సీఎం అయితే కోర్టుకెళ్లరా?

– జగన్, అద్వానీని ఆదర్శంగా తీసుకోవాలి
– సామాన్య మానవుడికి చట్టం మీద గౌరవం తగ్గదా?
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు 11, సిబిఐ కేసులు 12, మొత్తం ఇరవై మూడు కేసులు ఉన్నాయి. ఇవి గత 12 సంవత్సరాలుగా కొనసాగుతునే వున్నాయి . వివిధ కారణాలు చెప్పి వాయిదాలు తీసుకుంటూ కొనసాగిస్తున్నారు.సుప్రీంకోర్టు రాజకీయ నాయకుల మీద వున్న కేసులును సంవత్సరం లోపల పూర్తిచేయాలని చట్టం చేసి ఉంది. మీరు ముఖ్యమంత్రి అయితే కేసులను కొనసాగిస్తూ పోతారా? దానికి సమయం కేటాయించి పూర్తి చేసుకోరా?చాలామంది అధికారంలో ఉన్న నాయకులకు, కేసులు ఉన్నవాళ్ళు కోర్టులకు రాకుండా సాకులు చెప్పి కొనసాగించు పరిస్థితి దేశంలో చాలా తక్కువ.
రాజ్యాంగాన్ని చట్టాన్ని రక్షించవలసిన బాధ్యత రాజకీయ నాయకుడిగా మీ మీద లేదా? మీ అడ్వకేట్లు ఏదో ఒక వంక , సాకు చూపించి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు. వారు రోజు కోర్టుకు రావాలంటే యంత్రాంగం ఆగిపోతుందని కోర్టులకు చెబుతున్నారు ఎంతకాలం చెబుతారు?
ఆ విషయం మీద కింది కోర్ట్ మీ వాదనను కొట్టి వేస్తే హైకోర్టుకు పోతున్నారు. అక్కడ కొట్టి వేస్తే సుప్రీంకోర్టుకు పోతారు.ఇదంతా కాలయాపన చేయడం కాదా ? ప్రభుత్వ డబ్బును వందల కోట్లు మీరు కోర్టు కుపోకుండా ఉండే దాని కోసం, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టులకు ఖర్చు పెట్టడం, ప్రజల డబ్బును దుర్వినియోగ పరిచి సొంతంగా వాడుకోవడమే. ఇది ప్రజలకు అర్థమవుతూనే ఉంది.
మీకు నిజంగా కేసులన్నీ పూర్తి చేసుకోవాలని దృక్పథం ఉంటే మార్గాలు లేవా ? మీ క్యాబినెట్ లో ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. నిజంగా అడ్మినిస్ట్రేషన్ నడవాలని మీకుంటే వారిలో ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగించి మీరు కేసులు పూర్తయ్యే వరకు సహకరించవచ్చు కదా ? ఏ రోజుకైనా కేసులు పూర్తి కావాలి కదా ?
ఎంతకాలం కొనసాగిస్తారు? సామాన్య మానవుడికి చట్టం మీద గౌరవం తగ్గదా? భారతీయ జనతాపార్టీ అగ్రనాయకులు లాల్ కృష్ణ అద్వానీ గారి మీద బాబరీ మసీదును కూల గొట్టారనే (రామజన్మభూమి) కేసులో ముద్దాయిగా చేస్తే , అప్పటివరకు కేంద్ర హోం మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఉన్న ఆయన.. వెంటనే పదవులకు రాజీనామా చేసి కేసు పూర్తయ్యే వరకు.. నేను రాజ్యాంగ పదవులు మంత్రి పదవి చేపట్టనని రాజీనామా చేశారు.
మీరు నిజాయితీగా, కేసులను సత్వరంగా పరిష్కారం చేసుకుంటే మీకు మంచిది. ఇది రాష్ట్రానికి మంచిది దేశంలో ప్రజాస్వామ్య బతికి బట్ట కడుతుంది.

– కరణం భాస్కర్
బిజెపి
నెల్లూరు ,
మొబైల్ నెంబర్ 7386128877.

Leave a Reply