– పంట పొలాల్లో నీటిపై యుద్ధ ప్రణాళిక
– శాటిలైట్ చిత్రాల ఆధారంగా 24 గంటల్లో నీటి మళ్లింపు
– ఆస్తి నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
– తుఫాన్ విధుల్లో ప్రతిభ చూపిన 100 మందికి సన్మానం
– టెలికాన్ఫరెన్స్‌లో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
బహుశా దేశంలో మొదటి సారి అనుకుంటూ.. పొలంలో నీటి మీద, పని చేసిన వారికి సన్మానాలు!
మొంథా తుఫాన్‌తో నీట మునిగిన పంట పొలాలను యుద్ధ ప్రాతిపదికన కాపాడాలని ఆదేశించారు. శాటిలైట్ చిత్రాలతో మునిగిన ప్రాంతాలను గుర్తించి శనివారం కల్లా నీటి మళ్లింపు పూర్తి చేయాలి అని స్పష్టం చేశారు.
నియోజకవర్గం వారీగా శాటిలైట్ మ్యాపులు విడుదల చేసి, ఎక్కడ నీరు నిలిచిందో అక్కడికి ఎమ్మెల్యేలు, అధికారులు వెళ్లాలి. డ్రైనేజీ మెరుగుపరచాలి. శాస్త్రవేత్తల సూచనలతో దిగుబడి తగ్గకుండా చర్యలు తీసుకోవాలి. 60% నీటి నిల్వలు బాపట్ల జిల్లాలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. “ఆదివారానికి బాపట్లలో నీటి నిల్వలు లేకుండా చేయాలి” అని సీఎం డెడ్‌లైన్ పెట్టారు.
కేంద్రాన్ని తక్షణ సాయం కోరండి
“నష్టాన్ని లెక్కపెట్టండి. కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపండి. కేంద్ర బృందాన్ని ఆహ్వానించండి. తుది నివేదిక వచ్చేలోగా తక్షణ సాయం కోరండి” — ఇదీ చంద్రబాబు ఆదేశం. ప్రధాని మోదీతో నేను కూడా మాట్లాడతానని ఆయన తెలిపారు.
కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గిందని అధికారులు వివరించారు. తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన 100 మందిని శనివారం ఉదయం 10 గంటలకు సన్మానించండి అని సీఎం ఆదేశించారు.