Suryaa.co.in

Andhra Pradesh

నోటికొచ్చినట్లు వార్తలు రాస్తే సహించేది లేదు డాఫర్ నా కొడకా..

సాక్షి దినపత్రిక వెంట సుంఠలున్నారు
నేను రాజకీయ దళారీ నైతే, మొదటి లిస్టులోనే నా పేరు ఉండి ఉండేది కదా?
ఇది ప్రజాస్వామ్యమా? రెడ్డి స్వామ్యమా?
హవ్వ… ఈనాడు దినపత్రికకు బెదిరింపు లేఖనా?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి రూపొందించిన అధికారుల జాబితా గురించి ప్రశ్నించిన ఈనాడు
అసలు అధికారుల జాబితా రూపొందించాల్సిన అవసరం మీకేంటి?
సీనియర్ అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి నివేదిస్తే, వారే ఎవర్ని ఎక్కడ నియమించాలో అక్కడ నియమిస్తారు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఈనాడు దినపత్రికకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బెదిరింపు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా నాయకుడు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. మీకు బాధ్యత లేదా? ఎన్నికల సంఘం అంటే గౌరవం లేదా? అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసునా? అని ఈనాడు దినపత్రికకు రాసిన బెదిరింపు లేఖలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారన్నారు.

తాము తయారు చేసిన అధికారుల జాబితా నచ్చకపోతే, మళ్లీ మరొక జాబితాను రూపొందించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తే, రూపొందించి పంపుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారన్నారు . అసలు అధికారుల జాబితాను రూపొందించి పంపాల్సిన అవసరం మీకేంటండని? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ఎన్నికల సంఘానికి సీనియర్ అధికారుల జాబితాను అందజేస్తే సరిపోతుంది కదా అంటూ నిలదీశారు. ఎన్నికల సంఘం అధికారులే సొంతంగా ఒక సర్వేను చేయించుకొని ఎవర్ని ఎక్కడ నియమించాలో, అక్కడ నియమిస్తారన్నారు. ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కడప జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి , డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి లు ఎన్నికల సంఘానికి అధికారుల జాబితాను ఒకటి రూపొందించి ఇచ్చారన్నారు. అందులో ఇప్పటి వరకు పోస్టింగ్ లేని ఓ ఐపీఎస్ అధికారిని జాబితాలో చేర్చి, అదే స్థానం కోసం ఎస్సై, సీఐ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా పదోన్నతి పొందిన మరో ఇద్దరు అధికారుల పేర్లను పొందుపరిచారని తెలిపారు.

సీనియారిటీ ప్రకారం తాము ముందే నిర్ణయించుకున్న ఐపీఎస్ అధికారి పేరు ఎంపిక అయ్యేవిధంగా జాగ్రత్తపడ్డారని తెలిపారు . అయితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపి లు కలిసి రూపొందించిన ఐ పీ ఎస్ అధికారుల జాబితాలోని లోపాలను ఎత్తిచూపుతూ, తెలుగువారి అభిమాన పత్రిక ఈనాడు దినపత్రిక అద్భుతమైన ఆర్టికల్ ప్రచురించిందన్నారు .
దీన్ని ప్రజాస్వామ్యమని అంటారా?, రెడ్డి స్వామ్యమని అంటారా?

ఒక దినపత్రికకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి బెదిరింపు లేఖ రాయడాన్ని ప్రజాస్వామ్యమని అంటారా? లేకపోతే రెడ్డి స్వామ్యమని అంటారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. హైదరాబాదులో 70 శాతం మంది నా మిత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. రెడ్లు, నిజమైన రెడ్లు అంటే నాకెంతో గౌరవం. నేను మాట్లాడేది కొద్ది మంది అధికారుల గురించి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడని, సోషల్ మీడియాలో చెత్తంతా రాసే నీచుల గురించని వివరించారు. నన్ను పచ్చి బూతులు తిట్టిన వారిని మాత్రమే నేను విమర్శిస్తున్నానని తెలిపారు. నేను ఎంతో గౌరవించే కులం రెడ్డి సామాజిక వర్గమని, కొంతమంది రెడ్డి కానీ వారు కూడా తమకు తాము రెడ్లుగా చెప్పుకుంటూ చలామణి అవుతున్నారన్నారు. అటువంటి వారిని నేను గౌరవించను.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసింది ముమ్మాటికి తప్పే… అందులో ఎటువంటి సందేహం లేదు. నిజాన్ని నిర్భయంగా రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల వెంట జనం ఉన్నారన్న ఆయన, సాక్షి దినపత్రిక వెంట సుంఠలు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార గెజిట్ గా ముద్రపడిన సాక్షి వెంట సుంఠలే ఉన్నారని పునరుద్ఘాటించారు. విజ్ఞులైన ప్రజలు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల వెంట ఉన్నారన్న ఆయన, ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోవాలని సవాల్ చేశారు.

కార్యవర్గ సభ్యుడికి లేఖ రాసే అధికారం ఎక్కడిది?

ఐపీఎస్ అధికారుల సంఘం అధ్యక్షులుగా నిజాయితీపరుడైన అధికారి ద్వారకా తిరుమల రావు, కార్యదర్శిగా మంచి అధికారి ఆర్కే మీనా లు ఉన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అటువంటి అధికారులు ఉండగా, కార్యవర్గ సభ్యుడనని పేర్కొంటూ క్రాంతి రానా తాత ఎన్నికల సంఘానికి లేఖ రాయడం వల్ల ప్రయోజనం శూన్యమని అన్నారు. ఆ లేఖను మడత పెట్టుకొని, పక్కన పడేయాల్సిందేనన్నారు. అవినీతిపరులంటే డబ్బు కోసం అర్రులు చాచే వారే కాదని, పైనున్న రాజకీయ నాయకుల ప్రాపకం కోసం, కొంతమంది అధికారులు అంట కాగుతుంటారని, అటువంటి వారు కూడా అవినీతిపరులైన అధికారుల కిందే లెక్కే నని విమర్శించారు.

ఐపీఎస్ అధికారుల సంఘం తరఫున కార్యవర్గ సభ్యుడైన క్రాంతి రానా తాత ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయగా, దానిపై రవీంద్రబాబు అనే మరో ఐపీఎస్ అధికారి సంతకం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. రవీంద్ర బాబు గురించి ఎవరికీ తెలియదని ప్రశ్నించిన ఆయన, ఎమ్మెల్సీ అనంత బాబు తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని పార్సెల్ చేస్తే, తాత్సారాన్ని చేసిన మహా ఘనుడు ఇదే రవీంద్రబాబని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి ని ఏమి అనకూడదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఐపీఎస్ అధికారులు జాషువా, అన్బురాజన్, ఏమి చేశారో తెలియదా అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, మిగిలిన ఐపీఎస్ అధికారుల అధికార దుర్వినియోగం గురించి కూడా ప్రస్తావించారు. కర్నూలులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ అధికారులు వచ్చినప్పుడు, ఆయన్ని అరెస్టు చేయకుండా, వారికి సహాయ నిరాకరణ చేసిన అధికారులు ఎవరో తెలియదా అంటూ నిలదీశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించడం రాష్ట్ర పోలీసు అధికారులకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు.

ఎవరు ప్రశ్నించిన, ప్రశ్నించకపోయినా ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఈనాడు, ఆంధ్ర జ్యోతి దినపత్రికలు ఉన్నాయని, వారితో పాటు నేను ఉన్నానని గుర్తు చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలంటూ హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఇటీవల ఆరుగురు ఐపీఎస్ అధికారులను, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల సంఘానికి ఎవరో ఫిర్యాదు చేస్తే, గుడ్డిగా విధుల్లో నుంచి తప్పించదని అన్నారు. ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా నివేదికలను తెప్పించుకొని, వారి ట్రాక్ రికార్డు పరిశీలించిన తర్వాతే విధుల్లో నుంచి తప్పిస్తుందన్నారు.

పోలీసు అధికారుల అరాచకాలు ఎన్నెన్నో…

రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఐపీఎస్ అధికారిగా కొనసాగుతున్నామని ఎవరిని పడితే వారిని బాద వచ్చుననే భ్రమలో పోలీసు అధికారులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు చేసిన అరాచకాల గురించి ప్రస్తావిస్తూ, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన్ని రక్తస్రావం జరుగుతున్న ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేయించారన్నారు. అప్పుడు ఎక్కడకు పోయింది పోలీసు దాతృత్వం అని ప్రశ్నించారు.

మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను చేతులు వెనక్కి విరిచి కట్టి, నడిరోడ్డు మీద చితక బాదారని గుర్తు చేశారు. డాక్టర్ సుధాకర్ ను హింసించిన ఏ ఒక్కరిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అసలు పోలీసులకు ఇతరుల వంటిపై చేయి చేసుకునే హక్కే లేదని, ఎవరైనా అలా హక్కు ఉందని అంటే వారిని వెంటనే విధుల్లో నుంచి డిస్మిస్ చేయిస్తానన్నారు. హెల్మెట్ లేదని ఒకరిని, తోటవల్లూరులో మరొకరిని హింసించారన్నారు.

తెదేపా నాయకులు దేవినేని ఉమా తో పాటు, కొల్లు రవీంద్రను కూడా వేధించారని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎంపీ నైన నాపై రాజా ద్రోహం కేసు పెడతారా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చులతో చర్చిలను నిర్మించడం కరెక్ట్ కాదని చెప్పాను. అలాగే, దేవాలయాలను నిర్మించడం కూడా సరికాదని పేర్కొన్నానని గుర్తు చేశారు. ప్రభుత్వం వేరు, మతం వేరని చెబితే, రెండు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నానని నాపై రాజ ద్రోహం కేసు పెడతారా? అంటూ రఘు రామ కృష్ణంరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసులు పెడితే కోర్టుకు అప్ప చెప్పాలి కానీ, లాకప్ లో జైల్లో చంపాలని చూస్తారా అంటూ మండిపడ్డారు.

కొందరు పెద్దలు, చంద్రబాబు నాయుడు కృషి వల్ల, దేవుడి దయతో నేను బ్రతికి బయటపడ్డానన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా మొన్న సభలో ప్రస్తావించారని గుర్తు చేశారు. ఐపీఎస్ అధికారుల సంఘం తరఫున కార్యవర్గ సభ్యుడి హోదాలో క్రాంతి రానా తాత , ఎన్నికల సంఘానికి లేఖ రాసే అర్హత లేదన్నారు. ఏ అర్హతతో ఆయన లేఖ రాశారో అర్థం కావడం లేదని చెప్పారు. క్రాంతి రానా తాతా రాసిన లేఖపై 15 నుంచి 16 అధికారులు సంతకాలు పెట్టినట్లుగా తెలిసిందన్న ఆయన, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాకపోతాడా అన్న ఆశతో పెట్టి ఉంటారన్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే మనల్ని పక్కన పెట్టడం ఖాయమని, హెల్ప్ చేసినట్టుగా ఒక ఛాన్స్ తీసుకుందామని సంతకాలు పెట్టి ఉంటారన్నారు. ఐపీఎస్ అధికారుల మనోధైర్యం దెబ్బతినడం ఏమిటో అర్థం కావడం లేదన్న రఘురామకృష్ణంరాజు, ప్రజలు ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్లాలని, లేకపోతే తమకు తెలియజేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవసరమైతే ఐపీఎస్ అధికారులే కోర్టులకు వెళ్లాలని, ప్రజలెందుకు వెళ్తారని ప్రశ్నించారు .

ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించకూడదనే నిబంధన ఏమీ లేదు

ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించకూడదన్న నిబంధన ఏదీ లేదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. అక్కడ ఉండేది కూడా వ్యక్తులేనని, ఏ వ్యక్తి తప్పులకు అతీతుడు కాదన్న ఆయన, ఆ పోస్టులో ఉన్నంత మాత్రాన పునీతులు కారని చెప్పారు. పౌరులుగా ప్రతి ఒక్కరినీ ప్రశ్నించే అధికారం మనకు ఉందని, ఎవరినైనా ప్రశ్నించవచ్చునన్నారు. ప్రధానమంత్రిని లోక్ పాల్ కు వెళ్లి ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. అందులో తప్పేమీ లేదన్న ఆయన, తప్పు జరిగితే ప్రశ్నించకపోవడం వల్ల ఈ పుట్టకే దండగ అని అన్నారు. చక్కగా ప్రొసీజర్ ను అనుసరించని ప్రభుత్వ అధికారులను ఈనాడు దినపత్రిక, ప్రశ్నిస్తే ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా? అని నిలదీశారు.

జగనన్న మద్యం… వైకుంఠానికి సిద్ధం

జగనన్న మద్యం సేవిస్తే వైకుంఠ యాత్ర కు సిద్ధం కావాల్సిందేనని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. జగనన్న మద్యం సేవించి ఆసుపత్రులలో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఉత్పత్తి చేస్తున్న మద్యంలో మాదకద్రవ్యాలను కూడా కలుపుతున్నారన్న అభియోగాలు వినిపిస్తున్నాయన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, మరో రెండు రెండు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని సేవించకుండా దూరంగా ఉండాలని కోరారు.

బయట ఊరు నుంచి ఈ పనికిమాలిన ప్రభుత్వం మద్యం కూడా తెచ్చుకొని ఇవ్వడం లేదని, ఇక్కడి మద్యమే తాగి చావాలి అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం మరో రెండు నెలల వ్యవధిలో అధికారంలో నుంచి దిగిపోవడం ఖాయమని, జూన్ 4వ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికవుతారన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత ఐదు, ఆరు రోజుల వ్యవధిలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలను చేపట్టిన అనంతరం, ఈ చెత్త మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి కంపెనీ లే వెనక్కి తీసుకుంటాయని చెప్పారు.

 

ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో కూటమిదే విజయం

ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ వైకాపా 100% విజయాన్ని సాధించగా, ఇప్పుడు అదే నియోజకవర్గాలలో తెదేపా నేతృత్వంలోని కూటమి మూడవ వంతు స్థానాలను కైవసం చేసుకోబోతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడని, ప్రజల మనసు మారిందని కొన్ని దొంగ సర్వేలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజల మనసు మారింది లేదని, జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదన్నారు.

పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ ఎస్సీ నియోజకవర్గాలలో సర్వే నిర్వహించగా 29 స్థానాలకు గాను 22 స్థానాలలో టీడీపీ కూటమినే విజయం సాధిస్తుందని తేలిందన్నారు. ఎస్టీ నియోజకవర్గాలలోను దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు . ఎస్ సి, ఎస్టీ నియోజకవర్గాలలో ఈ పరిస్థితి నెలకొందంటే వైకాపా ఎత్తిపోక మరిమవుతుందన్నారు. కూటమి అభ్యర్థుల ఎంపికలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్న మాట నిజమే నన్న ఆయన, వాటిని సరి చేసుకుంటామని తెలిపారు . గత 20 నుంచి 25 రోజులుగా కూటమి నుంచి వేరొక అభ్యర్థికి సీటు కేటాయించినప్పుడు, కూటమిని నమ్మడానికి వీలు లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందన్నారు.

లక్షలాదిమంది ప్రజలు బాధపడ్డారని చెప్పారు. ఈ సంఘటనను పాలకపక్షం తనకు అనుకూలంగా వాడు కుందని చెప్పారు. మొన్ననే నేను తెదేపాలో చేరాను. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటాను. కచ్చితంగా కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపడుతారన్నారు. ఇందులో ఎటువంటి సందేహం అక్కరకు లేదన్నారు.

సిద్ధం సభలకు 20వేల మంది సిద్ధం

రాయలసీమ జిల్లాలలో ఎక్కడ సిద్ధం సభలు జరిగిన తరలించడానికి 20వేల మందిని జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సర్కస్ కంపెనీ తరహాలో, ఈ 20వేల మందిని ఎక్కడ సభలు జరిగినా తరలిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

సాక్షి దినపత్రికలో రఘురామకృష్ణం రాజు ఒక రాజకీయ దళారీ అని నీతిమాలిన రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రాజకీయ దళారీ నైతే, మొదటి లిస్టులోనే నా పేరు ఉండి ఉండేది కదా అని ప్రశ్నించారు. ఇటువంటి పనికిమాలిన, చెత్త రాతలు రాసే ఆ సాక్షి యాజమాన్యం, డర్టీ ఎడిటర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నోటికొచ్చినట్లు వార్తలు రాస్తే సహించేది లేదు డాఫర్ నా కొడకా అంటూ హెచ్చరించారు.

LEAVE A RESPONSE