బీసీలకు మేలు చేశాం అని చెప్పే సత్తా మంత్రులకు ఉందా?

-మెడికల్ సీట్లు అమ్ముకున్న చరిత్ర ఈ వైకాపా ప్రభుత్వానిదే
-టీడీపీ జనసేన పొత్తు రాష్ట్ర ప్రజల కోసమే
-రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరు
– ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ

పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు సంగండైరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అధ్యక్షతన పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జయహో బిసి సదస్సు పెదకాకాని సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎం.ఎల్.సి దువ్వారపు రామారావు మాట్లాడుతూ… నాలుగేళ్ల వైకాపా పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు నిజంగా మేలు చేసింది టీడీపీ ప్రభుత్వమే. బిసి సబ్ ప్లాన్ ను నిర్వీర్యం చేసింది వైకాపా ప్రభుత్వం. బీసీలకు విదేశీ విద్యను దూరం చేసినది జగన్.

బీసీలను మోసం చేయటానికి మరోసారి వస్తున్న వైకాపా నాయకులు.బీసీలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ర్టంలో అనేక దాడులు జరిగాయి. అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించాలిసిన సమయం వచ్చింది. బీసీలు టీడీపీ కి మద్దతుగా నిలవాలి.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ… బిసిలు తలయెత్తుకుని నిలబడేలా చేసిన నాయకుడు ఎన్టీఆర్. బీసీలకు రాజ్యధికారాన్ని అందించిన పార్టీ టీడీపీ. బిసిలు కోసం ఒక్క పథకాన్ని పెట్టని ప్రభుత్వం. ఈ వైకాపా ప్రభుత్వంలో బీసీలకు అడుగడుగునా అవమానాలు. బీసీలకు మేలు చేశాం అని చెప్పే సత్తా మంత్రులకు ఉందా?

టిడిపి ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం ద్వారా బీసీలకు చేయూతను అందించాం. ఈ వైకాపా ప్రభుత్వంలో బిసిలపై దాడులు పెరిగాయి. మెడికల్ సీట్లు అమ్ముకున్న చరిత్ర ఈ వైకాపా ప్రభుత్వానిదే. జగన్ పాలనను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం టీడీపీ మరియు జనసేన కలిసి నడుస్తున్నాయి.

మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ… పొన్నూరు నియోజకవర్గం తో విడదీయరాని బంధం నాకు ఉంది. జ్యోతిరావు పూలే స్పూర్తితో అన్న ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేయాలని అనేక విధాలుగా ప్రోత్సాహం అందించారు. అనేక ఉన్నత పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబుదే.

పార్లమెంటులో ఉన్నత స్థానంలో కూర్చునే అవకాశం నాకు దక్కింది అంటే టీడీపీ వల్లనే. టీడీపీ లోనే బీసీలకు సరియైన న్యాయం జరిగింది జరుగుతుంది. టీడీపీలోనీ బిసి నాయకులను వేధించిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. వైకాపా అవినీతి పాలనా నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరు. టీడీపీ జనసేన పొత్తు రాష్ట్ర ప్రజల కోసమే.

టిడిపి గుంటూరు జిల్లా బిసి విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. టిడిపి హయాంలో ఆదరణ పధకం ద్వారా 124 బీసీ కుల వృత్తులకు దాదాపు 1000 కోట్ల వ్యయంతో 341 రకాల పనిముట్లను 90 శాతం సబ్సిడీతో 10 వేల నుండి 30 వేల వరకు విలువచేసే ఆధునిక పనిముట్లు అందించి వారి ఆదాయం పెరిగేందుకు తోడ్పడ్డారు.. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా నాలుగున్నర లక్షల మందికి 3700 కోట్లతో స్వయం ఉపాధి రుణాలు అందించి సొంత కాళ్లపై నిలబడేలా చర్యలు తీసుకున్నారు…

విదేశీ విద్య పధకం ద్వారా దాదాపు 2 వేల మంది బీసీ విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించారు.టిడిపి హయాంలో బీసీ సబ్ ప్లాన్ క్రింద 32 వేల కోట్ల నిధులు కేటాయించి బిసిలను ఆర్ధికంగా బలోపేతం చేశారు. టిడిపి హయాంలో చంద్రబాబు బిసిల కోసం 168 కోట్లు నిధులు విడుదల చేసి 1200 కమ్యూనిటీ హాల్స్, 57 కోట్లు నిధులు విడుదల చేసి 13 బీసీ భవనాలు నిర్మాణం చేపట్టి 75 శాతం పనులు పూర్తిచేయగా… జగన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో మిగిలిన 25 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా బిసిల ద్రోహి అని నిరూపించుకున్నాడు.

బిసిలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన బిసిల దగాకోరు జగన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బిసిలందరు ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి… బిసిల అభ్యున్నతికి తోడ్పడిన చంద్రబాబు ని ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాష్ట్ర బీసీ విభాగం ప్రధానకార్యదర్శి మల్లెల ఈశ్వరరావు , రాష్ట్ర బీసీ విభాగం అధికార ప్రతినిధి ఉప్పటూరి పేరయ్య , తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్ళ వెంకటేశ్ యాదవ్ , రాష్ట్ర బీసీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి తుమ్మెటి మురళి , రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి ఇనకొల్లు భగత్ , జిల్లా బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి మాదల చినకొండలరావు, గారు, విశ్వబ్రాహ్మణ సాధికార జిల్లా కన్వినర్ జంపని నాగేశ్వరావు ,రాష్ట్ర సగర సాధికార కన్వీనర్ జంపని శ్రీనివాసరావు , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గుంటుపల్లి నాగేశ్వరావు , పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు దివి శివరాం , పొన్నూరు నియోజకవర్గ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మండలాల నాయకులు కార్యకర్తలు, బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply