– నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది కాంగ్రెస్ నేతల తీరు
– రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శించిన కాంగ్రెస్ నేతలకు ట్రిపుల్ ఆర్ మీద కనీస అవగాహన లేదు
– ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? కేంద్రం ఎప్పుడు ఒప్పుకుంది? కనీస అవగాహన లేని వారి విమర్శలకు చింతిస్తున్నా
– అలైన్మెంట్ మార్పు పై నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా అజ్ఞానముతో మాటలు మాట్లాడారు
– మీరు సుద్ద పూసలే అయితే, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులో తప్పులు చేయకపోతే స్వచ్చందంగా సిబిఐ విచారణ కోరండి
– కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పు పై కాంగ్రెస్ భాగోతాన్ని బయట పెట్టగానే కాంగ్రెస్ ఆత్మ రక్షణలో పడి బిఆర్ఎస్ పై పస లేని ఆరోపణలకు దిగిందని మాజి మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎంపి మల్లు రవి,అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు.
“నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది కాంగ్రెస్ నేతల తీరు.ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు వెనుక అరాచకాలు బయటపెట్టగానే తేలు కుట్టిన దొంగలా అయింది కాంగ్రెస్ పరిస్థితి. రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శించిన కాంగ్రెస్ నేతలకు ట్రిపుల్ ఆర్ మీద కనీస అవగాహన లేదు.
ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన ఎవరు చేశారు.. ఎన్నడు చేశారు..కేంద్రం ఎప్పుడు ఒప్పుకుంది..కనీస అవగాహన లేని వారి విమర్శలకు చింతిస్తున్నాను. అలైన్మెంట్ మార్పు పై నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా , అజ్ఞానంతో మాటలు మాట్లాడారు. మా హయాంలో ట్రిపుల్ ఆర్ పై పది ఏండ్లలో ఎం పని జరగలేదు అని అనడం మీ అవగాహన రహిత్యానికి నిదర్శనం.
ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు అనుమతులు 2021లో కేసిఆర్ ప్రభుత్వ హయంలోనే వచ్చాయి. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను భారత్ మాల ఫేజ్ 1 లో చేర్చుతూ 2021 మార్చి 5న NHAI అప్రూవల్ ఇచ్చారు. 2021 డిసెంబర్ 6న అలైన్మెంట్ అప్రూవ్ అయింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది 2023 అక్టోబర్ లో..అంటే 10 ఏళ్లు కాదు..కేవలం ఒక సంవత్సరం 10నెలల్లో భూ సేకరణ స్టార్ట్ చేసి 76 శాతం 3D పూర్తి చేశాం. పేద ప్రజలకు ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్వియేషన్ ప్రాసెస్ చేసింది గత మా ప్రభుత్వం.
మీ భూములు ఉన్న చోటికి అలైన్మేంట్ మారుస్తున్నారా లేదా ? అమాయక పేద ప్రజలను బెదిరిస్తూ కబ్జా ఒప్పంద రద్దు పత్రాలు రాసుకుంటున్నారా లేదా ? మీ జిల్లాలోని కుందారం భూములను పేద ప్రజల నుండి లాకుంటున్న భూబకాసురుల పక్షాన నిలబడి, కండ్లు ఉండి చూడలేక పేద ప్రజల కడుపు కొడుతోంది మీరు.
రీజనల్ రింగ్ రోడ్డు పై నేను లేవనెత్తిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పకుండా, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. మీ ఊకదంపుడు ఉపన్యాసాలకు,బెదిరింపులకు భయపడేది లేదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేయకుంటే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు పై స్వచ్ఛందంగా సిబిఐ విచారణ కోరండి. మీరు సుద్ద పూసలే ఐతే సిబిఐ విచారణ కోరండి. అలైన్మెంట్ మార్పు లో మీ బాగోతాలు బిఆర్ఎస్ ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటది.