– మా వెంట మంత్రులు వస్తే ఎండిన పంటలు చూపిస్తాం
– ఎకరాకు 30 వేల రూపాయలను నష్టపరిహారం చెల్లించాలి
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
హైదరాబాద్ : రాష్ట్రం లో రైతులు పుట్టెడు దుఃఖం లో ఉన్నారు.పంటలు ఎండిపోయి కొందరు రైతులు బాధలో ఉంటే ,మరి కొందరు అకాల వర్షాలకు నష్టపోయారు. రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది. కాంగ్రెస్ మేనిఫెస్టో లో రైతు డిక్లరేషన్ లో పంట ఏ రకంగా నష్టపోయినా పరిహారం ఇస్తామని వాగ్దానం చేశారు.
కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తామన్నారు. పంటల బీమా పథకం తెస్తామని తేలేదు. నష్టాల్లో ఉన్న రైతులు ,కౌలు రైతులకు ఊరట నిచ్చే ఒక్క చర్య కూడా ప్రభుత్వం వైపు రాలేదు. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. రాష్ట్రం లో మళ్ళీ 2014 కు ముందు కష్టాలు వచ్చాయి.
భూ భారతి పై కూడా రైతులను నయవంచన చేశారు. అసైన్మెంట్ , పోడు భూముల క్రయవిక్రయాల పై చట్టం తెస్తామన్నారు. భూ భారతి లో ఆ ప్రస్తావన ఎందుకు తేలేదు. కేసీఆర్ పై కక్ష తో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాళేశ్వరం కు మరమ్మత్తులు చేయక గోదావరి ని ఎండబెట్టారు. దేవాదుల పంప్ నెల రోజులు ఆలస్యం చేసి పంటలు ఎండబెట్టారు. పాలమూరు లో ప్రాజెక్టులు ఎండబెట్టారు.
నెట్టెంపాడు ,జూరాల ఆయకట్టు కు కూడా సారిగా నీరు ఇవ్వలేదు. .రైతులు ధర్నా చేస్తున్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టు ల పై ప్రభుత్వం స్పందించడం లేదు ఏపీ కి కృష్ణా జలాలు అక్రమంగా తరలిస్తున్నా స్పందన కరువైంది. మా పర్యటనల్లో రైతులు గుండెలు అవిసేలా తమ భాదలు చెబుతున్నారు. మంత్రులకు ఓదార్చే తీరిక లేదా ?
గత ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడం ,అంతర్గత కుమ్ములాటలకే కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. కరెంటు ఇవ్వక నీళ్లు ఇవ్వక పంటలు ఎండబెట్టారు. మా వెంట మంత్రులు వస్తే ఎండిన పంటలు చూపిస్తాం. కాంగ్రెస్ పాలన పదహారు నెలలు గడిచినా అక్రమ కేసులు , కక్ష రాజకీయాల్తోనే కాలం గడుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దేనిపై ముందు చూపు లేదు. తాగునీటి పై ముందస్తు కార్యాచరణ లేదు.
హైదరాబాద్ కు తాగునీటి సమస్య కూడా వచ్చే ప్రమాదముంది. ముందే కరెంటు నీళ్లు ఇవ్వం అంటే రైతులు పంటలు వేసుకునే వారు కాదు. రైతు నష్టాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలి .ఎకరాకు 30 వేల రూపాయలను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఎండిన పంటలతో పాటు వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే. ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పినట్టు చేయకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తాం. రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఆరో అంశం గా ఉన్న అసైన్ మెంట్ ,పోడు భూముల క్రయవిక్రయాలను భూ భారతి లో చేర్చాలి.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల గొట్టే ఆలోచన లేదని కేసీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు భరించడంగా ఉందని అనేక వర్గాలు చర్చించుకుంటున్నాయి. కడుపు మండిన వారు తమ ఆవేదన ను అనేక చోట్ల వ్యక్తం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజల అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చు. మాకైతే ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నాం.
మంత్రుల మధ్య సమన్వయం లేదు: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతోంది. ప్రాజెక్టుల నిర్మాణం పై ఎవరికీ శ్రద్ద లేదు. మంత్రుల మధ్య సమన్వయం లేదు. మొండి చేయి ప్రభుత్వాన్ని బంగాళా ఖాతం లో వేసినా తప్పు లేదు.
రైతులకు మోసం చేసిన ప్రభుత్వం మూట ముల్లె సర్దుకోవాల్సిందే. పాడి రైతులకు బిల్లులు కూడా చెల్లించని అసమర్ధ ప్రభుత్వం ఇది. 80 శాతం ఉన్న రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు.