సజ్జల వ్యాఖ్యల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తుంది

– సజ్జల లాంటి బాడుగ నేతల బతుకుల లెక్కలు అన్ని తేలుస్తాం
– లోకేష్ పై సజ్జల వ్యాఖ్యలపై మండిపడ్డ ధూళిపాళ్ల నరేంద్ర

తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించిన నీతిమాలిన నాయకత్వాన పని చేస్తూ పుట్టుకల గురించి మీరు మాట్లాడితే జనం హర్షించరు. సైకో ఎవరో…ఎవరు మనస్తత్వ వైకల్యంతో బాధపడుతున్నారో…ఎవరి పుట్టుక రాష్ట్రానికి…సొంత కుటుంబానికి శాపంలా మారిందో… యావత్తు రాష్ట్రం తెలుసు.క్రిమినల్ కోసం క్రిమినల్ పనులు చేస్తున్న మీరూ రేపు మూల్యం చెల్లించక తప్పదు.మీ భవిష్యత్ దుర్బరంగా ఉండబోతుంది…మీ అహంకారం కుప్ప కూలుతుంది. అప్పుడు మీ లాంటి బాడుగ నేతల బతుకుల లెక్క తేలుతుంది. నాడు మీ బానిసత్వం, మీ పుట్టుక మీకే అసహ్యాన్ని కలిగిస్తుంది.