పది పరీక్షలపై విద్యాశాఖ ఫోకస్

– కట్టుదిట్టమైన ఏర్పాట్లు
– అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష

అమరావతి: పది పరీక్షల నేపథ్యంలో భద్రతా చర్యలపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. అక్రమాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఈసారి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించింది. అధికారులు సైతం ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది.

Leave a Reply