– 6093 అని కొడితే జగన్ రెడ్డి జైలు జీవితం…
– రాజా ఆప్ కరప్షన్ అని కొట్టినా వారి చరిత్రనే గూగూల్ చూపిస్తోంది
– టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సర్వేపల్లి : విశాఖకు గూగూల్ రావడాన్ని వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు… గూగూల్ లో 6093 అని కొడితే జగన్ రెడ్డి జైలు జీవితం మొత్తం బయటకొస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. గూగూల్ టేకవుట్ టెక్నాలజీ ద్వారా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని సీబీఐ గుర్తించింది. జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ గుట్టును రట్టు చేసిందని గూగూల్ పై కోపం పెంచుకున్నట్టున్నారన్నారు.
రాజా ఆప్ కరప్షన్ అని కొట్టినా వారి చరిత్రనే గూగూల్ చూపిస్తోంది. తండ్రిని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోపిడీ చేసిన అవినీతి చరిత్ర బయటకు వస్తోంది.. అందుకునే గూగూల్ అంటేనే కడుపు మంటతో రగిలిపోతున్నారు. రూ.1.33 లక్షల కోట్లతో గూగూల్ ఏపీకి రావడం గొప్ప విషయం. మంత్రి లోకేష్ కృషితోనే కొత్త రాష్ట్రమైన ఏపీ ఈ ఘనతను సాధించింది. గూగూల్ ఏపీలోకి అడుగు పెట్టడాన్ని వైసీపీ, జగన్ రెడ్డితో పాటు సాక్షి కూడా జీర్ణించుకోలేకపోతోందని సోమిరెడ్డి విమర్శించారు.
రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన సంస్థ వస్తుంటే సాక్షి మీడియాలో ఒక్క వార్త లేకపోవడం దురదృష్టకరం. ఇంత కడుపుమంటతో రగిలిపోయే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకోవాల్సివచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తి మళ్లీ సీఎంని అవుతానని కలలు కనడం మరింత దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.