జగన్ రెడ్డి పాలనలో తల్లికీ, చెల్లికే రక్షణ లేదు

– జగన్ రెడ్డి ప్రచార పిచ్చిలో భాగంగా ఓ నిండు ప్రాణం బలైంది
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి

వైసీపీ ఫేక్ ప్రచారాలతో ప్రజలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు. గీతాంజలి హత్యను శవ రాజకీయాలు చేస్తూ ఆ రక్తపు మరకను టీడీపీ-జనసేనకు అంటించడం దుర్మార్గం. అమాయకపు ప్రజలతో సంక్షేమ పథకాల గురించి అబద్దపు ప్రచారాలు చేయిస్తున్నారు. ఈ నెల 7వ తారీఖున ప్రమాదానికి గురైన వైసీపీ కార్యకర్త గీతాంజలి హత్య వెనుక నిజాలను ఇప్పటి వరకు తెలుసుకోకపోవడంలో అంతర్యమేమిటి?

ఎఫ్‌ఐఆర్ లో ఈ హత్యకు కారణాలు తెలియదు అని క్లుప్తంగా రాసినా జగన్ రెడ్డి నీలి మీడియాలో ‘ఓ చెల్లెమ్మను చంపేశారు’ అని పెద్ద అక్షరాలతో ముద్రించారు. టీడీపీ-జనసేన మద్దతు దారుల ట్రోలింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుందని ప్రతి పక్షాలపై బురద చల్లడం సిగ్గు చేటు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ రెడ్డి ఓడిపోతారనే హయంతో ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేయిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రచార పిచ్చిలో భాగంగా ఓ నిండు ప్రాణం బలైంది.

గతంలో బాబాయి హత్యను కూడా ‘నారాసుర రక్త చరిత్ర’ అని చంద్రబాబుకు రక్తపు మరకలు అంటించే ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి పాలనలో తల్లికీ, చెల్లికే రక్షణ లేకుండా పోయింది. పేద ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారు. బాబాయి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యుల వేళ్లన్నీ జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నా ఇంకా కేసును అబద్దాల చుట్టూ తిప్పాలని ప్రయత్నించడం దుర్మార్గం. గీతాంజలి హత్య వెనుకున్న నిజనిజాలు తెలుసుకుని దోషులకు శిక్ష విధించాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డికి బుద్ది చెప్పి ఇంటికి పంపడం ఖాయం.

Leave a Reply