నారా భువనేశ్వరికి ఘన స్వాగతం

కడప : కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లె గ్రామపంచాయతీ కమ్మ పాలెం వీరాంజనేయ స్వామి గుడి వద్ద నిజం గెలవాలి కార్యక్రమానికి రోడ్డు మార్గాన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కి తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ యువనేత దారపునేని రాజా నాయుడు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆ ప్రాంత మహిళలు శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం సమర్పించారు.

రాజంపేట నియోజకవర్గ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో నందలూరు ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల్లో నారా భువనేశ్వర్ కి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు. యువనేత రాజనాయుడు మాట్లాడుతూ, రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ముఖ్యంగా యువత, మహిళలు ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు చలమయ్య యాదవ్ ఒంటిమిట్ట మాజీ ఎంపీపీ ప్రతినిధి లక్ష్మీనారాయణ రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి నాగ మునిరెడ్డి బజాజ్ షోరూం అధినేత అయ్యప్ప నాయుడు తెలుగు యువత కార్యదర్శి నాగభూషణం బీసీ సెల్ కార్యదర్శి రాజశేఖర్ యాదవ్ సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply