– తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్‌కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్‌తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావటంతో పాటుగా.. మరిన్న రైల్వే వర్క్ షాపులు రానున్నాయి. మాణిఖ్ ఘర్, కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.