మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ అరుదైన ఘనత సాధించారు. ఒడిశాలో 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి ‘లార్జెస్ట్ సింగింగ్ లెసన్’ పేరిట జాతీయ గీతం జనగణమన
గానంతో గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు. ఈ రికార్డింగును ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. వేణు గాన విద్వాంసులు హరి ప్రసాద్ చౌరాసియా, రాకేశ్, వీణ మాస్ట్రో జయంతి తదితరులు ఇందులో భాగమయ్యారు.