Home » రుణ యజ్ఞం పేరిట అప్పులు:రఘురామ

రుణ యజ్ఞం పేరిట అప్పులు:రఘురామ

ప్రభుత్వం రుణ యజ్ఞం పేరిట అప్పులు తెస్తోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త కోణాల్లో అప్పు ఎలా తీసుకురావాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏపీ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కింద రూ. 3వేల కోట్లు రుణం తెచ్చిందని, ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా జీవో ఇచ్చి 574 ఎకరాలు, ఆర్‌అండ్‌బీ ఆస్తులపై అప్పులు తేవాలని చూస్తోందన్నారు. కొవిడ్ కాలంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని 5 శాతానికి పెంచారని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ప్రజల ఆస్తులు అమ్మే హక్కు ఉండదన్నారు. చెత్త నుంచి సంపదను తయారు చేసే సెంటర్లకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసిందని రఘురామ గుర్తుచేశారు. మూడు రంగులకు స్వస్తి చెప్పాలని సీఎం జగన్‌ను కోరుకుంటున్నాని అన్నారు. ఉద్యోగులు డీఏ అడుగుతున్నారు.. వారి బకాయిలూ పెద్ద ఎత్తున్న ఉన్నాయని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సరైన సమయానికి రావడం లేదని రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Leave a Reply