-సమపాళ్ళలో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది
-అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సాగుతుంది
-త్వరలోనే గార్మెంట్స్ పరిశ్రమకు శంకుస్థాపన
– బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
పెనుకొండ : అభివృద్ధి ఒకవైపు, మరోవైపు సంక్షేమం సమపాళ్ళలో అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సవిత అన్నారు. పెనుకొండ మండలం నాగులూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటగా జలజీవన్ మిషన్ పథకం కార్యక్రమంలో భాగంగా నాగులూరు గ్రామంలో నూతన బోరు వేయటానికి పూజ చేశారు అనంతరం 1 కోటి 5 లక్షల రూపాయలతో పూర్తి చేసిన సిసి రోడ్డు ప్రారంభించిన మంత్రి సవిత.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ ప్రజలు కలలకు ప్రతిరూపంగా, వారి ఆశలు నేరవేర్చే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం అని మంత్రి సవిత అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరుస్తూ వస్తున్నామని,ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రామీణ రహదారులను ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట కోసం రాష్ట్రంలో అనేక రకాల ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా మాటకు కట్టుబడి ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి సారి టిడిపి హయాంలోనే ఫింఛన్ పెంచడం జరిగింది.
గతంలో ఎన్టీఆర్ మొదలుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకూ 200 నుండి 1000 నుండి 2000 వరకూ ఫింఛన్ ను పెంచిన ఘనత టిడిపికే దక్కుతుంది. 2వేల నుండి 3వేలు తీసుకుని రావడానికి ఐదేళ్ళు పట్టినప్పటికీ పూర్తిగా అమలు చేయలేక పోయారని తెలిపారు. 3 వేల నుండి 4వేలు పెంచడంతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకూ 3 నెలలకు వెయ్యి వెయ్యి కలిపి 3 వేల రూపాయలు ఇచ్చి ఫింఛన్ పంపిణీలో చరిత్ర సృష్టించడం జరిగిందన్నారు.
అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేందేలా కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని మంత్రి తెలిపారు. త్వరలోనే పెనుకొండ ,రొద్దం పరిసర ప్రాంతాలలో మహిళలకు ఉపాధి కోసం గార్మెంట్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పరిశ్రమ స్థాపన కోసం స్థల పరిశీలన కూడా జరుగుతోందని మంత్రి సవిత తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…