Suryaa.co.in

Andhra Pradesh

పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలు..పిచ్చిపాలనపై గవర్నర్ తక్షణమే కేంద్రానికి ఫిర్యాదు చేయాలి

– చంద్రబాబు. టీడీపీనేతలపై పెడుతున్న తప్పుడు కేసులన్నీ జగన్ రాజకీయ కుట్రలు..కక్షసాధింపుల్లో భాగమే
• పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి పనులపై ప్రజలంతా ఆలోచన చేయాలి., కక్షసాధింపులే ధ్యేయంగా బతుకుతున్న జగన్ వద్ద, నిజంగా చంద్రబాబు తప్పుచేశాడనే ఆధారాలు ఉంటే, నాలుగేళ్లపాటు ఆగేవాడా? : బొండా ఉమా
• ఇసుకాసురుడు జగన్ రెడ్డి ఇసుక దోపిడిని.. రూ.40వేలకోట్ల దోపిడీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆధారాలతో సహా ప్రజలముందు పెట్టారన్న అక్కసుతోనే ఆయనపై ఇసుక కేసు పెట్టారు : ఆనంద్ బాబు
• నాలుగేళ్లలో టీడీపీనేతలపై.. ఇటీవల చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించి ఏ ఒక్క కేసులో అయినా ఈ ప్రభుత్వం ఛార్జ్ షీట్ వేసిందా.. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా పెడుతున్న కేసులు కాబట్టే ఛార్జ్ షీట్లు వేయడం లేదు : వర్ల రామయ్య
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు

గతంలో దేశంలో అధ్వాన్నరాష్ట్రంగా బీహర్ పేరు చెప్పేవారని..ఇప్పుడు ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ భర్తీ చేసిందని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక పిచ్చివాడు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్ని.. ప్రతిపక్షాలను వేధిస్తున్న తీరుని గురించి పక్క రాష్ట్రా లు కథలుకథలుగా చెప్పుకుంటున్నాయని నిజంగా ఇది ఏపీ ప్రజలకు సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన పార్టీ నేతలు వర్ల రామయ్య.. నక్కా ఆనంద్ బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

పిచ్చోడి చేతిలో రాయిగా మారిన జగన్ పాలనపై గవర్నర్ తక్షణమే కేంద్రానికి నివేదిక ఇవ్వాలి : బొండా ఉమామహేశ్వరరావు
ఒక పిచ్చివాడిని ముఖ్యమంత్రిని చేసినందుకు ఆంధ్రాప్రజలు సిగ్గుతో చచ్చిపోతు న్నారు.. డబ్పుపిచ్చి.. కక్షల పిచ్చి.. కేసుల పిచ్చి.. ఇలా ఈ పిచ్చోడి చేతిలో రాయి ఎవరిపై పడుతుందో తెలియని పరిస్థితి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్ర బాబుపైనే రోజుకో కేసు పెడుతోంది ఈ పిచ్చి ప్రభుత్వం. చంద్రబాబు తప్పు చేసినట్టు నిరూపిస్తే అధికారులకు బహుమతులు ఇస్తానని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొ లినాళ్లలో ఆశపెట్టాడు.

టీడీపీప్రభుత్వంలో విడుదలైన జీవోలు..ఫైళ్లు అన్నీ అధికారులతో, రిటైర్డ్ అధికారులతో కూలంకషంగా వెతికించాడు. నాలుగున్నరేళ్లు అయినా చివరకు ఎక్కడా చంద్రబాబు తప్పు చేసినట్టు నిరూపించగలిగే ఒక్కఆధారం కూడా ఈ పిచ్చిముఖ్యమంత్రికి పిచ్చి ప్రభుత్వానికి దొరకలేదు. చివరకు ఎలాగైనా చంద్రబాబుని జైలుకు పంపాలనే దురుద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడానికి ఈ ముఖ్య మంత్రి సిద్ధమయ్యాడు.

నిజమైన కేసులంటే జగన్ పై సీబీఐ.. ఈడీ పెట్టిన కేసులు. ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ అంటే జగన్ ప్రజల నుంచి కొట్టేసిన రూ.43వేలకోట్లను ఈడీ జప్తు చేయడం
దేశవ్యాప్తంగా ఏపీ గొప్పగా అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో తప్పు జరిగిందని. చంద్రబాబు వేలకోట్ల అవినీతి చేశాడని తప్పుడుకేసు పెట్టిన జగన్ రెడ్డి.. చంద్రబాబుని అన్యాయంగా 52 రోజుల పాలు జైల్లో నిర్బంధించాడు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేసన్లో భాగంగా రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసిన టీడీపీప్రభుత్వం వాటిలో వివిధ దేశాలకు చెందిన అధునాతన పరికరాలు.. సాఫ్ట్ వేర్ ను ఏర్పాటుచేసి, దాదాపు 2.14లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించింది.

వారిలో దాదాపు 70వేలమందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అలాంటి గొప్ప ప్రాజెక్ట్ లో చంద్రబాబు తప్పు చేశాడని ఆయన్ని ఈసైకో ముఖ్యమంత్రి అన్యా యంగా జైలుకు పంపాడు. ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ కింద చంద్రబాబుని 52రోజులు జైల్లో పెట్టిన జగన్ రెడ్డి.. 50 పైసల అవినీతిని కూడా నిరూపించలేకపోయాడు. న్యాయస్థానా ల ముందు ఆధారాలు ఉంచలేక చతికిలబడ్డాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు సంబంధించి గతంలో ఈడీ, సీబీఐలు దాదాపు 19కేసులు నమోదు చేసి, రూ.43వేల కోట్లు జగన్ ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది. అదీ ప్రివెంటివ్ ఆప్ కరప్షన్ అంటే.

 నిజంగా చంద్రబాబు తప్పుచేశాడనే ఆధారాలు జగన్ వద్ద ఉంటే, నాలుగేళ్లపాటు టీడీపీని వదిలేసేవాడా?
ఈ పిచ్చి ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎక్కడ అవినీతి జరిగిందని చంద్రబాబును జైలుకు పంపాడో సమాధానం చెప్పాలి. టీడీపీ-జనసేన కూటమి.. వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతోందని తెలిశాకే పిచ్చోడు ముందు జాగ్రత్తగా భవిష్యత్ లో తనపై పడే కేసులున్నింటినీ ఇప్పుడు వరుసగా చంద్రబాబుపై పెడుతున్నాడు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు.. ఫైబర్ నెట్ కేసు.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. మద్యం కేసు.. ఇప్పుడు కొత్తగా ఇసుక కేసు. ఇవీ ఈ పిచ్చివాడు చంద్రబాబుపై పెట్టిన పిచ్చి కేసులు.

కక్షసాధింపులే ధ్యేయంగా బతుకుతున్న జగన్ రెడ్డి..నిజంగా చంద్ర బాబు తప్పుచేసుంటే నాలుగేళ్లపాటు ఆయనపై చర్యలు తీసుకోకుండా ఊరుకునేవాడా ? ప్రజలు…ప్రజాసంఘాలు..మేథావులు.. రాజకీయ ప్రముఖులు అందరూ ఈ పిచ్చి ముఖ్యమంత్రి చేస్తున్న పిచ్చిపనులపై ఆలోచన చేయాలి.

తన దోపిడీకోసం.. తాను సాగిస్తున్న ఇసుక, మద్యం, భూ దోపిడీలపై సీబీఐ విచారణ కోరే దమ్ము ధైర్యం జగన్ కు ఉన్నాయా?
స్కిల్ డెవల్ మెంట్ కేసులో అవినీతి ఎక్కడుందో.. వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి ఎక్కడ జరిగిందో.. ఉచిత ఇసుక విధానంలో రూ.1000 కోట్ల అవినీతి ఎలా జరిగిందో ఈ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పాలి. ఇసుకను ప్రజలకు ఉచితంగా అందివ్వడమే పిచ్చి జగన్ దృష్టిలో చంద్రబాబు చేసిన తప్పు. టీడీపీ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచడమే చంద్రబాబు చేసిన నేరం. మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడని ఆరోపిస్తున్న పిచ్చి ముఖ్యమం త్రికి.. పిచ్చి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యం .. వైసీపీనేతల మద్యం వ్యాపారం కనిపించడంలేదా?

జగన్ రెడ్డి తన ధనదాహంతో కల్తీ మద్యం అమ్ముకోవడానికే గతప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీని తీసేసి… తనకు నచ్చిన పాలసీని అమలు చేశాడు. జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తూ కేవలం మద్యం ద్వారానే నాలుగేళ్లలో రూ.24వేలకోట్లు కొట్టేశాడు. నిజంగా వైసీపీప్రభుత్వం నిఖార్సైన మద్యం పాలసీ అమలుచేస్తే.. ఎక్కడా ఎలాంటి అవినీతి జరక్కపోతే.. తక్షణమే జగన్ రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలి. అలానే ఇసుక దోపిడీపై.. ఇతర ఖనిజ సంపద దోపిడీ…భూ దోపిడీపై కూడా జగన్ కేంద్ర ప్ర భుత్వంతో సంప్రదించి సీబీఐ విచారణ కోరాలి.

తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ప్రతినిర్ణయం.. ఇచ్చిన ప్రతి జీవో అంతా పారదర్శకమే. చంద్రబాబు అవినీతి చేశాడ నడం పెద్ద జోక్. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇంకా 10కేసులు పెడతామంటున్నాడు. జగన్ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. మా వెంట్రుక కూడా పీకలేడని సవాల్ చేస్తున్నాం. పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి చేష్టల్ని ఖాతరు చేయం.

పిచ్చిముఖ్యమంత్రి పిచ్చిపాలనపై గవర్నర్ దృష్టి సారించి.. జగన్ మానసిక స్థితిపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలి
జగన్ పిచ్చిచేష్టలు… పిచ్చిపాలనపై గవర్నర్ కూడా దృష్టిపెట్టాలని కోరుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను రాజ్యాంగబద్ధ ప్రతినిధి అయిన గవర్నర్ నిశితంగా గమనించాలి. జగన్ మానసికస్థితిపై గవర్నర్ తక్షణమే కేంద్రానికి నివేదిక అందించి రాష్ట్రాన్ని కాపాడాలి.” అని బొండా విజ్ఞప్తి చేశారు.

అధికారం కోల్పోతే జగన్ జైలుకే : నక్కా ఆనంద్ బాబు 
చంద్రబాబుపై రోజుకో కేసు పెట్టాలని ఈ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు. ఏ అధికారం లేనప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు దోచేసిన జగన్.. రూ.43వేల కోట్లు కొట్టేశాడని సీబీఐ, ఈడీలు తేల్చాయి. తనపై ఉన్న అవినీతి కేసుల్లోనే జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చి పదేళ్లు దాటినా జగన్ అవినీతి కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదు. విచారణకు సహక రించకుండా ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని న్యాయస్థానాలకు గైర్హాజరవుతూ.. కంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు.

చంద్రబాబుపై వరుసగా పెడుతున్న తప్పుడు కేసులు జగన్ రాజకీయ కక్షసాధింపులకు నిదర్శనం
జగన్ అధికారం కోల్పోయిన మరుక్షణం జైలుకు వెళ్లడం ఖాయం. తండ్రి అధికారంతో కొట్టేసిన లక్షకోట్లకు తోడు.. ఈ నాలుగేళ్లలో తన అధికారంతో రూ.2లక్షలకోట్లు కాజేశాడు. జగన్ దోపిడీ.. అవినీతిని ప్రశ్నిస్తూ… ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాడన్న అక్క సుతోనే అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపిన జగన్ రెడ్డి..టీడీపీ అధినేత జైల్లో ఉండగా నే ఆయనపై ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. ఫైబర్ నెట్ కేసులు పెట్టింది.

చంద్రబాబు బెయిల్ పై బయటకు వస్తున్నాడని తెలిసి ఆగమేఘాలపై ఆయనపై మద్యం కేసుపెట్టించారు. నిన్నటికి నిన్న ఈ సైకో ముఖ్యమంత్రి .. చంద్రబాబుపై ఇసుక కేసు పెట్టించాడు. ఇవన్నీ గమనిస్తే.. జగన్ కక్షసాధింపులు ఏస్థాయికి చేరాయో ప్రజలు అర్థం చేసుకోవాలి.

ఇసుకాసురుడు జగన్ రెడ్డి ఇసుక దోపిడిని.. రూ.40వేలకోట్లుకొట్టేసిన వైనాన్ని చంద్రబాబునాయుడు ఆధారాలతో సహా ప్రజలముందు పెట్టారన్న అక్కసుతోనే ఆయనపై ఇసుక కేసు పెట్టారు
ఇసుకాసురుడు జగన్ రెడ్డి ఇసుక దోపిడిని.. నాలుగేళ్లలో రూ.40వేలకోట్లుకొట్టేసిన వైనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలోనే పార్టీ జాతీయ కార్యాల యంలో మీడియా సాక్షిగా ఆధారాలతోసహా ప్రజలకు వివరించారు. అది మొదలు జగన్ రెడ్డి.. తనలోని రాక్షసుడిని నిద్రలేపి చంద్రబాబు..తెలుగుదేశం పార్టీలే లక్ష్యంగా విషం చిమ్మడం ప్రారంభించాడు. తన చేతిలోని వ్యవస్థలను ఉపయోగించి రోజుకోకొత్త కేసును చంద్రబాబుపై పెట్టిస్తున్నాడు. జగన్ ఇసుకాసురుడు అనడానికి టీడీపీ వద్ద అధారాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 67 నియోజకవర్గాల్లోని 167 ఇసుకరీచ్ లను పరిశీలించిన టీడీపీ బృందం.. స్థానికంగా ఎక్కడికక్కడ జరిగే ఇసుకదోపిడీని గుర్తించి స్థానిక అధికారులకు ఫిర్యాదులు అందించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సత్యాగ్రహాలు చేశాం. నేరుగా ఏపీ.ఎం.డీ.సీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆనాడు తమకు కనిపించకుండా దాక్కున్న ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి…తరువాతి రోజున మంత్రి పెద్దిరెడ్డితోకలిసి మీడియా ముందుకొచ్చి టీడీపీప్రభుత్వంలోనే ఇసుక రీచ్ లలో అక్రమాలు జరిగాయని ఏదేదో మాట్లాడాడు. ఎలాంటి పాలసీ లేకుండా రాష్ట్రంలో జరు తున్న ఇసుక తవ్వకాలు..అమ్మకాలపై ఏపీ ఎండీసీ ఎండీ వెంకటరెడ్డిగానీ.. మంత్రి పెద్దిరెడ్డిగానీ సమాధానం చెప్పరు. ఇసుకదోపిడీతో రూ.40వేలకోట్లు కొట్టేసిన జగన్ దోపిడీపై నోరెత్తరు.

జగన్ రెడ్డి ఇసుక కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా వెంకటరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం
చంద్రబాబు ఎన్నికలవరకు జైల్లోనే ఉంటాడంటున్న ఈ మంత్రులు..ప్రభుత్వాన్ని ఏమనాలి? చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతూ.. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రే తమకు కొత్త దారి చూపాయి. భవిష్యత్ లో టీడీపీ అధికారంలోకి రాగానే నేడు తప్పుడు కేసులు పెట్టేవారంతా మూల్యం చెల్లించుకుంటారు. జగన్ రెడ్డి ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి ప్రధానముద్దాయిగా జైలుకెళ్లడం ఖాయం. కుట్రలు, కుతం త్రాలతో చంద్రబాబుని జైల్లో పెట్టి ఆనందించాలనుకునే వారిని ప్రజలు పిచ్చికుక్కల్ని తరిమినట్టు తరమడం ఖాయం” అని ఆనంద్ బాబు హెచ్చరించారు.

నాలుగేళ్లలో టీడీపీనేతలపై.. ఇటీవల చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించి ఏ ఒక్క కేసులో అయినా ఈ ప్రభుత్వం ఛార్జ్ షీట్ వేసిందా? : వర్ల రామయ్య
వైసీపీ ప్రభుత్వానికి పిచ్చెక్కితే, కొందరు ప్రభుత్వాధికారులకు మతి భ్రమించింది. సీఐడీ పూర్తిగా జగన్ ప్రభుత్వానికి దాసోహం చేస్తూ గతితప్పి వ్యవహరిస్తోంది. చంద్రబాబుపై.. గతంలో మంత్రులుగా పనిచేసిన టీడీపీనేతలపై పెడుతున్న తప్పుడు కేసులు చూస్తే ఈ ప్రభుత్వం తెలుగుదేశంపై రాజకీయకుట్రలకు పాల్పడుతోందనే అనుమానం కలుగుతోంది.

ఎన్నికల నాటికి టీడీపీని.. ఆపార్టీ నేతల్ని చిన్నాభిన్నం చేయాలన్న జగన్ రాజకీయ కుట్రలో భాగమే ప్రభుత్వం సాగిస్తున్న తప్పుడు కేసుల పరంపర. దొంగ కేసో…తప్పుడు కేసో పెట్టి టీడీపీనేతల్ని..చంద్రబాబుని రిమాండ్ కు పంపితే ప్రభుత్వం పని అయిపోయినట్టేనా? నాలుగేళ్లలో అన్యాయంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతల్లో ఏ ఒక్కరిపైన అయినా ఛార్జ్ షీట్ వేశారా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు న్నాం.

రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది.. కాబట్టే చార్జ్ షీట్లు వేయడం లేదు
గతంలో అచ్చెన్నాయుడిని అన్యాయంగా 74 రోజులు జైల్లో పెట్టారు. ఆ కేసుని.. దాన్ని దర్యాప్తు చేసిన అధికారుల్నివదిలే ప్రసక్తే లేదు. కొల్లు రవీంద్రను 54 రోజులు రిమాండ్ లో ఉంచారు.. దానిపై ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదో ప్రభుత్వం చెప్పాలి.

దేవినేని ఉమామహేశ్వరరావు.. ధూళిపాళ్ల నరేంద్రలను రిమాండ్ లో ఉంచి అన్యాయంగా జైల్లో పెట్టినవారు.. వారిపై పెట్టిన కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్లు ఎందుకు వేయలేదు? కేవలం కక్ష తీర్చుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేతలపై పెట్టిన.. పెడుతున్న తప్పుడు కేసుల్ని బట్టే అర్థమవుతోంది. రఘురామిరెడ్డి చెప్పడం.. కల్లం అజయ్ రెడ్డి ఓకే అనడం.. సజ్జల సై అనడం.. జగన్ ప్రొసీడ్ అనడం ఇదీ టీడీపీపీనేతలపై, చంద్ర బాబుపై పెడుతున్న తప్పుడు కేసుల్లో సీఐడీ, పోలీస్ శాఖ అనుసరిస్తున్న పద్ధతి.

జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులు విచారణలో ఏళ్లతరబడి జరుగుతున్న జాప్యంపై న్యాయస్థానాలు సమాధానం చెబుతాయా…ప్రధానమంత్రి చెబుతారా?
తప్పులు … అవినీతి..దోపిడీ మీరు చేస్తూ.. తప్పుడు కేసులు టీడీపీపై పెడతారా? జగన్ రూ.43వేలకోట్లు అన్యాక్రాంతం చేశాడని కోర్టులో తేల్చాయి. తన అవినీతి కేసుల్లో ఇంతవరకు ట్రయల్ ఎందుకు జరగడంలేదో మఖ్యమంత్రి చెప్పాలి. పదేళ్లక్రితం చార్జ్ షీట్లు నమోదైతే ఇంతవరకు జగన్ కేసుల విచారణ జరగకపోవడంపై న్యాయ స్థానాలు ప్రజలకు ఏం సమాధానం చెబుతాయి? ముఖ్యమంత్రి అయితే కేసుల విచారణకు హాజరు కారా? ప్రధానమంత్రులే న్యాయస్థానాల ముందు హాజరైతే… ముఖ్యమంత్రి లెక్కా? కోడికత్తి కేసులో తప్పు చేయకుండానే దళితయువకుడు 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతుంటే కనిపించడం లేదా?

అలాంటి దిక్కులేని వాళ్లపైనే ప్రతాపం చూపుతారా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం.. దిక్కులేనివాళ్లకు మరో న్యాయ మా? జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల విచారణ ఎందుకు నత్తనడక కంటే దారుణంగా సాగుతోందనే ప్రశ్నకు న్యాయస్థానాలు సమాధానం చెబుతాయా..కేంద్రప్రభుత్వం సమాధానం చెబుతుందా..లేక ప్రధానమంత్రి సమాధానం చెబుతారా? ప్రజలు కూడా జగన్ రెడ్డి అవినీతి…ప్రవర్తనపై ఎందుకు ఆలోచించరు? తండ్రి ముఖ్యమంత్రి కాక ముందు అతి సామాన్యుడిగా బతికిన జగన్మోహన్ రెడ్డి.. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా నిలిచాడని ప్రజలు ఆలోచించరా?

ప్రజాస్వామ్యంలో ప్రజలు భాగస్తులు కారా.. నాయకులు ఎంత అవినీతి చేసినా చూస్తూ ఊరుకుంటారా? జగన్ రాజకీయ కుట్రలో భాగమే టీడీపీపై..చంద్రబాబునాయుడిపై పెడుతున్న తప్పుడు కేసులు. ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నిపెట్టినా చంద్రబాబుపై ప్రజలకు ఉన్న ఆదరణ.. అభిమానం ఈ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దొంగ కేసులు..తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకునే చీప్ ట్రిక్స్.. చిల్లర రాజకీయాలకు జగన్ తక్షణమే స్వస్తిచెప్పాలి.” అని రామయ్య హితవుపలికారు.

LEAVE A RESPONSE