– 2029 లో చేయండి
– ఇది సింగపూర్ కాదు…ఆంధ్రా
అమరావతికి మరో 40 వేల ఎకరాల భూసమీకరణ. మంచిదే. కానీ ఇప్పుడు కాదు. 2029 లో మరలా గెలిచినాక సమీకరించండి. మీకిచ్చిన సమయం ఐదు సం.లుమాత్రమే. మరలా చెట్లు నరికే వాడు వస్తే ముళ్ళ చెట్లు పెంచుతాడు.
ఎక్కడెక్కడి వాళ్లనో తీసుకొచ్చి సెంటు ,రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు గా ఇస్తాడు. అసలు ఈ లోపు కావల సినంత బురద చల్లడానికి వాడికి కిరాయి రాత గాళ్ళు ,విశ్లేషకులు, అనేక రకాల బే వార్సు గాళ్ళు ఉన్నారు.
కొద్ది మంది రైతుల డిమాండ్లను పరిష్కరించి సీడ్ యాక్సెస్ రోడ్ ను నిర్మించ లేని పరిస్థితిలో ఉన్నారు.స్వభావ రీత్యా మీరు మెతక, సాధుస్వభావులు. అసలు మీరు ఆక్రమణలు తొలగించలేరు.ఇళ్ల స్థలా లు , ఇళ్లు ఇస్తున్నప్పటికీ కాలువ గట్ల ఆక్రమణలు తొలగించ గలిగారా ? బుడమేరు ఆక్రమణలు తొలగించ గలిగారా ? ఇంటికి పాతిక వేల దాతల సొమ్ము పంచి , పే లా పిండి చేశారు.
ఇది సింగపూర్ కాదు …ఆంధ్రా. అక్కడ అభివృద్ధి చేసుకొని పోయే లీ కుయా న్ ను వరస పెట్టి గెలిపించారు.ఇక్కడ అభివృద్ధి చేసే వాడిని వెనకా ముందు పొడుస్తారు.నేనూ అభివృద్ధి కోరు కొనే వాడినే ! అయినా సరే దయచేసి పరిగెత్తవద్దు.
చెప్పటమే నా ధర్మం!
చెప్పటమే నా బాధ్యత!!
జాగ్రత్తండీ …జాగ్రత్త !!
– జి వి రామ్ ప్రసాద్
విజయవాడ .