– ఇళ్లు కట్టుకున్న పేదలకు సైకో జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నాడు
– జగన్ చెత్త పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఏపి నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2
– బాబు ని చూస్తే కంపెనీలు గుర్తొస్తాయి…జగన్ ని చూస్తే జైలు గుర్తొస్తుంది.
– టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం అన్నమేడు గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్
టిడిపి హయాంలో ఇళ్లు కేటాయించారు. నిర్మాణం ప్రారంభించాం. ప్రభుత్వం మారిన తరువాత బిల్లులు ఇవ్వక ఇళ్ళ నిర్మాణం మధ్యలో ఆగిపోయాయి. రైతు భరోసా పడక కొంత మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్నాం.
వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం లేదు.
మీరు రూ.50 వేలు లోపు రుణాలు అన్ని ఒకే సారి మాఫీ చేశారు. ఆ రోజు జగన్ లక్షా యాభై వేలు ఒకే సారి చెల్లించాలి అని డిమాండ్ చేసాడు. వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్ కి నాలుగేళ్లు పట్టింది. ఇంకా చెయ్యలేదు. మీరు చేసింది చెప్పుకోవడం లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటూ లోకేష్ ని ప్రశ్నించిన ఒక రైతు.
అమ్మ ఒడి పథకం అందరికీ అందడం లేదు. కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అంటూ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు.
ఇసుక దొరక్క ఇబ్బంది పడుతున్నాం. – టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో అన్నమేడు గ్రామస్తులు
వారి సమస్యలపై స్పందించిన లోకేష్ ఏమన్నారంటే..
నాలుగేళ్లుగా జగన్ పాలన లో జనం నరకం అనుభవిస్తున్నారు.టిడిపి హయాంలో ఇళ్లు కట్టుకున్న పేదలకు సైకో జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం. 63 వేల మెజారిటీ తో గెలిచిన సూళ్లూరుపేట శాసనసభ్యుడు కనీసం రైతు భరోసా ఇప్పించలేని దుస్థితి లో ఉన్నారు.జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
జగన్ చెత్త పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఏపి నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది రూ.20 వేలు ఇచ్చి రైతుల్ని ఆదుకుంటాం. గతంలో ఇచ్చినట్టే సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.
కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతులకి న్యాయం జరగలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం. టిడిపి హయాంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం. పిల్ల కాలువలు తవ్వాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, పిల్ల కాలువలు తవ్వి ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం. చెరువుల్లో పూడిక తీస్తాం.
కరెంట్ బిల్లులు కట్టక భూసార పరీక్ష కేంద్రాలు జగన్ ప్రభుత్వం లో మూతపడ్డాయి. టిడిపి అధికారంలోకి భూసార పరీక్షలు చేసి సూక్ష్మ పోషకాలు ఇచ్చాం, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు లాంటి పనిముట్లు అందజేసాం. జగన్ మోటార్ల కు మీటర్లు పెడుతున్నాడు. రైతులు మీటర్లు పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది.
పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు.రూ. 200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసింది చంద్రబాబు గారు. పెళ్లి కానుక, పసుపు కుంకుమ, పండుగ కానుకలు ఇచ్చింది చంద్రబాబు. జగన్ పన్నులు పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు.కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచాడు.పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి దేశంలోనే నంబర్ 1. చెత్త పన్ను, ఇంటి పన్ను అంటూ బాదుడే బాదుడు.
మీ కష్టాలు చూసాను… కన్నీళ్లు తుడుస్తాను. అందుకే మహానాడు లో మహాశక్తి పథకాన్ని ప్రకటించాం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500.తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకి సహాయం. ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45 వేలు.దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసి బస్సు ప్రయాణం.
ఒకే సంతకంతో రూ.50 వేల రైతు రుణాలు మాఫీ చేసింది చంద్రబాబు గారు. చేసి చెప్పుకోవడం లో మేము విఫలం అయ్యాం.జగన్ రూ.750 పెన్షన్ పెంచడానికి నాలుగేళ్లు పట్టింది. ఇంకా వెయ్యి రూపాయలు పెంచలేదు. అలాంటి జగన్ ఆనాడు ఒకే సారి లక్షా యాభై వేల రుణమాఫి చెయ్యాలని డిమాండ్ చేసాడు.జగన్ 6 లక్షల పెన్షన్లు కట్ చేశాడు. అనేక నిబంధనలు పెట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తున్నాడు.
జగన్ ముద్దులు, ఒక్క ఛాన్స్ కి ప్రజలు పడిపోయారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ యువతకు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేలు అందిస్తాం. నెల్లూరు జిల్లా కి టిడిపి హయాంలో 73 కంపెనీలు వచ్చాయి 33 వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగాలు వచ్చాయి.
బాబు ని చూస్తే కంపెనీలు గుర్తొస్తాయి…జగన్ ని చూస్తే జైలు గుర్తొస్తుంది.జగన్ ఇసుక దోపిడి ఆదాయం రోజుకి రూ.3 కోట్లు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విధానాన్ని మారుస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విచ్చలవిడి ఇసుక తవ్వకాలకు చెక్ పెడతాం.టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. 10 కి 10 సీట్లు ఇస్తే వైసిపి నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేసింది ఎంటి?అవే సీట్లు మాకు ఇవ్వండి అభివృద్ది అంటే ఏంటో చూపిస్తాం. చెయ్యకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి.