిరహిత దినోత్సవాల నాడు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రమాణాలు చేయిస్తారు..కానీ ఈ రాష్ట్రంలో అలాంటివి ఏవీజరగడంలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఏదైనా ఒకసంస్థ బేరీజువేస్తే, ఈ రెండున్నరేళ్లలో జరిగిన అవినీతి దెబ్బకు ప్రపంచమే అవాక్కవుతుంది. ప్రపంచం మొత్తమ్మీ ద అవినీతితో సంపాదించిన రూ.76లక్షలకోట్లసొమ్ము రోటేట్ అవుతోందని అంచనాఉంటే, దానిలో జగన్మోహన్ రెడ్డి తాలూకా అవినీతిసొమ్మే రూ.లక్షకోట్లవరకు ఉందని చెబుతు న్నారు.
ఇదివరకే రూ.లక్షకోట్ల అవినీతికిపాల్పడిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అధికారాన్ని అడ్టుపెట్టుకొని ఎన్నిలక్షలకోట్లఅవినీతికి పాల్పడ్డాడో చెప్పాల్సినపనిలేదు. చంద్రబాబు నాయుడి హయాంలో రూ.6లక్షలకోట్ల అవినీతి జరిగిందని గతంలో విషప్రచారంచేసిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రయ్యాక కూడా చంద్రబాబునాయుడి హయాంలోజరిగిన అవినీతినితేల్చాలని, నిరూపించాలని అధికారులకుచెప్పి, ప్రయత్నించి చతికిలపడ్డారు. రెండున్నరేళ్లుగడిచినా చంద్రబాబునాయుడిహయాంలో రూపాయి అవినీతికూడా జరిగిందని నిరూపించ లేకపోయాడు. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో తమకు డబ్బులేకుండా ఏమీజరగదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు.
ప్రభుత్వకార్యాలయాలుసహా, ముఖ్యమంత్రి, మంత్రులుచేస్తున్న అవినీతిదెబ్బకు ఇప్పటికే రాష్ట్రం నామరూపాలు లేకుండా పోయింది. ముఖ్మ్యమంత్రి ఆయనపార్టీ వారి అవినీతిదెబ్బకు రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అభివృద్ది పనులు జరగడంలేదు. అందుకే అంతర్జాతీయ అవినీతిరహిత దినోత్సవంనాడు ముఖ్యమం త్రిచేస్తున్న, ఆయనప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిగురించి చెప్పుకోవాల్సిందే. జగన్మో హన్ రెడ్డి హయాంలో, ఏపథకంలో , ఏపనుల్లో అవినీతిలేకుండా ఉందో, ఆయన చెప్పగలడా అని ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్ నుంచి చీఫ్ సెక్రటరీవరకు అందరూ అవినీతిలోకూరుకు పోయారు. మద్యం అమ్మకాలు, దానిపైవచ్చే ఆదాయంపై చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి జిల్లా కలెక్టర్లతో సమీక్ష చేయడం ఏమిటండీ?
అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటిఉందా? సాధారణంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కేంద్రప్రభుత్వపథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయో జనాలపై సమీక్షలు చేస్తారు. కానీ చీఫ్ సెక్రటరీస్థాయి అధికారి మద్యం అమ్మకాలపై గంటకు ఇంత..రోజుకి ఇంత ఆదాయం రావాలని కలెక్టర్లకు లక్ష్యాలు విధిస్తున్నారు. తాను అధికారం లోకి వస్తే కేంద్రంమెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానన్నవ్యక్తి, ఇప్పుడు రాష్ట్రం నుంచీ అన్నీ పోతున్నా, కేంద్రంఏమీ ఇవ్వమని చెబుతున్నా కేసులభయంతో తేలుకుట్టినదొంగలా మిన్న కుండిపోయాడు.
ఈ ముఖ్యమంత్రి అసమర్థత చేతగానితనంవల్లనే ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖఉక్కుఫ్యాక్టరీ, కాకినాడ పెట్రోకెమికల్ కారిడార్, విశాఖ-చెన్నై తీరప్రాంత కారిడార్ వంటివాటిపై నోరెత్తడంలేదు. ఆఖరికి కేంద్రప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరంపై కూడా ముఖ్యమంత్రి కాళ్లుచేతులుఎత్తేశాడు. అమరావతిపై చెప్పాల్సిందంతాచెప్పి, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు. చంద్రబాబునాయుడు అవినీతిచేస్తున్నాడని అధికారంలోకివచ్చిన వ్యక్తి, ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి కరాళనృత్యం చేసేలా చేస్తున్నాడు. అదీ ఈ రెండున్నరేళ్లలో ఈ ముఖ్యమంత్రి సాధించిన గొప్పఅవినీతిప్రగతి.

Leave a Reply