– ఇదీ అమ్మఒడి-తల్లికివందనం పథకాలకు తేడా
– ఇదీ జగన్-బాబు మధ్య తేడా
“ఒక బిడ్డను బడికి పంపితే రూ.15,000.. ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ఆ తల్లికి రూ.30,000 సంవత్సరానికి” ఇస్తామని భారతి రెడ్డి చెప్పారు, జగన్ రెడ్డి చేయలేదు.. చంద్రబాబు నాయుడు చేసి చూపించారు..
నాడు ఇద్దరు, లేదా అంతకన్నా ఎక్కువ బిడ్డలున్న తల్లికి జగన్ పరీక్ష పెట్టాడు.. నీ బిడ్డలలో ఏ బిడ్డను చదివించుకుంటావో నువ్వే తేల్చుకో అన్నాడు. కన్నపేగు ఏ బిడ్డను ఎంచుకోగలదు..! ఒకరికి మంచి, ఒకరికి చెడు చేయగలదా జగన్ రెడ్డి మాటలు విని..!?
ఆ తల్లుల కన్నీటి బాధలు విన్న నాయకుడు చంద్రబాబు నాయుడు.. “నీకు ఎంత మంది బిడ్డలుంటే ఆ బిడ్డలందరినీ చదివించే బాధ్యత నాది.. ప్రతి బిడ్డను చదువించమ్మా.. నీ బిడ్డలందరికీ ఒక్కరికీ రూ.15,000 వేలు నేను ఇస్తాను” అన్నాడు. 67 లక్షల మంది తల్లులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఒక్కొక్కరికి రూ.15,000 వేలు చొప్పున ఆ తల్లుల అకౌంట్లలో జమచేసి చేతల్లో చూపించాడు.
గాలి మాటలు చెప్పే నాయకుడు ఇచ్చిన మాటను ఆ గాలికే వదిలేస్తే బాధ్యత తెలిసిన వాడిగా చంద్రన్న చేతల్లో చేసి చూపించాడు.