ఎన్ని చెప్పు..
లయంటే ప్రేమించు సినిమాలోని అద్భుతమే..
స్వయంవరం సినిమాలో
చుక్కలా మెరిసినా..
మనోహరంలో
సుమనోహరంగా మెప్పించినా
లయంటే ఆ గుడ్డమ్మాయే..
అంతెందుకు…
దేవుళ్ళు సినిమాలో
సాక్షాత్తు సీతాదేవి వేషం కట్టి
శ్రీకాంతుని పక్కన
సిగ్గుల మొగ్గలు పూయించినా..
దొంగరాముడు
అండ్ పార్టీలో
వసంతలక్ష్మిగా
అల్లరి చేసినా..
మిస్సమ్మలో
రత్నమాలగా
కిలకిలమన్నా..
ప్రతి సినిమాలో
ఎంత బావుందో..
అనిపించుకున్నా..
నేను పెళ్లికి రెడీ..
అంటూ మనువాడి
అమెరికా చెక్కేసినా..
ఇప్పుడు అక్కడ
పెద్ద కొలువే చేస్తున్నా..
అంతకు ముందు
చదరంగంలో
ఛాంపియనే అయినా..
ప్రేమించులో మీనా
అభినయ హసీనా..
ఆ పాత్ర..
వయసుకు మించిన పరిణితి..
కంటేనే అమ్మ అని
అంటే ఎలా…
ఆ నటన..
అంతటి లక్ష్మికే ప్రతిఘటన..
లయ నటనకు ఫిదా..
తెలుగు ప్రేక్షకలోకం..
బహుదా..సదా..!
Not a dream girl..
But a cream girl..
Happy birthday layaji
– సురేష్
9948546286