ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందనటం దిగజారుడుతనం

– నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ఉద్యోగుల ఆమోదం లేదు
– జగన్ చేసిన మోసానికి ఉద్యోగులు రిటర్స్ గిప్ట్ ఇవ్వటం ఖాయం
– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందని ముఖ్యమంత్రి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….ఎర్ర జెండా వెనుక పచ్చ జెండా ఉందని ముఖ్యమంత్రి మాట్లాడటం దిగజారుడుతనం. సమ్మె కావాలని ఎవరూ కోరుకోరని జగన్ వ్యాఖ్యానించటం విచిత్రం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సమ్మెచేయకపోతే ఏం చేస్తారు?

ప్రతిపక్షంలో అనేక హామిలిచ్చి అధికారంలోకి వచ్చాక ఆ మాటలు నిలబెట్టుకోకుండా మోసం చేసి ఉద్యోగ సంఘాల నలుగురు నాయకుల్ని బెదిరించి ఉద్యమాన్ని జగన్ నీరుగార్చారు. నలుగురు ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ఉద్యోగులందరి ఆమోదం లేదు. అందుకే ఆ సంఘాల నుంచి ఉపాద్యాయులంతా బయటకి వచ్చి కొత్త జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరుకు సిద్దమవుతున్నారు. 23 శాతం ఐ ఆర్ కంటే ఎక్కువ ఇవ్వలేమని, అది ముగిసిన అధ్యాయం అని సలహాదారులు బెదిరిస్తారా?

ఉద్యోగుల సమస్యలు పరిస్కరించమంటే కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగోలేదని చెప్పటం ఈ శతాబ్డంలో పచ్చి అబద్దం. కాగ్ రిపోర్ట్ లో డిసెంబర్ 2021 నాటికి రాష్ట్ర ఆదాయం రూ. 97,887 కోట్లు ఉందని అది మార్చి నాటికి రూ. 1 లక్షా 32 వేల కోట్లకు చేరుతుందని అంచానాలున్నాయి. 202-21 కంటే 2021-22 ఆర్దిక సంవత్సరంలో రూ. 15 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ‎అంచనాలున్నాయి.

కానీ ఆర్దిక పరిస్థితి నెపంతో ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చకుండా మోసం చేశారు. జగన్ అవినీతి, చేతకాని పాలన వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. తెలంగాణలో ఐఆర్ 30 శాతం ఇస్తే ఏపీలో 23 శాతమే ఇచ్చారు. అది కూడా బెదిరించి ఇచ్చారు. అశుతోష్ మిశ్రా కమిటి రిపోర్టు బయటపెట్టకుండా సెకండరీ రిపోర్టు వేసి జోవోలిచ్చారంటే అది ఉద్యోగుల నాయకత్వం చేతకానితనం.

2015-16 లో రాష్ట్ర ఆదాయం రూ. 86 వేల కోట్లే అయినప్పటికీ చంద్రబాబు 43 శాతం పిట్ మెంట్ ఇచ్చారు.
కానీ 2021-22 లో 1 లక్షా 32 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఏపీ ఆదాయం పెరిగిందని వైసీపీ ఎంపీ పార్లమెంట్ లో చెప్పారు. కోవిడ్ ఉన్నా రాష్ట్ర ఆదాయం పెరిగింది తప్ప తగ్గలేదు. మరో వైపు విపరీతంగా అప్పులు చేశారు. రాష్ట్ర అప్పు రూ. 6 లక్షల కోట్లకు చేరుకుంది. దీనికి వడ్డీ కట్టడమే భారంగా మారుతుంది. ఈ డబ్బంతా ఏమైంది? ఉద్యోగులకు రూ. 6 వేల కోట్ల ‎డీఎరియర్స్ ఇవ్వలేక రిటైర్మంట్ సమయంలో ఇస్తామంటున్నారు.

సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల పీఎస్, రిటైర్మంట్ ఉద్యోగుల ప్రయెజనాలు రూ. 2100 కోట్లు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారు. ఈ డబ్బంతా ఏమైంది? జగన్ తమను మోసం చేశారని, ‎జగన్ ని గద్దె దించేవరకు పోరాడుతామని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఉద్యమం వెనుక ఎర్ర జెండా ఉన్నా.,పచ్చ జెండా ఉన్నా..వచ్చే ఎన్నికల్లో బులుగు జెండా ఉండదు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని ఆపలేరు.

ఉద్యోగ సంఘాల నాయకులు జగన్ కి భయపడి 8 లక్షల 30 వేల మంది ఉద్యోగుల్ని, 3 లక్సల 40 వేల మంది పెన్సనర్లను మోసం చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై పాశవికంగా దాడి చేయించటం సరికాదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు

ఉద్యోగులకు జగన్ ఏం హామిలిచ్చారో ఉద్యోగులు మర్చిపోరు. 151 సీట్లు ఉన్నాయని అహంకారంతో వ్యవహరించటం సరికాదు. ఆర్దిక భార నెపంతో ఉద్యోగుల డిమాండ్లన్నీ కుదించారు. కానీ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో, ‎కేంద్ర నుంచి వచ్చినదెంతో, నాడు నేడు, రంగుల కోసం దుబారా చేసిదెందో.. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ కుంభకోణం ఎంతో ప్రజలకు తెలుసు.

ఈ అవినీతి లేకపోతే ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇవ్వొచ్చు. ప్రజా ధనాన్ని అవీతిని చేసి ఉద్యోగుల దగ్గరకొచ్చే సరికి ఆర్దిక భారం అంటే ఎలా? రాష్ట్ర ఆదాయంలో ఉద్యోగుల పాత్ర లేదా? కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వైద్య, పోలీసు, రెవిన్యూ ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టారు. ప్రభుత్వానికి సహకరిస్తున్న ఉద్యోగుల్ని మోసం చేస్తారా?

ఉద్యోగ సంఘాల నేతల్లో జగన్ తన కోవర్టులను పెట్టి ఉద్యోగులకు చేసిన మోసాన్ని ఉద్యోగులు చూస్తూ ఊరుకోరు. ప్రభుత్వంపై తిరగబడతారు. ఉద్యోగులకు జగన్ చేసిన మోసానికి వచ్చే ఎన్నికల్లో రిటర్న్ గిప్ట్ ఇవ్వటం ఖాయం. ఉద్యోగ సంఘాలు స్వార్దం లేకుండా ఉద్యోగుల ప్రయోజానాలు కాపాడేలా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని, ఉద్యోగుల న్యాయబద్ద డిమాండ్లకు టీడీపీ మద్దతు ఉంటుందని అశోక్ బాబు స్పష్టం చేశారు.

Leave a Reply