– జనార్థన్‌తో చాటింగ్ పేరుతో బురదచల్లుతున్నారు
– నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణ జరిపించాలి
– ఆరోపణలకు లైడిటెక్టర్ పరీక్షకు సిద్దం
విజయవాడ: నకిలీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌తో తాను చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
జోగి రమేష్ తో పాటు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరదు కల్యాణి, రమేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, MV రామచంద్రా రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, TJR సుధాకర్ బాబు, ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీపీ కార్యాలయానికి వెళ్లారు.
జనార్థన్ రావుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, నకిలీ మద్యం దందాలో కుట్రపూరితంగా తన పేరును వాడుతూ బురదచల్లుతున్నారని జోగి రమేష్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని అడ్డం పెట్టుకుని వైయస్ఆర్సీపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తక్షణం ఈ తప్పుడు ప్రచారాన్ని అరికట్టి, దానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.