అమరావతి : ఏపీ సీపీఐ సారథి ఎవరన్న ఉత్కంఠకు ఆ పార్టీ నాయకత్వం ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెరదించింది. రామకృష్ణ వారసుడిగా దశాబ్దాల పాటు విద్యార్థి సంఘంలో కీలకపాత్ర పోషించిన సీమ నేత జి.ఈశ్వరయ్యను సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకుంది.
కడప జిల్లాకి చెందిన ఈశ్వరయ్య విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, రైతు సంఘం వంటి సంస్థల్లో కీలక పాత్రలు పోషించారు. విజయవాడలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఆధ్వర్యంలో జరిగిన,
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.