– బనకచర్ల పై బుధవారం సచివాలయంలో సమావేశం
– ముఖ్య అతిధులుగా పాల్గొన నున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– ప్రత్యేక అతిధులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు అహ్హనం
– కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు స్వయంగా ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– అందుబాటులో ఉన్న లోకసభ, రాజ్యసభ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– హాజరు కానున్న తెలంగాణా లోకసభ, రాజ్యసభ సభ్యులు
– గోదావరి-బనకచర్ల పై తదుపరి చర్యలకు కార్యాచరణ ప్రణాళికకు సన్నాహాలు
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును మరింత గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో లోకసభ,రాజ్యసభ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ సమావేశంలో ప్రత్యేక అతిధులుగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లను అహ్హనించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి సమావేశానికి అహ్హనించారు అందుబాటులో ఉన్న లోకసభ సభ్యులు,రాజ్యసభ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి సమావేశంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ మేరకు నేడిక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి,తాను 2025 జూన్ 3 న కొత్త ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ ను స్వయంగా కలసి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరపున అభ్యంతరాలను లేవ నెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అందుకు ప్రతిగా స్పందించిన కేంద్రమంత్రి సి.ఆర్ పాటిల్ స్పందిస్తూ 2025 మే 28 న తనకు రాసిన లేఖలో గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన డి.పి.ఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అందలేదని చెబుతూనే అది అందిన మీదట నీటి కేటాయింపులలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు,ట్రిబ్యునల్ తీర్పులు,అంతర్ రాష్ట్ర ఒప్పందాలతో పాటు 2014 ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాలను పరిగణనలోకి తీసుకున్నకే సమీక్షిస్తామన్నారు.
తిరిగి 2025 జూన్ 13 న తిరిగి తాను కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో గోదావరి-బనకచర్ల లింక్ పథకంపై అభ్యంతరాలను తెలియ పరచడం జరిగిందన్నారు.అంతే గాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను కేంద్ర జల సంఘం నిలువరించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన ఉటంకించారు.
వీటన్నింటినీ సమీక్షించిన మీదట గోదావరి-బనకచర్ల విషయంలో భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహం పై బుధవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో లోకసభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం ఏర్పటు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.