Suryaa.co.in

Andhra Pradesh

26 అంశాలతో అభివృద్ధి కార్యక్రమాలు

-గురజాల ఆర్థిక ప్రగతికి ప్రణాళిక
-టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు

గురజాల నియోజకవర్గ ఆర్థిక ప్రగతికి 26 అంశాలతో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల నేపథ్యంలో దానిని శుక్రవారం విడుదల చేశారు. వాటిలో కృష్ణా నది నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథóకం ద్వారా సమాధానంపేట, గొట్టిము క్కల, దైద, తేలుకుట్ల గ్రామాలలోని 13 వేల ఎకరాలకు సాగునీరు, తంగెడ, ముత్యాలం పాడు, మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం, కొత్తూరు గ్రామాలలోని 15 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, నడికుడి మార్కెట్‌ యార్డ్‌ గుంటూరు మిర్చి యార్డు తరహాలో అభివృద్ధి చేసి సీసీఐ కేంద్రాల ఏర్పాటుతో పంటలకు గిట్టుబాటు ధర కల్పించటం, రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కల్పించి నష్టపోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వటం, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లు, పనిముట్లు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై సరఫరా, 500 కిమీల మేర డొంక రోడ్లు నిర్మించి పొలం బాటలు వేయటం తదితర అంశాలు ఉన్నాయి.

అలాగే మోర్జంపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను కొత్తపాలెం, తురకపాలెం, మాచవరం గ్రామాల వరకు పొడి గించి అదనంగా 10 వేల ఎకరాలకు, పిల్లేరు వాగు ద్వారా 3 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా నియోజక వర్గంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటి కొళాయి కనెక్షన్లు అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని చిప్స్‌, పల్వరైజింగ్‌, లైమ్‌ ఇండస్ట్రీ యజమానులపై పెట్టిన అక్రమ కేసు లు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఎత్తివేస్తామని ప్రకటించారు. పిడుగురాళ్ళ- జానపాడు రైల్వే బ్రిడ్జికి నిధులు కేటాయించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయటం, 6 వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అర్హులకు 3 నెలల్లో అందించటం, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా గృహాల మంజూరు చేస్తామని తెలిపారు. రూ.100 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని మేజర్‌, మైనర్‌ కాలువలను ఆధునీకరణ, రూ.200 కోట్లతో పక్కా సిమెంట్‌ సైడు కాలువలు నిర్మాణం, ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిడుగురాళ్ల, దాచేపల్లిలో మినీ స్టేడియాలు, క్రికెట్‌ సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయ టంతో పాటు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి క్రీడల నిర్వహించేలా చూస్తామని వెల్లడిరచారు.

స్వయం ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 10 లక్షల వరకు ష్యూరిటీ లేని రుణాలు, అర్హులైన వారికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలతో 1000 కార్ల పంపిణీ, మహిళా సంబంధిత పరిశ్రమల ఏర్పాటు, ప్రతి గ్రామంలో గేదెలు, గొర్రెలు, కోళ్ల పెంపకం కోసం సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తామని తెలిపారు. కోటప్పకొండ తరహాలో దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, గుత్తికొండ బిలం, మోర్జంపాడు బుగ్గమ ల్లేశ్వర స్వామి దేవస్థానం, భట్రుపాలెం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి, దాచేపల్లి వీర్ల అంకమ్మతల్లి దేవస్థానం అభివృద్ధి, కళ్యాణ మండపం నిర్మాణం, నియోజకవర్గంలో 50కి పైగా కమ్యూనిటీ హాళ్లు, షాదీఖానాల నిర్మాణం, భూమి లేని దళితు లకు ఎకరం భూమి కేటాయింపు, ఎస్టీలు సాగు చేసుకుంటున్న అటవీ భూములను క్రమబద్దీకరణ తదితర అంశాలు ఉన్నాయి.

LEAVE A RESPONSE