యుద్ధం చేయడమంటే ప్రాణాలకు తెగించాల్సిన అవసరమే లేదు

– రాజకీయ సమాధి చేసిన సీఎం జగన్మోహనరెడ్డి
– 2024 లో 10 కిలోమీటర్ల గోతిలో పాతిపెడతారు
– సారాయిని బాటిలింగ్ చేసింది తెలుగుదేశం పార్టీనే
– సీఎం జగన్ పై బ్యాటింగ్ చేస్తున్నామనుకుని బౌన్స్ అయ్యారు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి (అసెంబ్లీ), మార్చి 24: సీఎం జగన్మోహనరెడ్డితో యుద్ధం చేయడమంటే ప్రాణాలకు అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహనరెడ్డిని ఏమీ చేయలేమని, ఆయనతో యుద్ధం చేయడమంటే ప్రాణాలకు తెగించడమేనని ఆంబోతులా ఉండే అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడన్నారు. జగన్ యుద్ధం చేయడం అంటే మీ ప్రాణాలకు ఏమీ కాదన్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా తిరగవచ్చన్నారు. అసెంబ్లీలోకి వచ్చి చిడతలు కొడుతున్నారని, విజిల్స్ కూడా వేస్తున్నారన్నారు. బల్లలు కూడా చరుస్తున్నారన్నారు.

విజయవాడలో ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్ళి ఆంబోతుల్లా రోడ్లపై రంకెలు వేశారన్నారు. పిచ్చికుక్కల్లా మొరుగుతున్నారన్నారు. ఎన్ని చేసినా మీకేమీ ఇబ్బంది ఉండదని చెప్పారు. అయితే సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం తనతో యుద్ధం చేసే చంద్రబాబుకు, ఆయన పార్టీ నాయకులకు రాజకీయ సమాధి కట్టారని చెప్పారు. అయినా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. 2024 లో జరిగే ఎన్నికల్లో 10 కిలోమీటర్ల గొయ్యి తీసి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, ఆ పార్టీ నేతలను పాతి పెడతారని హెచ్చరించారు. చంద్రబాబును మించిన సన్నాసి పప్పు లోకేష్ అని అన్నారు. 175 నియోజకవర్గాలను 175 జిల్లాలుగా చేయాలని చెబుతున్నాడన్నారు.

నియోజకవర్గమే లేని లోకేష్ ఏ జిల్లాలో ఉంటాడని ప్రశ్నించారు. గాలిలో ఇంకో 58 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే వాటిలో కూర్చుంటాడా అని ఎద్దేవా చేశారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని చంద్రబాబు అప్లికేషన్ ఇచ్చాడన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబును ఆరుసార్లు గెల్పించినా సిగ్గు, శరం లేదన్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడన్నారు. ఆ సమయంలో కుప్పంను రెవెన్యూ డివిజన్ చేస్తే ఎవరైనా ఆపుతారా అని ప్రశ్నించారు. హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ అడుగుతున్నాడన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహనరెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతు అవసరాలను తీర్చడం జరుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దగ్గర నుండి రైతులకు గిట్టుబాటు ధరను అందజేస్తున్నామన్నారు. పరిపాలనను కూడా వికేంద్రీకరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

13 జిల్లాలు 26 జిల్లాలకు పెరిగితే అధికార యంత్రాంగం కూడా ప్రజలకు మరింతగా అందుబాటులోకి వస్తారన్నారు. చీప్ లిక్కర్ ను కనిపెట్టింది చంద్రబాబునాయుడేనని అన్నారు. సారాయిని సీసాల్లో బాటిలింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్లకు, డిస్టలరీలకు పర్మిషన్లు కూడా చంద్రబాబు ఇచ్చారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆధారాలతో చెప్పిన తర్వాత వీటన్నింటికీ మూల కారణం చంద్రబాబు అని రాష్ట్ర ప్రజలకు తెలిసిందన్నారు. దీంతో పిచ్చిపట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో టీడీపీ నాయకులు ఉన్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డిపై బ్యాటింగ్ చేస్తున్నామని అనుకుని బౌన్స్ అయ్యారని విమర్శించారు. ఇంకా ప్రజల్లో నవ్వుల పాలై సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్మీట్లు పెట్టి పిచ్చి కుక్కల మాదిరిగా మొరుగుతున్నారన్నారు. ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలని చంద్రబాబు శోకాలు పెడుతున్నాడన్నారు. అసెంబ్లీ అయిన తర్వాత వచ్చి ఏదో జరిగిపోయిందంటూ ప్రెస్మీట్లు పెడతాడన్నారు. 2024 ఎన్నికలు జరిగే వరకు అల్జీమర్స్ జబ్బుతో బాధపడే చంద్రబాబు, 420 గాళ్ళను తప్పక భరించాల్సిదేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహనరెడ్డి రాజకీయ సమాధి కడతారని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

Leave a Reply