పివి ని కాంగ్రెస్ అవమానిస్తే .. బిజెపి భారతరత్న ఇచ్చి గౌరవించింది

– మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్

విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో భారత రత్న అవార్డు ను భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరశింహ రావు కు ప్రకటించిన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో పివి నరశింహ రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి సంస్మరణ సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ పివి నరశింహ రావు ను కాంగ్రెస్ అవమానిస్తే బిజెపి భారతరత్న ఇచ్చి గౌరవించింది. పరిపాలన దక్షత కలిగి న పివి ఆయన ప్రధానమంత్రి గా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు

ఆయన మృతిచెందిన సమయం లో కాంగ్రెస్ నాయకులు , ముఖ్యంగా సోనియా గాంధీ వ్యవహరించిన తీరు దేశ ప్రజలు మరువలేదని అన్నారు. సాహిత్య వేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు గా మాధవ్ కీర్తించారు. ఉప ప్రధాని అద్వానీ,కర్పూరీ ఠాకూర్, చరణ్ సింగ్, స్వామినాథన్ లకు భారత రత్న లు ఇచ్చి గౌరవించిన ఘనత కేంద్రం లో ని బిజెపి కి దక్కుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీ ధర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply