Suryaa.co.in

Telangana

హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ లో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. భవనం లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతు న్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్‎కు సమాచారం అందించారు అక్కడి సిబ్బంది.. స్వరుచి కిచెన్‎లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది.

ఇవి క్రమంగా ఫిల్మ్ ఛాంబర్ కి వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. ఫిలిం ఛాంబర్‎ బిల్డింగ్‎లో ఉండే స్వరుచి హోటల్ కిచెన్‎లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగ అలుముకుంది.

ట్రాఫిక్ సిబ్బంది అక్కడకు చేరుకుని వాహనాలు రోడ్డుపై నిలబడకుండా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

 

LEAVE A RESPONSE