బాబు వస్తేనే ప్రగతి

-లేకపోతే ఆంధ్రకు అధోగతే
-జనం యోగక్షేమాలు కోరేవాడే నిజమైన నేత
– నారా భువనేశ్వరి

రైల్వే కోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముక్క వారి పల్లె గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం విచ్చేశారు. ఆమెకు రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కారూపానంద రెడ్డి ఆయన సతీమణి వరలక్ష్మి మరియు వేలాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, గతంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ఒక రాష్ట్రం బాగుపడాలంటే నాయకుడు అనేవాడు అతని గురించి ఆలోచించడు. రాష్ట్రం గురించి ఆలోచించాలి ప్రజల గురించి ఆలోచించాలి. కార్యకర్తల గురించి ఆలోచించాలి. రాష్ట్ర యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకు వెళ్లాలని, అలాంటి నాయకుడు చంద్రబాబునాయుడు అంటూ కొనియాడారు.

ముఖ్యంగా మహిళల కు నారా చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేశాడని, ప్రతి కుటుంబం ఎదగాలంటే ఒక స్త్రీ అవసరంను స్త్రీ ఆనందంగా క్షేమంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుందని చంద్రబాబు నాయుడు కోరుకునే , వారిని ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 చొప్పున వారి అకౌంట్లో వేస్తారని ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారని యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని, అలాగే ప్రతి నిరుద్యోగిన యువకులకు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తారని పరిశ్రమల ద్వారా యువకులకు నిరుద్యోగం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.

ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, అది మీకు తెలుసని.. రాష్ట్రం అభివృద్ధి లేకుండా అట్టడుగు లోకానికి తీసుకెళ్లారని, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నదని ప్రస్తుత ప్రభుత్వాలు పరిపాలనను దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలంటే ఎవరు అవసరమంటూ కార్యకర్తలను ప్రశ్నించగా.. కార్యకర్తలందరూ నారా చంద్రబాబు నాయుడు అని సమాధానం ఇచ్చారు. దానికి ఆమె కాదు కాదు లక్షలాదిమంది పసుపు సైనికులు.. అంటే మీరే అంటూ బదులిచ్చారు. దానికి అభిమానులలో పెద్ద ఎత్తున కేకలు, కేరింతలు చప్పట్లు వినపడ్డాయి.

ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు మాజీ టిడిపి ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, రైల్వేకోడూరు నియోజకవర్గంలోని టిడిపి జనసేన బిజెపి అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply