– టీడీపీ, చంద్రబాబు, లోకేశ్ లతో పెట్టుకుంటే గుడివాడ అమర్నాథ్ జీవితాంతం కోడిగుడ్డుపై ఈకలు పీక్కోవాల్సిందే
• గుడివాడ అమర్నాథ్ కు కోడి..గుడ్లు అని కథలు చెప్పడం తప్ప పరిశ్రమలు తీసుకురావడం తెలియదు
• కోడిగుడ్ల మంత్రిగా పేరుపొందిన అమర్నాథ్ కు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చిన లోకేశ్ ను విమర్శించే అర్హత ఎక్కడిది?
• టీడీపీ హాయాంలో లోకేశ్ తీసుకొచ్చిన పరిశ్రమలపై, ఈ ఐదేళ్లలో మీరు పాల్పడిన అవినీతిపై మేం చర్చకు సంసిద్ధం
• చంద్రబాబు ఆలోచనలకు అభివృద్ధి ప్రతిరూపమైతే.. ఆరాచకం జగన్ నైజానికి నిదర్శనం
• కార్పొరేటర్ గా గెలిపించిన టీడీపీని కాదని, అమర్నాథ్ నేరచరితుడైన జగన్ పంచన చేరాడు
• లోకేశ్ ప్రజాకొలిమిలో సానబెట్టబడిన గడ్డపలుగు లాంటి వాడనే విషయం గ్రహించి వైసీపీనేతలు నోళ్లు తెరిస్తే మంచిది
• చంద్రబాబు, టీడీపీతో పెట్టుకుంటే, అమర్నాథ్ జీవితాంతం కోడిగుడ్డుపై ఈకలు పీక్కోవాల్సిందే
– టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
శంఖారావం బహిరంగ సభలద్వారా లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వారిలో చైతన్యం తీసుకొస్తూ, వారి ఎదుటే తమ బాగోతాలు బయటపెడుతున్నాడన్న అక్కసుతో అధికారపార్టీ నేతలు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, పిచ్చికూతలు కూస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
“యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా వైసీపీనేతలు లోకేశ్ ను తూలనాడి..నోటికొచ్చినట్టు మాట్లాడారు. వారి వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా తనదైన శైలిలో ఆయన ప్రజల్ని మెప్పించి, వారి ఆదరాభిమానాలు పొంది, తాను నిప్పులకొలిమిలో సానబెట్టబడిన పదునైన పలుగునని నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా వైసీపీ నేతలు, మంత్రుల కారుకూతల్ని పట్టించుకోకుండా, వారి అవినీతిని నిరూపిస్తూ జనంలో దోషులుగా నిలబెట్టడమే ధ్యేయంగా లోకేశ్ శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు.
గుడివాడ అమర్నాథ్ సహా మంత్రులందరికీ తమ శాఖలేమిటో, వాటిలో జరిగే వ్యవహారాలేమిటో కూడా తెలియదు. కోడిగుడ్ల మంత్రిగా పేరుపొందిన గుడివాడ అమర్నాథ్ .. లోకేశ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయనకొక సవాల్ విసురుతున్నాం.
అమర్నాథ్ వెకిలివేషాలు..పిచ్చికూతలు కట్టిపెట్టి తన మూలాలు తెలుసుకొని మాట్లాడాలి
లోకేశ్ ను విమర్శించడం ఆపేసి, ఆయన గతంలో ఎంతదూరం పాదయాత్ర చేశాడో అంతదూరం అమర్నాథ్ నడవగలడా అని ప్రశ్నిస్తున్నాం. మంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమల్లో, అమర్నాథ్ మంత్రిగా పదోవంతైనా తీసుకొచ్చాడా?. అమర్నాథ్ వెకిలి వేషాలు కట్టిపెట్టి, తనమూలాలు తెలుసుకొని మాట్లాడాలి. అమర్నాథ్ తల్లి గుడివాడ నాగమణి గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2004లో పెందుర్తి నుంచి పోటీచేశారు. తిరిగి ఆమె 2019లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
ఆమె వారసుడిగా అమర్నాథ్ తెలుగుదేశం కార్పొరేటర్ గా వెలగబెట్టి, చివరకు జగన్ విసిరిన కుక్కబిస్కెట్లకు ఆశపడి, ఆయన పంచన చేరాడు. తమస్థానాలు మారుస్తున్న జగన్ రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యేలు ఏదో ఒక సందర్భంలో ప్రశ్నిస్తుంటే, అమర్నాథ్ మాత్రం కట్టుబానిసలా ముఖ్యమంత్రి కాళ్లవద్దే ఊడిగం చేస్తున్నాడు. అనకాపల్లి నియోజకవర్గం నుంచి పెందుర్తికి మార్చినా అమర్నాథ్ నోరెత్తలేదు. అందుకు కారణం జగన్ రెడ్డిని ప్రశ్నించే ధైర్యం అమర్నాథ్ కు లేకపోవడమే. తిరిగి జగన్ మెప్పుపొంది, అనకాపల్లి సీటు పొందాలన్న కుక్కబుద్ధితోనే అమర్నాథ్ టీడీపీ యువనేత లోకేశ్ పై విమర్శలు చేస్తున్నాడు.
చంద్రబాబు పేరు చెబితే హైటెక్ సిటీ, కియా పరిశ్రమలు గుర్తుకొస్తే, జగన్ రెడ్డి పేరు చెబితే గొడ్డలి గుర్తొస్తుంది
గతంలో లోకేశ్ ఐటీ మంత్రిగా రాష్ట్రానికి ఎన్నిపరిశ్రమలు తీసుకొచ్చి, ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పడానికి మేం సంసిద్ధం. ఈ అంశంపై మాతో చర్చకు అమర్నాథ్ సిద్ధమా? విశాఖపట్నంలో హెచ్.సీ.ఎల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఏ.ఎన్.ఎస్.ఆర్, జోహో, గ్రూపో, ఆంటిలినో, స్టేట్ స్ట్రీట్ వంటి స్వదేశీ, విదేశీ కంపెనీలతో పాటు, ఐటీ టెక్ పార్కులు నిర్మించిన ఘనత లోకేశ్ ది. రాజధాని ప్రాంతాలైన మంగళగిరి, విజయవాడల్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయిం చి, యువతకు ఉద్యోగాలు ఇచ్చారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించారు. లోకేశ్ మాదిరే.. మంత్రిగా తానుచేసిన గొప్ప పనులు ఇవని అమర్నాథ్ చెప్పగలడా? చంద్రబాబుని చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నిర్మించిన హైటెక్ సిటీ, విభజనాంతర ఏపీలో సచివాలయం, హైకోర్టు, శాసనసభ, కియాపరిశ్రమ, అమరావతి, పోలవరం నిర్మాణాలు గుర్తు కొస్తే, అమర్నాథ్ ను చూస్తే కోడి..అదిపెట్టే గుడ్డు గుర్తుకొస్తాయి. జగన్ రెడ్డిని చూస్తే ఏకంగా బాబాయ్ ను బాత్రూమ్ లో పడుకోబెట్టిన గొడ్డలి గుర్తొస్తుంది. మీ నాయకుడిది గొడ్డలి సంస్కృతి, విధ్వంసపాలన అయితే, మా నాయకుడి సంస్కృతి పేదల కడుపు నింపడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, యువతకు ఉద్యోగాలివ్వడమని తెలుసుకో అమర్నాథ్.
చంద్రబాబు, టీడీపీపై విమర్శలు మానేసి, అమర్నాథ్ ఇంట్లో కూర్చొని కోడిగుడ్లు పిసుక్కుంటే మంచిది
మంగళగిరి నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మాదిరే జగన్ తననుకూడా వెనక్కు పిలిచి అనకాపల్లి సీటు ఇస్తాడని అమర్నాథ్ భ్రమల్లో ఉన్నట్టున్నాడు. ఆళ్ల వెనక అయోధ్యరామిరెడ్డి ఉన్నందునే జగన్ అతన్ని తిరిగి పిలిపించాడని, తన వెనకుంది కోడి..అది పెట్టే గుడ్లేననే వాస్తవాన్ని అమర్నాథ్ తెలుసుకోవాలి. (గుడ్డు పెడుతున్న కోడి ఫోటోను మాణిక్యరావు ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు) అమర్నాథ్ .. టీడీపీపై, లోకేశ్ పై, చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకొని ఇంట్లో కూర్చొని గుడ్లు పిసుక్కుంటే మంచిది. జగన్ రెడ్డి కాళ్లుపట్టుకుంటే కోరుకున్న చోట అమర్నాథ్ కు సీటు వస్తుందేమో గానీ, చంద్రబాబు, టీడీపీతో పెట్టుకుంటే జీవితాంతం కోడిగుడ్డుపై ఈకలు పీక్కునే పరిస్థితి వస్తుందని అమర్నాథ్ ను హెచ్చరిస్తున్నాం.
అమర్నాథ్ స్థాయికి అతనితో లోకేశ్ చర్చకు రావాలా…నేను సంసిద్ధంగా ఉన్నాను. నాలుగున్నరేళ్లు గా చేయాల్సిన విధ్వంసాలు, దారుణాలు అన్నీ చేసిన జగన్ రెడ్డి.. చివరకు ఇప్పుడు ఏకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్న మీడియాపై దాడులకు పాల్పడు తున్నాడు. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి..ఇలాంటి చర్య లకు పాల్పడుతున్నాడు. దాడులు.. దౌర్జన్యాలు..గూండాయిజంతో అధికారం దక్కుతుంది అనుకోవడం జగన్ రెడ్డి, వైసీపీనేతల భ్రమే.” అని మాణిక్యరావు తేల్చిచెప్పారు.