ప్రజల ఆశలను నాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి

-ఓటు అడగటానికి వచ్చిన వైకాపా నాయకులను నిలదీయండి
-ఒక మసీదుకు సాయం చేయని వ్యక్తి జగన్
-గుంటూరులో జగన్ రెడ్డి ఒక్క రోడ్డుపైన తట్టడు మట్టి వేశాడా?
-జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు… అహంకారి… దోపిడీదారుడు
-జగన్ రెడ్డి లాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం చేస్తా
-మార్పింగ్‌లు చేసి నేను అనని మాటలను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-తెలుగు గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరు నా కుటుంబ సభ్యులే
-స్కూలు బిల్డింగులకు వైకాపా రంగులు వేస్తే చదువు వస్తుందా?
-గంజాయిపై చూపిన శ్రద్ధ అభివృద్ధిపై చూపి ఉంటే రాష్ట్రం బాగుపడేది
-గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు

గుంటూరు: ఈరోజు గుంటూరు మిరపకాయ సత్తా ఏంటో చూపించారు. గుంటూరు ర్యాలీ అదుర్స్. మీ జోష్ చూస్తే…చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్లు మీరు పడిన బాధలు, ఇబ్బందులతో మీరందరు రోడ్డుపైకి వచ్చారు. చిన్నపిల్లలను తండ్రులు భుజాలు పైకి ఎక్కించుకుని వచ్చి ఆ బిడ్డల బాధ్యతను నాకప్పగించారు. ఒకసారి నాయకుడిపై నమ్మకం పోతే దాన్ని మరలా సాధించలేరు. ఆడబిడ్డలు మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పోటీ పడి నడిచారు. మీమల్ని చూస్తే సైకో పార్టీకి డిపాబిట్లు కూడా రావు. మీకు మేడే శుభాకాంక్షలు.

అమరావతిని విధ్యంసం చేసి ప్రజల ఆశలను నాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి
గుంటూరు అమరావతి రాజధానిలో భాగం. హైదరాబాద్, సికింద్రాబాద్ లకు తోడుగా సైబరాబాద్ ను నిర్మించి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాను. సైకో జగన్ రెడ్డి ఇక్కడ అధికారంలోకి రాకుండా ఉండి ఉంటే గుంటూరు ఎక్కడో ఉండేది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు కేవలం 163 కి.మీ మాత్రమే… కానీ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 180 కి.మీ. నా కలలను దుర్మార్గుడు నాశనం చేశాడు.

హైదరాబాద్ లో ప్రభుత్వం భూములు ఉంటే నిర్మాణాలు చేశాం, రోడ్లు వేశాం. అమరావతిలో చాలా విలువైన భూమి. ల్యాండ్ ఫూలింగ్ ద్వారా రైతులనే రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేశాం. 29 వేల మంది రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు భూములిచ్చారు. అమరావతిలో రూపాయి ఖర్చులేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం. అభివృద్ధి చేసిన తర్వాత వారికి వెయ్యి గజాలు ఇచ్చాం. కమర్షియల్ ల్యాండ్ కోసం 250 నుంచి 300 గజాలు ఇచ్చాం. మిగిలింది 3500 చ.అ రోడ్లు, అమరావతి నిర్మాణానికి ఉపయోగించాం.

ఓటు అడగటానికి వచ్చిన వైకాపా నాయకులను నిలదీయండి
2019 లో మీ భూమి విలువ..ఇప్పుడు మీ భూమి విలువ ఎంత? మీ భూమి విలువ తగ్గిందా లేదా? మీ ఇంటి బాడుగలకు నేడు డిమాండ్ ఉందా? మీ కొనుగోలు శక్తి పెరిగిందా? మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా? అమరావతి రాజధాని కావాలంటే సైకోకు ఓటు వేయకూడదు. సైకోపై మీకు కోపం ఉంటే బయటకు రావాలి. ఇక్కడ ఇంకా వైకాపాలో తిరుగుతున్నారు. వైసీపీ కోసం ఓటు అడగటానికి వచ్చిన వాళ్లను మీరు ప్రశ్నించాలి. మీ సైకో కారణంగా మా జీవితాలను నాశనం అయ్యాయని ప్రశ్నించాలి. అమరావతిని నాశనం చేసిన రోజే మీరు ప్రశ్నించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

ఒక మసీదుకు సాయం చేయని వ్యక్తి జగన్
2019 కంటే ఈ ఐదేళ్లలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఆడబిడ్డలు నిత్యవసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారా? ముస్లిం సోదరులకు దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా వచ్చిందా? మరి జగన్ కు ఎందుకు ఓటు వేయాలి. బీజేపీతో కలిశామని దుష్ప్రచారం చేస్తున్నాడు. బీజేపీతో 2014 లోనే కలిశాం. హైదరాబాద్ లో ముస్లింల కోసం హజ్ హౌస్ కట్టాం. అప్పుడే ఉర్ధూ యూనివర్శిటీ కట్టాం. ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం.

ఏపీలో కర్నూలులో మరలా ఫైనాన్స్ కార్పొరేషన్ నేనే పెట్టాను. కర్నూలు, కడపలో హజ్ హౌస్ లు కట్టాం. ముస్లిం సోదరులకు, మౌజం, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. మసీదులకు ఆర్ధిక సాయం చేశాం. ఒక్క ముస్లిం సోదరుడికి ఇబ్బందులు లేకుండా పాలన చేశాం. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రక్షించడానికి సుప్రీంకోర్టులో నాయాయవాదులను పెట్టి వారికి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మసీదులు కూలీపోతాయని సైకో దుష్ప్రచారం చేస్తున్నాడు. ఏనాడైనా జరిగిందా అని అడుగుతున్నా? ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. గుంటూరు చుట్టుప్రక్కల ఎక్కువగా ఉన్నదీ ముస్లింలే. విశాఖకు రాజధాని తీసుకుపోతానని అంటున్నాడు.

ఒక మసీదుకు సాయం చేయని వ్యక్తి జగన్. నేను మీటింగులు పెట్టి అడిగే వరకు మౌజంలకు, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇవ్వలేదు జగన్ రెడ్డి. అందుకే చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా..ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్ లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్ పెట్టి ఏడాదికి వంద కోట్లు ఆర్ధిక సాయం చేస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది. ఇమామ్, మౌజం 10, 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాం. మసీదుల నిర్వహణకు ప్రతీ నెల 5 వేలు ఇస్తాం. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది.

గుంటూరులో జగన్ రెడ్డి ఒక్క రోడ్డుపైన తట్టడు మట్టి వేశాడా?
గుంటూరులోని ప్రతి ఇంటికి పట్టా ఇస్తాం. ఇంటి జాగా లేని వారికి జాగా ఇస్తాం. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఉచితంగా లబ్దిదారులకు ఇస్తాం. గుంటూరులో రోడ్లు బాగున్నాయా అని అడుగుతున్నా. కనీసం గుంటూరు పట్టణంలోనైనా రోడ్లు బాగున్నాయా? గుంటూరు రోడ్లు చాలా విశాలమైన రోడ్లు. వాటిని బాగు చేస్తే గుంటూరు నగరం చాలా సుందర నగరం అవుతుంది. జగన్ రెడ్డి ఒక్క రోడ్డునైనా బాగు చేశాడా అని అడుగుతున్నా? మొత్తం బ్రష్టుపట్టించారు. డ్రైనేజీల్లో పూడికలు తీయలేదు. కూటమి ప్రభుత్వం వస్తానే గ్రామాల నుంచి మండల హెడ్ క్వాటర్ కు, మండలం నుంచి జిల్లా కేంద్రాలకు మళ్లీ పూర్తిగా రోడ్లు వేసే బాధ్యత నాది. పోర్టులకు, ఎయిర్ పోర్టులకు వరల్డ్ క్లాస్ రోడ్లు వేస్తాం.

జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు. అహంకారి. దోపిడీదారుడు:
కూటమి ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజాగళం తీసుకొస్తే.. సైకో కూడా ఒక మ్యానిఫెస్టో తీసుకొచ్చాడు. జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు. ఒక అహంకారి. ఒక దోపిడీదారుడు. రాష్ట్రంలోని సంపదను దోచేశాడు. మద్యం త్రాగేవారిని దోచేశాడు. వారిని తాకట్టు పెట్టాడు. టిడిపి హయాంలో రూ.75 ఉన్న క్వాటర్ బాటిల్ నేడు రూ.200 అయ్యింది. నాడు ఉన్న బ్రాండ్లు నేడు లేవు. ఇప్పుడున్నవన్నీ జే-బ్రాండ్లు. అవన్నీ నాశిరకం బ్రాండ్లు. అవి త్రాగితే ఆరోగ్యం చెడిపోతుంది. మద్యం ఉత్పత్తి, పంపిణీ, సేల్స్ అన్నీ జగన్ రెడ్డే చేస్తాడు. అంటే మనం బలిపశువులం కావాలా?. సైకో పంపే నాశిరకం మద్యం త్రాగి ఆడబిడ్డల తాలిబొట్లు తెగిపోతుంటే మనం ఆయన్ను గొప్ప నాయకుడని పొగడాలా?

జగన్ రెడ్డి లాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం చేస్తా
ఈ రోజు మీరందరు గుర్తు పెట్టుకోవాలి..జగన్ రెడ్డి ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్టు. ఆ చట్టం ప్రకారం మీ ఆస్తి మీ పేరుతో ఉండదు. జగన్ మార్చాలనుకుంటే మార్చేస్తాడు. 10/1, అడంగళ్, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండవు. ఎప్పుడో వారసత్వంగా 30, 40 ఏళ్లు నుంచి వస్తున్న 10/1 అడంగల్ రాబోయే రోజుల్లో ఉండవు. కొత్త చట్టంతో పట్టా ఇస్తే..ఆ ఆస్తి జగన్ రెడ్డి పేరుతో ఉంటుంది. మీ ఆస్తిని మీకు అమ్ముకునే హక్కు ఉండదు. ఆయన కొత్తగా ఆస్తి హక్కు ఇస్తాడంట?

మీకు ఆస్తి మీ తాతలు, మీ తండ్రులు ఇచ్చారా..లేక జగన్ రెడ్డి ఇచ్చాడా? మీ ఆస్తి పత్రాలపై ఆయన పోటో వేసుకుని ఆయనేదో దానం చేసినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. ఇది న్యాయమా? ఇది సైకో మనస్థత్వం కాదా? భూమి సర్వే చేసి రాళ్లు వేసి ఆ రాళ్లపై ఆయన పోటో వేశాడు. ఇంట్లోని ఆస్తి పత్రాలపై ఆయన పోటోనే చూడాలి…పొలానికి వెళ్లినా ఆయన ముఖమే చూడాలి. అందుకే నేను అడుగుతున్నా..మీ భూమిపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటి?

మార్పింగులు చేసి నేను అనని వాటిని అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
కంప్యూటర్ లలో మనుషులనే మార్చేస్తున్నారు. నా పేరుతో తప్పుడు వార్తలు పెడుతున్నారు. నేను అనని వాటికి కూడా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నేను సంతకం పెట్టకపోయినా తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తున్నారు. ఇలా మార్పింగులు చేసే వారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూమి పత్రాలు మార్పింగ్ చేస్తే..మీరెమవుతారు? జగన్ రెడ్డి లాండ్ గ్రాబింగ్ యాక్టు రావడానికి వీలులేదు. రేపు కూటమి ప్రభుత్వం వస్తానే..మొదటి సంతకం మెగా డీఎస్సీపైన పెడితే…రెండో సంతకం జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దు పెడతా.

వైసీపీ కార్యకర్త ఒంటిమిట్టలో ఆన్ లైన్ లో భూమి రికార్డు మార్చేశాడు. తిరిగి తిరిగి విసిగిపోయి…లంచాలు ఇచ్చినా పని కాకపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయం తెలుసుకున్న భార్య, కూతురు విషం త్రాగి చనిపోయారు. చనిపోయిన చేనేత కార్మికుడైన సుబ్బారావు ఒక పాప ఉంది. ఆ పాపకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నాం. కాపాడుకున్నాం. మీ కార్యకర్త రేపు ఇతరుల భూమి పత్రాలు మార్చరని గ్యారెంటీ ఏమిటి జగన్ రెడ్డి? వైకాపా కార్యకర్తలు మన తలరాతలు మార్చేస్తారు.

ఈ గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరు తెలుగుజాతే. వారందరు నా కుటుంబ సభ్యులే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు నన్ను ఆదరించారు. నేను కూడా నాజాతిని నిలబెట్టాను. ప్రపపంచ పటంలో పెట్టగలిగాను. ఐటీని అభివృద్ధి చేసి తెలుగువారిని ప్రపంచం మొత్తం పంపించాను. నన్ను అరెస్టు చేసిన రోజు గుంటూరు నేడు మీరు చూపించిన ఆదరణ మాదిరే నాడు ఆడబిడ్డలు నాకోసం బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. ఆరోజు పోలీసులు అడ్డుపడ్డా నేడు స్వాగతిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు సైకో చేతిలో లేరు. ఎన్నికల కమీషన్ చేతిలో ఉన్నారు. అందుకే మీరు ధైర్యంగా బయటకు రావాలి.

జగన్ రెడ్డి సైకో పాలనతో ఐదేళ్లు వృధా
ఇక మనకు టైం లేదు. 12 రోజులే ఉంది. ఆ చిన్న పాప ఎల్లో శారీ కట్టుకుని..రెండు వేళ్లు చూపుతుంది. ఆ బిడ్డ తండ్రీ నా పాప భవిష్యత్తు మీదే చంద్రన్న అని చెబుతున్నాడు. ఇవన్నీ సఫలీకృతం కావాలంటే..మీరంతా మే 13 న చరిత్ర తిరగ రాయాలి. జగన్ రెడ్డికి రాజకీయాలకు అర్హత లేదు. వాలంటీర్ల తమ్ముళ్లు బ్యాండేజీలు కట్టుకుని వచ్చాయి. గులకరాయి, కోడికత్తి డ్రామాలు ఆడేవ్యక్తి జగన్. బాబాయిని గొడ్డలి వేటుతో లేపేసి వేరే వారిపై నిందలు వేసే వ్యక్తి జగన్. నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు, ఘోరాలు చేశానా?

నేరాలు చేసేవారని తుంగలో తొక్కాను. వారు బయట తిరిగే పరిస్థితి లేకుండా చేశాను. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులు కాపాడాలి. ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి. ఐదు సంవత్సరాలు కాలాన్ని వృధా చేసుకున్నాం. అందుకే నేడు సూపర్ సిక్స్ తీసుకొచ్చాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఒకవైపు, రెండో వైపు జనసేనికులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం బాగుండాలని, యువత భవిష్యత్తు బాగుండాలని వచ్చిన నాయకుడు. అందుకే సూపర్ సిక్స్ ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం.

స్కూలు బిల్డింగులకు వైకాపా రంగులు వేస్తే చదువు వస్తుందా?
ప్రతీ ఒక్కరు కూటమి మ్యానిఫెస్టో చదువుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం, ఉద్యోగాలు సృష్టించడం తెలిపిన పార్టీ. అందుకే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తాం. డీఎస్సీ ఇస్తాం. జాబ్ క్యాలెండర్ పెడుతాం. పిల్లలందర్నీ బాగా చదివిస్తాం. స్కూలు బిల్డింగులకు వైసీపీ రంగులు వేస్తే చదువు వస్తుందా తమ్ముళ్లు. విద్యావ్యవస్థను నాశనం చేశాడు. సాగునీటి వ్యవస్థను, ఆరోగ్య వ్యవస్థను నాశనం చేశాడు. అందుకే కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ఇచ్చి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేసుకునే ఏర్పాట్లు చేస్తాం.

గంజాయిపై చూపిన శ్రద్ధ అభివృద్ధిపై చూపి ఉంటే రాష్ట్రం బాగుపడేది
గుంటూరులో వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. అవునా కాదా? సిటీలో దొరికే గంజాయి సరఫరా ఎవరు చేస్తున్నారు? ఎవరు దీనికి కారణం. జగన్ రెడ్డి అనుచరులు ఈ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ తెలివితేటలు అభివృద్ధిపై చూపితే బాగుండేది. ముస్లిం కాలేజీ వద్ద ఖాళీ స్థలాలు కబ్జా చేశాడు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేశారు.

ఆటో నగర్ లో కబ్జాలు చేశారు. ఇన్నర్ రింగురోడ్డు వద్ద 32 ఎకరాలు కబ్జా చేశాడు. ఇంటి పనిమనిషి కొడుకు టిడిపీలో తిరిగాడని దొంగతనం కేసు పెట్టించి చిత్రహింసలకు గురిచేశాడు. ఒక రోజు వస్తుంది. దీనికంతటికి పరిష్కారం జరిగే రోజు వస్తుంది. గుంటూరు డిప్యూటీ మేయర్ వైసీపీ పార్టీతో విసిగిపోయి తెలుగుదేశంలో చేరుతున్నారు. ఒక మహిళ, ఉత్సాహవంతురాలు ఆమెను తప్పకుండా ఆదరిస్తాం. మంచి అవకాశాలు కల్పిస్తాం

Leave a Reply