Suryaa.co.in

Telangana

కేసీఆర్‌కు ఈసీ షాక్

-ఎన్నికల ప్రచారంపై రెండురోజుల నిషేధం
-ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
-ఇది కాంగ్రెస్-బీజేపీ కుట్ర అని కేసీఆర్ ఆరోపణ

ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు షాక్ తగిలింది. ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రచారంపై నిషేధం విధించినట్లు ఈసీ పేర్కొంది.

ఇది కాంగ్రెస్-బీజేపీ కుట్ర: కేసీఆర్
తాను ఎన్నికల ప్రచారం చేయడాన్ని నిషేధం విధించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఎన్నికల కమిషన్, 48 గంటలు తన ప్రచారాన్ని నిషేదించిందని.. బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని అన్నారు. ఇదంతా కాంగ్రెస్-బీజేపీ పన్నిన కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపించి, అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏదీ నెరవేర్చలేదన్నారు.

ఉచిత బస్సుతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రజా సమస్యలు ఎత్తి చూపిన తనపై.. ఎన్నికల కమిషన్ తనను ప్రచారం నిర్వహించకుండా 48 గంటలు నిషేధం విధించిందని.. అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌పై మాత్రం ఎలాంటి నిషేధం లేదన్నారు.

LEAVE A RESPONSE