Suryaa.co.in

Andhra Pradesh

ప్రగతిశీల నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

– జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి

మంగళగిరి : ఆధునిక ఆలోచనలతో ముందుకు సాగుతూ యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్న రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నాలెడ్జ్ సెంటర్ విభాగం ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ.. జీవితంలో సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. ఆయన విశిష్టమైన నాయకత్వ లక్షణాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తూ, తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.

రాష్ట్రాన్ని సాంకేతికత కేంద్రంగా మార్చేందుకు డిజిటల్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యువతను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దే పలు కార్యక్రమాలను ప్రారంభించి, వారికి ఆదర్శంగా నిలిచారు. నాయకుడు అంటే మార్గాన్ని చూపేవాడు కాదు, ఆ మార్గంలో మనలను నడిపించేవాడని లోకేష్ ఆ విధమైన నేతృత్వానికి నిలువుటద్దమని కొనియాడారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు.

రహదారులు, పరిశుభ్రత,ఇతర మౌలిక అవసరాలను మెరుగుపరిచారని అన్నారు. నారా లోకేష్ జన్మదిన సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని గురజాల మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఈ జన్మదిన సందర్భంగా లోకేష్ మరిన్ని విజయాలు, ప్రజల హృదయాల్లో మరింత స్థానం పొందాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A RESPONSE