Suryaa.co.in

Telangana

సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు

– మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో క్యాడర్ మార్పు, వేతనాల పెంపు
– గత 10 ఏండ్లు గా పెండింగ్ లో ఉన్న సమస్యలను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిష్కరించడంతో కృతజ్ఞతలు తెలిపిన ఆరోగ్య మిత్రలు
– ఆరోగ్య మిత్ర లు సమ్మె విరమిస్తూ యధావిధిగా విధులలో హాజరవుతున్నట్లు లేఖ విడుదల చేసిన సంఘం నాయకులు

హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు గత 2 రోజులుగా ( సెప్టెంబర్- 18 రోజు నుండి) సమ్మె చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, ఆరోగ్య మిత్ర ల స్టేట్ కమిటీ నాయకులతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో సుదీర్ఘ చర్చలు జరిపారు.

గత 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్య మిత్రల ప్రధాన డిమాండైనా క్యాడర్ మార్పు, వేతనం పెంపుదల పై ప్రత్యేక చొరవతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించి క్యాడర్ మార్పు (డేటా ఎంట్రీ ఆపరేటర్) ను అంగీకరిస్తూ వేతనాన్ని 15,600 నుండి 19,500 కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఏరియర్స్ చెల్లించటానికి, సమ్మె కాలం లో OD క్రింద వేతనాలు చెల్లించాలని ట్రస్ట్ సీఈవో కు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోగ్య మిత్ర సమ్మె విరమిస్తున్నట్లుగా మంత్రికి తెలియజేశారు. అధికారికంగా వారి యూనియన్ తరపున సమ్మె విరమణ పై లేఖ ను విడుదల చేశారు.

LEAVE A RESPONSE