Suryaa.co.in

Andhra Pradesh

పథకాల్లో కోతలు.. ప్రజలపై పన్నుల మోతలు

– రాష్ట్రంపై రూ.12లక్షల కోట్ల అప్పుల భారం
– అంతిమంగా తాడేపల్లి ప్యాలెస్ కు టన్నుల్లో నోట్ల కట్టలు, ఇదీ జగన్ రెడ్డి సాధించింది
• ఫీజు రీయింబర్స్ మెంట్, అమ్మఒడి, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం సహా అన్ని పథకాల్లో కోతలు పెట్టి, గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేకుండా చేశారు
• ప్రచారఆర్భాటంతో ప్రజలసొమ్ము తగలేయడం తప్ప, జగన్ రెడ్డి ప్రజలకు చేసిన మేలు శూన్యం.
• రాష్ట్రంపై రూ.12లక్షల కోట్ల అప్పు.. ఒక్కో వ్యక్తి తలపై రూ.2.05 లక్షల అప్పు తప్ప జగన్ సాధించింది ఏమీ లేదు
• గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు గొప్పగా చెప్పించిన ముఖ్యమంత్రి, అవినీతి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డాడు
• ప్రజలకు ఇచ్చామని చెబుతున్న రూ.4లక్షల కోట్లు ఎక్కడ ఎవరికి పంచారో ముఖ్యమంత్రి చెప్పాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించిన ముఖ్యమంత్రి ఎల్లకాలం ప్రజల్ని మోసగించలేడని, గోబెల్స్ ప్రచారాన్ని తలపించిన గవర్నర్ ప్రసంగంలో అంకెలు పెంచి చెప్పడం తప్ప ఎక్కడా వాస్తవాలు లేవని, ప్రభుత్వం తనకు ఇచ్చిన కాగితాల్లోని అబద్ధాలు చెప్పలేక ఆఖరికి గవర్నర్ కూడా నాలుగుసార్లు మంచినీళ్లు తాగారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవాచేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

“ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన పెద్దమనిషి నవరత్నాల ముసుగులో దోపిడీకి పాల్పడి, మోసకారీ సంక్షేమంతో ప్రజల్ని వంచించాడు. అన్నిరంగాల్లో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ముఖ్యమంత్రికి పేర్ల పిచ్చి, రంగుల పిచ్చి తప్ప ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఆలోచనే లేకుండా పోయింది. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహానీయుడి పేరుకూడా తీసేసి పథకా లకు తన పేరు పెట్టుకోవడం ద్వారా జగన్ రెడ్డి తనప్రచార పిచ్చిని పతాకస్థాయికి చేర్చాడు.

అమ్మఒడి పథకం బ్రహ్మండంగా అమలుచేస్తున్నట్టు జగన్ రెడ్డి గవర్నర్ ద్వారా చెప్పించాడు. రాష్ట్రంలో 84లక్షల మంది విద్యార్థులుంటే, కేవలం 43 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వడం బ్రహ్మండం ఎలా అవుతుందో ముఖ్యమం త్రే చెప్పాలి. ఏటా రూ.15వేలు అందిస్తానని చెప్పి, రూ.13వేలు ఇవ్వడం ఎలాంటి ఉద్ధరణో కూడా ఆయనే చెప్పాలి. అమ్మఒడి పథకం ద్వారా నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి తల్లులకు రూ.9,250 కోట్లు ఎగ్గొట్టాడు.

ఫీజు రీయింబర్స్ మెంట్, అమ్మఒడి, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం సహా అన్ని పథకాల్లో కోతలు పెట్టి, గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేకుండా చేశారు
ఫీజు రీయింబర్స్ మెంట్ పేరుతో పీజీ విద్యార్థులకు పంగనామాలు పెట్టాడు. ఇంజనీరింగ్ విద్యార్థులకు నాలుగు విడతలు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఎగ్గొ ట్టాడు. జగనన్న వసతి దీవెన పథకం కింద ఒక్కో విద్యార్థికి నాలుగున్నరేళ్లలో రూ.90వేలు ఇవ్వాల్సి ఉంటే, కేవలం రూ.30వేలు ఇచ్చి మమ అనిపించాడు. ఇలా అన్ని పథకాల్లో కోతలే. వివిధ వృత్తుల వారికి ఏటా రూ.10వేలు ఇస్తానని చెప్పి, అర్హులసంఖ్యలో కోతలు పెట్టాడు. ఆటో డ్రైవర్లు రాష్ట్రంలో 13 లక్షల మంది ఉంటే, జగన్ రెడ్డి కేవలం 2.50లక్షల మందికే ఆర్థికసాయం అందించాడు.

రాష్ట్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో వాహనాలు ఉన్నవారి సంఖ్య 12.80 లక్షలు అయితే, వాహన మిత్ర పథకం కింద జగన్ రెడ్డి కేవలం 2.78 లక్షల మందికే ఆర్థికసాయం అందించాడు. లబ్ధిదారుల సంఖ్యలో కోతపెట్టడమే గాకుండా దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలుపెంచాడు. రోడ్డు పన్ను, గ్రీన్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచాడు. చేనేత కార్మికులు రాష్ట్రంలో 31 లక్షల మంది ఉంటే, కేవలం 81 వేల మందికి రూ.24వేలు మాత్రమే అందించాడు. కేంద్రప్రభుత్వం నూలుపై ఇచ్చే రాయితీసొమ్ముని కూడా ఎగ్గొట్టాడు .

రాష్ట్రంలో 13లక్షల మంది టైలర్లు, 5.50లక్షల మంది నాయీబ్రాహ్మణులు, 28.63 లక్షల మంది రజకులు ఉంటే, జగనన్న చేదోడు పథకం కింద కేవలం మొత్తంగా అన్నివర్గాలకు కలిపి 3.20లక్షల మందికే రూ.10వేల ఆర్థిక సాయం అందించాడు. ఈ ఒక్క పథకంలోనే ఎంతమందికి దగా చేశాడో చూడండి. రాష్ట్రప్రభుత్వం తరుపు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, చేతివృత్తుల వారికి కేంద్రం అందించే స్వయం ఉపాధి రుణాలు కూడా అందకుండా చేశాడు. వీటన్నింటికీ తోడు చంద్రబాబు పేదలకు అందించిన పెళ్లికానుక, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, విదేశీవిద్య పథకాల్ని కూడా రద్దుచేశాడు.

దళితులు, బీసీలు, మైనారిటీ లకోసం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అమలుచేసిన 120కి పైగా పథకాలు రద్దుచేశాడు. ఎన్నికలు దగ్గరకొచ్చాయని ఆఖరిసంవత్సరంలో అన్నీ పథకాలు అందిస్తానని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. ఆఖరికి సామాజిక పింఛన్లు పెంచకుండా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని వంచించాడు. అసంఘటిత కార్మికుల రేషన్ కార్డులు కూడా రద్దుచేస్తున్నారు. ఇవేవీ చెప్పకుండా గవర్నర్ ప్రసంగం పేరుతో అబద్ధాలు చెప్పించారు.

గవర్నర్ ప్రసంగంలో అవినీతి ప్రస్తావన ఎందుకు లేదు? తానే అవినీతిపరుడు కాబట్టి ఆ ఊసే లేకుండా జగన్ జాగ్రత్త పడ్డాడా?
పోలవరం సహా అన్ని జలవనరుల ప్రాజెక్టుల్ని పడుకోపెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ టీడీపీహాయాంలో 72శాతం పూర్తయిందని ఈ ప్రభుత్వమే చెప్పింది. 5ఏళ్లలో మిగిలినపనిని పూర్తిచేయలేక రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి చివరకు మొత్తం ప్రాజెక్ట్ నే గోదాట్లో ముంచేశారు. ప్రాజెక్ట్ లు, డ్యామ్ ల గేట్లను కూడా సమర్థవం తంగా నిర్వహించలేక కొట్టుకుపోయేట్టు చేశారు. పరిశ్రమలు లేవు.. పెట్టుబడులు లేవు.. సంక్షేమం అరకొరే. మరోపక్క వివిధ రకాల పన్నులు, ఛార్జీలు భారీగా పెంచేశారు. గవర్నర్ ప్రసంగంలో ఒక్క అవినీతి ప్రస్తావనే లేకుండా చేశారు. ముఖ్యమంత్రే పెద్ద అవినీతిపరుడు కాబట్టి, ఆ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డాడు.

ప్రచారఆర్భాటంతో ప్రజలసొమ్ము తగలేయడం తప్ప, జగన్ రెడ్డి ప్రజలకు చేసిన మేలు శూన్యం. రాష్ట్రంపై రూ.12లక్షల కోట్ల అప్పు.. ఒక్కో వ్యక్తిపై రూ.2.05 లక్షల అప్పు తప్ప జగన్ సాధించింది ఏమీ లేదు
దళితులపై జరిగిన దాడులు, హత్యలు, వేధింపుల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఎందుకులేదు? బీసీలపై జరిగిన దమనకాండ ఊసేది? మైనారిటీలపై సాగిస్తున్న దమనకాండ గురించిన ప్రస్తావన ఎందుకులేదు? కేంద్రప్రభుత్వం స్థానిక సంస్థల కు ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించడంతో ఆఖరికి వైసీపీ సర్పంచ్ లు కూడా రోడ్లెక్కారు. స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల్లో 90శాతం మంది వైసీపీ వారు న్నా జగన్ రెడ్డి వాళ్లను రోడ్డెక్కించడం ఏమిటి? రోడ్లన్నీ గుంతలమయం.. నడుములు విరిగిపోతున్నా ముఖ్యమంత్రిలో చలనంలేదు. రోడ్డు సరిగా లేక ప్రమాదాల బారిన పడి వందలమంది చనిపోతున్నా, సిగ్గులేకుండా గవర్నర్ ప్రసంగంలో రోడ్లన్నీ అద్దాల్లా ఉన్నాయని చెప్పించారు.

రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో కేంద్రప్రభుత్వ పథకాల నిధులు కూడా ఆగిపోయాయి. మహిళలపై నేరాలు… ఘోరాల్లో రాష్ట్రమే దేశంలో నంబర్-1 స్థానంలో ఉంది. దిశా యాప్ పేరుతో మహిళల్ని మోసగించాడు. ఉన్న రక్షణచట్టాలు సక్రమంగా అమలు చేయకుండా ఉత్తుత్తి చట్టాలు తీసుకొస్తే రక్షణ ఎక్కడుంటుంది? వేలకొద్దీ రైతుభరోసా కేంద్రాలు నిర్మించినట్టు, అవే రైతులకు అన్నీ అందిస్తున్నట్టు గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థా నంలో ఉన్న విషయం మాత్రం చెప్పలేదు.

కేంద్రప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో సంబంధం లేకుండా ఏటా ప్రతి రైతుకి రూ.13,500లు ఇస్తానన్న జగన్ రెడ్డి, రైతులసంఖ్య తగ్గించి ఇస్తానన్న సొమ్ముని రూ.7,500లకు ఎందుకు తగ్గించాడు ? సున్నావడ్డీ రుణాలు ఎంతమంది రైతులకు ఇచ్చాడో చెప్పాలి? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో వారు ఎవరూపనులు చేయడానికి ముందుకు రావడం లేదు. 4 ఏళ్ల 10 నెలల్లో జగన్ రెడ్డి రాష్ట్రంపై రూ.12 లక్షల కోట్ల అప్పులభారం మోపాడు. ప్రతి వ్యక్తి తలపై రూ.2.05 లక్షల అప్పు వేశాడు. 15 రోజులకోసారి బటన్ నొక్కుడు పేరుతో వందలకోట్ల ప్రజాధనం ప్రచార ఆర్భాటానికి తగలేయడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం.

టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 40,969 పరిశ్రమలు వస్తే, 13,88,733 ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే చెప్పింది పెట్టుబడుల సాధనలో, పరిశ్రమలు తీసుకురావడంలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 40, 969 పరిశ్రమలు వచ్చాయి. వాటిలో భారీ పరిశ్రమలు 1269 ఉంటే, సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమలు 39,450 ఉన్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగా లకు సంబంధించి 250వరకు ఉన్నాయి. అలానే టీడీపీ హాయాంలో ఐదేళ్లలో విదే శీ పెట్టుబడులు రూ.65,327కోట్లు వచ్చాయి. మెగా మరియు భారీ పరిశ్రమల రాకతో రాష్ట్రంలో రూ.5,47,789 కోట్ల పెట్టబడులు వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమల వల్ల రూ.5,03,294కోట్ల పెట్టుబడులు వస్తే, ఐటీ మరి యు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలద్వారా రూ.1497కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

ఈ లెక్కలన్నీ వైసీపీప్రభుత్వమే గతంలో వెల్లడించింది. ఈ విధంగా పెట్టుబడులు.. పరిశ్రమల ద్వారా టీడీపీ హాయాంలో మొత్తం రాష్ట్రంలో 13,88,733 ఉద్యోగాలు వచ్చాయని కూడా వైసీపీ ప్రభుత్వమే చెప్పింది. ఈలెక్కలన్నీ జిల్లాల వారీగా జగన్ సర్కారే అసెంబ్లీలో వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేసినా చివరకు రాష్ట్రానికి సాధించిన పెట్టుబడులు, ఉద్యోగాలు అరకొరే. 18 ఎంవోయూలు చేసుకున్న వైసీపీప్రభుత్వం రాష్ట్రంలో కేవలం రూ.5,710కోట్లను మాత్రమే గ్రౌండ్ చేయించగలిగింది. తద్వారా వచ్చిన ఉద్యోగాలు కేవలం 9,158 మాత్రమే. పెట్టుబడులు తీసుకురావడంలో, పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో జగన్ రెడ్డి సర్కార్ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం.

ప్రత్యేకహోదా, మద్యపాన నిషేధం, జీతాల పెంపుదల, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సీపీఎస్ రద్దు హామీలు ఏమయ్యాయో, వాటిప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఎందుకు లేదో ముఖ్యమంత్రి చెప్పాలి
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించి యువత కు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తానని, 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాన ని, ఏటా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నజగన్ రెడ్డి హామీలన్నీ బూటకాలుగానే మిగిలిపోయాయి. మద్యం అమ్మకాలతో గతప్రభుత్వానికి రూ.7వేల కోట్ల ఆదాయం వస్తే, జగన్ రెడ్డి వచ్చాక కల్తీ మద్యం అధికధరకు అమ్మించి రూ.18లక్షల కోట్ల ఆదాయం రాబట్టాడు. దశలవారీ మద్యనిషేధం అని చెప్పి మహిళల్ని మోసగించాడు తప్ప, ప్రభుత్వం అమ్మే మద్యం తాగవద్దని కనీసం తన సాక్షి పత్రికలో కూడా ప్రకటన ఇవ్వలేదు. మద్యం ద్వారా సంభవించిన మరణాలన్నీ ప్రభుత్వహత్యలు గానే పరిగణించాలి. ఆశావర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచుతాను, ఔట్ సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చాడు.

చివరకు జీతాలుపెంచమని రోడ్లపైకి వచ్చినవారిని తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేశాడు. సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వంచించాడు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు విలువ లేకుండా చేశాడు. ఇలాంటి అనేక అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఎందుకు లేవో ముఖ్యమంత్రి చెప్పాలి. చెట్లు నరికించి మరీ జనంలోకి రావడానికి జగన్ రెడ్డి ప్రయత్నించడం ఆయనలోని భయానికి సంకేతంకాదా? ఉక్కుపాదంతో ప్రజాగ్రహాన్ని, ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి చూస్తున్నా డు.

ప్రజలకు ఇచ్చామని చెబుతున్న రూ.4లక్షల కోట్లు ఎక్కడ ఎవరికి పంచారో ముఖ్యమంత్రి చెప్పాలి
ప్రజలకు పంచినట్టు ప్రభుత్వం చెబుతున్న రూ.4లక్షల కోట్ల ఎక్కడపంచారో, ఎవరికి పంచారో ముఖ్యమంత్రి పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచాలి. తాడేపల్లి ప్యాలెస్ కు ట్రక్కుల కొద్దీ కరెన్సీ చేరిందితప్ప, వాస్తవంలో ప్రజలకు జరిగిన మేలు శూన్యం. ఆఖరికి ముఖ్యమంత్రికి రోజూ చేరే సొమ్ముని లెక్కించలేక టన్నుల్లో లెక్కలేసి తరలిస్తున్నారు. ప్రజలకు ఇచ్చినహామీల్లో జగన్ రెడ్డి 85 శాతం ఫెయిల్ అయ్యాడు అనేది కాదనలేని వాస్తవం.

తన తండ్రి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయలేని అసమర్థుడిగా జగన్ రెడ్డి ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. 4,923 మంది యువతకు చంద్ర బాబు విదేశీ విద్య పథకం కింద ఆర్థికసాయం అందిస్తే, జగన్ రెడ్డి కేవలం 357 మందికి అరకొరగా ఆర్థికసాయం అందించాడు. దళితులకు దగా.. బలహీనవర్గా లకు దగా.. మైనారిటీలకు దగా.. మహిళలకు దగా. ఇలాంటి దగాకోరు ప్రభుత్వా న్ని, దగాకోరు ముఖ్యమంత్రిని సాగనంపాల్సిన సమయం వచ్చింది.” అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు

LEAVE A RESPONSE